Breaking News

Daily Archives: September 24, 2017

సౌదీ విమానానికి తప్పిన ముప్పు

చెన్నై పైలెట్‌ అప్రమత్తతో సౌదీ అరేబియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. విమానంలోని 261 మంది ప్రయాణికులు ప్రాణగండం నుంచి బయటపడ్డారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శుక్రవారం రాత్రి 10.30 గంటలకు సౌదీ అరేబియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం జెడ్డాకు బయలుదేరింది. రన్‌వేపై టేకాఫ్‌ చేస్తుండగా దాని వెనుకవైపున ఓ అద్దం పగిలి ఉండటాన్ని పైలెట్‌ గమనించాడు. వెంటనే విమానాన్ని నిలిపివేసి కంట్రోల్‌ రూంకు సమాచారం అందించాడు. ఇంజనీరింగ్‌ నిపుణులు వెళ్లి పగిలిన అద్దాన్ని తొలగించారు

Read More »

చైనా సంచలన ప్రకటన

వాషింగ్టన్: ఉత్తరకొరియా టెక్స్‌టైల్ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోబోమని చైనా వాణిజ్యశాఖ ప్రకటించింది. అంతేకాదు ఉత్తరకొరియాకు క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్ని కూడా నిలిపేస్తామని తెలిపింది. చైనా తాజా ప్రకటనను అమెరికా స్వాగతించింది. చైనా, రష్యాలు మొదట్లో ఉత్తరకొరియా ఎగుమతి, దిగుమతులపై అంక్షల్ని తీవ్రంగా వ్యతిరేకించాయని కానీ, పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని ఐక్యరాజ్యసమితి ఆదేశాలను పాటించడం నిజంగా అభినందించాల్సిన విషయమని అమెరికా తెలిపింది. 2016లో మొత్తం 6వేల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ చైనా నుంచి ఉత్తరకొరియాకు ఎగుమతి జరిగిందని అమెరికా పేర్కొంది. అయితే అక్టోబరు1 నుంచి తాజా ...

Read More »

మగ నెమలి కన్నీరు తాగితేనే ఆడ నెమలి గుడ్లు పెడుతుందంటారు. నిజమేనా?

  జవాబు: సాధారణ ప్రజానీకంలో జంతువుల గురించి ఉన్న అపోహలో ఇది కూడా ఒకటి. పాము పాలు తాగుతుందనుకోవటం, పాము నాగస్వరానికి నాట్యమాడుతుందని అనుకోవటం, పిల్లి ఎదురొస్తే అనుకోని ఆపదలు కలుగుతాయనుకోవడం వంటి అపోహలు ప్రజల్లో ఉన్నాయి. నెమలికయినా, మరే జీవికయినా కన్నీటిలో జీవకణాలు ఉండవు. నెమలి, కోతి, కప్ప, పాము, మనిషి, ఆవులు, గేదెలు వంటి ద్విలింగ జీవులలో పురుష జీవి నుంచి సగం క్రోమోజోములున్న శుక్రకణం, ఆడ జీవిలో సగం క్రోమోజోములున్న అండంతో ఫలదీకరణం (ఫెర్టిలైజేషన్‌) జరిగాక సంయుక్త బీజకణం (జైగోట్‌) ఏర్పడుతుంది. ...

Read More »