Breaking News

వైభవంగా ఆలయ ప్రారంభోత్సవం

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలోగల రామాలయ ప్రాంగణంలో సోమవారం శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి ఆలయం, ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి నవరత్న కిరీట ధారణ జరిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సతీ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిసేకాలు, హోమం, తీర్థ, ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో వేద పండితులు గంగవరం నారాయణశర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article