Breaking News

రోడ్డే ప్లాట్‌ఫాం అయింది…

 

నందిపేట, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట నుంచి ఖుదావన్‌పూర్‌ మీదుగా ఆర్మూర్‌ వెళ్లే రోడ్డుపై మక్క కంకులను, మక్కలను ఆరబెట్టడానికి రైతులు ప్లాట్‌ఫాంగా వాడుకుంటున్నారు. రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై ప్లాట్‌ఫాంలు నిర్మించిఇవ్వకపోవడంతో రైతులు తాము పండించిన పంటను రోడ్డుపై ఆరబెట్టుకుంటున్నారు. దీంతో నందిపేట నుంచి ఆర్మూర్‌ వెళ్ళే రోడ్డుపై వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం లక్షలు వెచ్చించి డబుల్‌ రోడ్డు వేశారు. దీనిపై మక్కలు ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేస్తే రోడ్లపై ఆరబెట్టకుండా ఉంటారని, ప్రమాదాలు జరగకుండా ఉంటాయని స్థానికులు అంటున్నారు.

Check Also

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ...

Comment on the article