Breaking News

Daily Archives: September 22, 2017

మాతాశిశు మరణాలు జరగకుండా చూడాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మాతాశిశుమరణాలు సంభవించకుండా చూడాలని, ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కామరెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం స్త్రీ, శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని గర్భిణీలకు పోషకాహారం విధిగా అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, చిన్నారులకు ఇమ్యునైజేషన్‌ టీకాలు చేయాలన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కష్టతరమైన సమస్యలున్న గర్భిణీల వివరాలు తెలిపితే వారికి కావాల్సిన ...

Read More »

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పర్యవేక్షణ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కంట్రోల్‌ రూంను శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పర్యవేక్షించారు. ఇప్పటి వరకు కంట్రోల్‌ రూంకు ఫోన్‌ ద్వారా 26 వినతులు అందాయని అధికారులు తెలిపారు. సంబంధిత వివరాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందజేసినట్టు తెలిపారు. ఆర్జీల వివరాలు, సంబంధిత రికార్డులను కలెక్టర్‌ పరిశీలించారు. రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవోలు శ్రీను, దేవేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, సిబ్బంది ...

Read More »

38 మద్యం దుకాణాలకు లక్కీడ్రా

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 2017-18 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ద్వారా 38 దుకాణాల కోసం గురువారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ లక్కీ డ్రా నిర్వహించారు. తద్వారా అర్హులను ఎంపిక చేశారు. 448 మంది ఇందుకోసం పోటీపడగా 38 మందిని ఎంపిక చేశారు. కామారెడ్డి మద్యం దుకాణానికి రామారెడ్డి, బిచ్కుంద షాప్‌ నెం. 1 బాల్‌రెడ్డి, షాప్‌నెం.2 రామకృష్ణ, నెం. 3 శ్రీనివాస్‌రెడ్డి, పిట్లం -స్వాతి, నెం.2 మాధవి, జుక్కల్‌- సంతోస్‌, మద్నూర్‌-సంతోష్‌, ...

Read More »

ఘనంగా బతుకమ్మ సంబరాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అంగడిబజార్‌ మైదానంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రంగు రంగుల పూలతో తయారుచేసిన బతుకమ్మలను మహిళలు అక్కడికి తీసుకొచ్చి ఒక్క దగ్గరకు చేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడుతున్నారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి ముత్తైదువలు పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. నైవేద్యాలు, ప్రసాదాలు పంచిపెడుతూ ఆనందంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.

Read More »