Breaking News

ఎమ్మెల్యే, ఎంపి చిత్రపటాలకు పాలాభిషేకం

 

నందిపేట, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బైపాస్‌ రోడ్డు కల ఎమ్మెల్యే, ఎంపి సహకారంతో పూర్తవుతున్నందున సోమవారం ఉదయం తెరాస నాయకులు వారి చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బైపాస్‌ రోడ్డుతో మండలం ఇంకా అభివృద్ది చెందుతుందని, ప్రజల రవాణా సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నక్కల భూమేశ్‌, మహేందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపిటిసిలు అహ్మద్‌ఖాన్‌, బాల గంగాధర్‌, సర్పంచ్‌ షాకీర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ...

Comment on the article