Breaking News

Daily Archives: September 25, 2017

ప్రజావాణిలో 71 ఫిర్యాదులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 71 ఫిర్యాదులు జిల్లా యంత్రాంగానికి అందాయి. వీటిలో 22 రెవెన్యూ శాఖకు చెందినవి కాగా, మిగతా ఫిర్యాదులు వివిధ శాఖలకు సంబంధించినవి. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, సిపివో శ్రీనివాస్‌, డిఎంఅండ్‌హెచ్‌వో మధుశ్రీ, డిపిడబ్ల్యువో గంగాధర్‌, బిసి సంక్షేమాధికారి దేవిదాస్‌, ...

Read More »

నీటి నాణ్యత ప్రమాణాలు పాటించాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇందులో అందరు భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నీటి నాణ్యత పరీక్ష ప్రయోగశాలలో పనిచేస్తున్న అధికారులకు, సహాయకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాలుగు జిల్లాల ప్రయోగశాలల ప్రతినిధులుగా శిక్షణ కోసం ఎంపికై వచ్చిన వారికి పలు సలహలు, సూచనలు చేశారు. జిల్లాలో లక్షల మంది ఉన్నప్పటికి 40 ...

Read More »

వైభవంగా ఆలయ ప్రారంభోత్సవం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలోగల రామాలయ ప్రాంగణంలో సోమవారం శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి ఆలయం, ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి నవరత్న కిరీట ధారణ జరిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సతీ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిసేకాలు, హోమం, ...

Read More »

భక్తి శ్రద్దలతో నవరాత్రి ఉత్సవాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన అమ్మవారి మండపాల వద్ద దుర్గమ్మను రోజుకో అవతారంలో అలంకరిస్తున్నారు. అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. భక్తులు అమ్మవారికి సామూహిక కుంకుమపూజలు, సరస్వతి పూజ నిర్వహిస్తున్నారు. ధూప, దీప, నైవేద్యాలతో అమ్మవారిని కొలుస్తున్నారు.

Read More »

రెవెన్యూ రికార్డుల పరిశీలన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం తాడ్వాయి మండలం నందివాడ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న రికార్డుల ప్రక్షాళన తీరును పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి కార్యక్రమం జరుగుతున్న తీరుపై ఆరాతీశారు. అందరూ సమష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట డిప్యూటి తహసీల్దార్‌ సరళ, తదితర అధికారులున్నారు.

Read More »

ఎమ్మెల్యే, ఎంపి చిత్రపటాలకు పాలాభిషేకం

  నందిపేట, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బైపాస్‌ రోడ్డు కల ఎమ్మెల్యే, ఎంపి సహకారంతో పూర్తవుతున్నందున సోమవారం ఉదయం తెరాస నాయకులు వారి చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బైపాస్‌ రోడ్డుతో మండలం ఇంకా అభివృద్ది చెందుతుందని, ప్రజల రవాణా సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నక్కల భూమేశ్‌, మహేందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపిటిసిలు అహ్మద్‌ఖాన్‌, బాల గంగాధర్‌, సర్పంచ్‌ షాకీర్‌, ...

Read More »

ఘనంగా బతుకమ్మ సంబరాలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బతుకమ్మ పండగ వేడుకను మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని వివిధ ఆలయాల్లో మహిళలు బతుకమ్మలను పేర్చి ఆడి, పాడుతూ భక్తి శ్రద్దలతో బతుకమ్మను కొలుస్తున్నారు. పట్టణంలోని వీక్లి మార్కెట్లో సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో వేలాదిగా మహిళలు పాల్గొంటున్నారు. ప్రభుత్వ పథకాలతో వివిధ బతుకమ్మలను రూపొందించి ప్రదర్శిస్తున్నారు. మిషన్‌ భగీరథ, హరితహారంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలను బతుకమ్మల ద్వారా ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇందులో ఉత్తమ ...

Read More »

భూరికార్డుల సర్వే పకడ్బందీగా నిర్వహించండి

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో భూ రికార్డుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య అన్నారు. మండలంలోని దామరంచ గ్రామంలో ఆర్డీవో రాజేశ్వర్‌తో కలిసి భూసర్వేలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం భూరికార్డుల ప్రక్షాళన అని, ఇందుకు అందరూ సహకరించాలని సూచించారు. భూరికార్డుల ప్రక్షాళన అన్ని రకాల భూముల లెక్కలు తేలుతాయని తెలిపారు. వారి వెంట గ్రామ సర్పంచ్‌ శంకర్‌, ఎంపిటిసి గంగాధర్‌, తహసీల్దార్‌ కిష్టానాయక్‌, విఆర్వో ...

Read More »

రోడ్డే ప్లాట్‌ఫాం అయింది…

  నందిపేట, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట నుంచి ఖుదావన్‌పూర్‌ మీదుగా ఆర్మూర్‌ వెళ్లే రోడ్డుపై మక్క కంకులను, మక్కలను ఆరబెట్టడానికి రైతులు ప్లాట్‌ఫాంగా వాడుకుంటున్నారు. రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై ప్లాట్‌ఫాంలు నిర్మించిఇవ్వకపోవడంతో రైతులు తాము పండించిన పంటను రోడ్డుపై ఆరబెట్టుకుంటున్నారు. దీంతో నందిపేట నుంచి ఆర్మూర్‌ వెళ్ళే రోడ్డుపై వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం లక్షలు వెచ్చించి డబుల్‌ రోడ్డు వేశారు. దీనిపై మక్కలు ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేస్తే రోడ్లపై ఆరబెట్టకుండా ...

Read More »

ఐకెపి ఆద్వర్యంలో బతుకమ్మ సంబరాలు

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో సోమవారం ఐకెపి గ్రూపు మహిళలు బతుకమ్మలను పేర్చి మండల అభివృద్ది కార్యాలయం ఆవరణలో బతుకమ్మ ఆడారు. తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమ కారులు ప్రాణాన్ని అర్పించిన విధానం, తెలంగాణ ఔన్నత్యాన్నిపాటల రూపంలో వినిపించారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి భరత్‌కుమార్‌ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో పూల పండుగ చేసుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే అని కొనియాడారు. అనంతరం స్థానిక బాజాన్‌ చెరువులో ...

Read More »

దేవినవరాత్రి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవినవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బీర్కూర్‌ మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం వద్ద లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సోమవారం బహుమతులు ప్రదానం చేశారు. ఆదివారం రాత్రి పోచమ్మ ఆలయం వద్ద సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ప్రథమ, స్థానాల్లో నిలిచిన కళాకారులు, విద్యార్థులకు క్లబ్‌ అధ్యక్షుడు కిషోర్‌ బహుమతి ప్రదానం చేశారు. బీర్కూర్‌ గ్రామంలో అతి పురాతన ఆలయమైన పోచమ్మ ఆలయాన్ని గల్లివాసులు కలిసి అభివృద్ది ...

Read More »

బీర్కూర్‌ మండల ప్రజల సహకారం మరువలేనిది

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల ప్రజల సహకారం మరువలేనిదని బదిలీపై వెళ్తున్న బీర్కూర్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి అన్నారు. సుమారు నాలుగు సంవత్సరాలుగా బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ ఉమ్మడి మండలాల్లో పనిచేశానని, రాజకీయ నాయకులు, విలేకరులు, ఆయా గ్రామాల పెద్దలు, ప్రజలు వృత్తిలో భాగంగా తనకు ఇచ్చిన సహకారం మరువలేనిదన్నారు. బదిలీపై కోటగిరి వెళ్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో ట్రాక్టర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడడంలో, సేవా కార్యక్రమాల ...

Read More »