Breaking News

రెవెన్యూ రికార్డుల పరిశీలన

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం తాడ్వాయి మండలం నందివాడ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న రికార్డుల ప్రక్షాళన తీరును పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి కార్యక్రమం జరుగుతున్న తీరుపై ఆరాతీశారు. అందరూ సమష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట డిప్యూటి తహసీల్దార్‌ సరళ, తదితర అధికారులున్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article