Breaking News

Daily Archives: September 23, 2017

అనాథాశ్రమం సందర్శన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17వ వార్డు వాసులు శనివారం అనాథాశ్రమాన్ని సందర్శించారు. అక్కడున్న చిన్నారులను, వృద్దులను అడిగి వారి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ మాట్లాడుతూ అందరూ ఉండి నిరాదరణకు గురై కొందరు అనాధలుగా మారగా, అందరిని పోగొట్టుకొని మరికొందరు అనాథలుగా మారారన్నారు. వారికోసం తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

Read More »

సత్యశోధక్‌ సమాజ్‌ గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్‌ సమాజ్‌ 145వ వార్షికోత్సవ గోడప్రతులను శనివారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. పివైఎల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ పోస్టర్లు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాఫూలే 1872లో స్త్రీలకు, దళితులకు చదువు దూరం చేసిన అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా అంటరానితనం నిర్మూలించాలని, స్త్రీ, పురుష సమానత్వం కోసం సత్యశోధక్‌ సమాజ్‌ను స్థాపించి చదువును అందించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు, దళితులు, గిరిజన, మైనార్టీలపై పరోక్షంగా దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. ...

Read More »

తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బతుకమ్మ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం రూపొందించిన బతుకమ్మను అధికారులు జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు. అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మ చూపరులను ఆకట్టుకుంటుంది. అధికారులు దగ్గరుండి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చౌరస్తా వద్ద ఎత్తైన, అందమైన బతుకమ్మను ఉంచారు.

Read More »

ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో శనివారం మహిళా ఉద్యోగులు బతుకమ్మలు ఆడారు. ఉద్యోగినులంతా కలిసి బతుకమ్మలను రంగు రంగుల పూలతో అందంగా పేర్చి ప్రగతిభవన్‌ ప్రాంగణంలో, రోడ్డుపై బతుకమ్మ ఆటలు ఆడుతూ, పాడుతూ వేడుకలు నిర్వహించారు. అనంతరం నిమజ్జనం చేశారు.

Read More »

మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించాలి

  మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం సహాయక గ్రూపు మహిళలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో సాధికారత సాధించాలని ఏపిఎం ప్రమీల అన్నారు. శనివారం మోర్తాడ్‌లోని ఇందిరా కాంతి పథం కార్యాలయంలో సిఎల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సిసిలు, సిఎలు, వివోలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా నిజామాబాద్‌

  మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీ జయంతి రోజున నిజామాబాద్‌ జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించనున్నట్టు డ్వామా పిడి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మోర్తాడ్‌లోని ఇజిఎస్‌ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి ఉపాధి హామీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 88 వేల 789 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేశామని, మరో 500 నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 99 వేల 454 మరుగుదొడ్ల నిర్మాణానికి దరఖాస్తు ...

Read More »

పంటకాలువ నిర్మాణ పనులు ప్రారంభం

  మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం గ్రామస్తులు శనివారం పంట కాలువ నిర్మాణం పనులను స్వచ్చందంగా చేపట్టారు. పాలెం గ్రామ చెరువు నింపేందుకు చౌట్‌పల్లి మన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం, పెదవాగు నుంచి చేపట్టిన ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను గత దశాబ్ద కాలం క్రితం చేపట్టినప్పటికి గ్రామచెరువులకు చుక్కనీరు రావడం లేదు. దీంతో పాలెం గ్రామంలో చెరువు నిండక కరువు ఏర్పడడంతో శనివారం గ్రామస్తులు ఇంటికొక్కరు చొప్పున తరలివచ్చి మోర్తాడ్‌, పాలెం గ్రామాల మధ్యగల వరద ...

Read More »

చురుకుగా బైపాస్‌ రోడ్డు పనులు

  నందిపేట, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం పాత పెట్రోల్‌ పంప్‌ నుంచి మండల సముదాయం పక్కనుంచి షాపూర్‌ రోడ్డును కలపడానికి నందిపేట బైపాస్‌ రోడ్డును ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. శనివారం ఉదయం నుంచే గుత్తేదారులు చురుకుగా పనులు చేయిస్తున్నారు. నందిపేటకు రోడ్డు నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్‌ సమస్య దూరమవుతుందని, గ్రామం అభివృద్ది చెందుతుందని ప్రజలు అంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు జిల్లా ...

Read More »

బైక్‌ గుంతలో పడి విద్యార్థి మృతి

  నందిపేట, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం ఐలాపూర్‌ శివారులోని నందిపేట నుంచి నవీపేట వెళ్లే రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవిద్యార్థి మృతి చెందగా, మరో యువకునికి గాయాలయ్యాయి. నందిపేట ఎస్‌ఐ జాన్‌రెడ్డి కథనం ప్రకారం నవీపేట మండలం పోతంగల్‌ గ్రామపంచాయతీ పరిధిలోని శివతాండాకు చెందిన షఫీక్‌ (15) బంధువులతో కలిసి నందిపేట మండలం మల్లారం దర్గాకు వచ్చి అబ్దుల్‌ సమీర్‌తో తిరుగు ప్రయాణం అవుతుండగా బైక్‌ నెంబరు ఎపి 25 – ...

Read More »