Breaking News

Daily Archives: September 27, 2017

ఘనంగా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమరయోధుడు , తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్‌ బాపూజీ 102 జయంతి వేడుకలను బుధవారం కామారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలీలు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. ఈ సందర్బంగా వృద్ధాశ్రమంలో యువకులు పండ్లు, బిస్కెట్లు పంపినీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జొర్రీగల లక్ష్మణ్‌, వంగప్రసాద్‌లు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో, తెలంగాణ రాష్ట్ర సాదనలో లక్ష్మణ్‌ బాపూజీ పాత్ర ...

Read More »

లలితసుందరి ఆలయానికి రూ. 5 లక్షల ఎమ్మెల్సీ నిధులు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలో నిర్మించిన లలత మహాత్రిపుర సుందరి ఆలయానికి శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ తన నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేశారు. వీటిని బుధవారం మునిసిపల్‌ మాజీ ఛైర్మన్‌ కైలాస్‌ శ్రీనివాస్‌రావు, షబ్బీర్‌ అలీ సోదరుడు మహ్మద్‌ నయీమ్‌, జడ్పిటిసి నిమ్మ మోహన్‌రెడ్డిలు ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి నిధులు అందజేసినందుకు ...

Read More »

ప్రతి పాడి రైతు ఆరుమొక్కలు నాటాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి పాడి రైతు విధిగా ఆరుమొక్కలు నాటాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. దోమకొండ మండలం ముత్యంపల్లి గ్రామంలో బుధవారం డైరీలకు పాలుపోసే రైతులకు ఒక్కొక్కరికి ఆరు మొక్కల చొప్పున అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనలతో కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. చెట్లు నాటితే మనిషి స్థితిగతులు మారుతాయని, ఒకప్పటి ముసుర్లు ఈ తరానికి తెలియవని, దాన్ని తిరిగి సాధించుకోవాలని కాంక్రీట్‌ జంగిల్‌ కాకుండా చుట్టు మొక్కలు ...

Read More »

అట్టహాసంగా లలితమహాత్రిపురసుందరి దేవి ప్రతిష్టాపన మహోత్సవం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్‌ కాలనీలో బుధవారం లలితా మహాత్రిపుర సుందరి దేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తోగుట రాంపురం పీఠాధిపతి మాధవానంద సరస్వతి మహాస్వామి హాజరై యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. శ్రీప్రసన్నాంజనేయ దేవాలయంలో ప్రతిష్టాపన జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం, తదితర కార్యక్రమాలు జరిపారు. స్వామివారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలయ్య, ప్రతినిధులు సిదారెడ్డి, ...

Read More »

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి లక్ష్మణ్‌ బాపూజీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు ఎనలేనివని పద్మశాలీలు అన్నారు. బాపూజీ 102వ జయంతి వేడుకలను కామారెడ్డిలో బుధవారం పట్టణ పద్మశాలీ సంఘం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలీ భవనం నుంచి ప్రధాన వీదుల గుండా ర్యాలీ నిర్వహించారు. బాపూజీ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు చేర్ల లక్ష్మణ్‌, మాజీ అధ్యక్షుడు చాట్ల రాజేశ్వర్‌లు ...

Read More »

లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాల కోసం కృషి చేయాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను ఈ తరంలో అందరూ గుర్తుచేసుకోవాలని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ అన్నారు. బాపూజీ 102వ జయంతి వేడుకలను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలలువేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కామరెడ్డిలో లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని గత ఏడాది ప్రతిష్టించినట్టు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల ...

Read More »

ఉచిత ఆరోగ్య శిబిరం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవసేవే మాధవ సేవ అని భావించి కొందరు యువత గ్రూప్‌ ఆఫ్‌ హెల్పింగ్‌ ఫ్రెండ్స్‌గా ఏర్పడి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసినట్టు సంస్థ అధ్యక్షుడు విఠల్‌ రాథోడ్‌ అన్నారు. బుధవారం శశాంక్‌ ఫౌండేషన్‌ వారి సహకారంతో గ్రూప్‌ ఆఫ్‌ హెల్పింగ్‌ ఫ్రెండ్స్‌ ఆద్వర్యంలో ఉచితంగా ఆరోగ్య శిబిరం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ గోపి శిబిరాన్ని ప్రారంభించగా శశాంక్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ...

Read More »

ఘనంగా కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతి

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ గాంధీ కొండాలక్ష్మణ్‌ బాపూజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడివో భరత్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ కోసం అహర్నిశలు తన ఆలోచనను, పోరాటాన్ని వ్యక్తం చేసిన మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. బాపూ చూపిన మార్గదర్శనంలో యువత నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.

Read More »

భూప్రక్షాళన సర్వేలో అధికారుల పనితీరు భేష్‌

  మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఏర్గట్ల తహసీల్దార్‌ ముల్తజుద్దీన్‌ ఆద్వర్యంలో గత 12 రోజులుగా కొనసాగుతుంది. బట్టాపూర్‌ గ్రామ పంచాయతీలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనను నిబందనల మేరకు అధికారులు ప్రతి దరఖాస్తు పరిశీలిస్తున్నారు. మూడురోజుల పాటు చీరల పంపిణీ ఉండడం వల్ల రికార్డుల ప్రక్షాళన మరో మూడురోజుల పాటు గడువు పెంచినట్టు తహసీల్దార్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రబుత్వం చేపట్టిన రెవెన్యూ భూ రికార్డుల ...

Read More »

దేవీ మండపాల వద్ద కుంకుమార్చనలు, అన్నదానాలు

  మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద కుంకుమార్చనలు, యజ్ఞం, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి, శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Read More »

కొనసాగుతున్న రెవెన్యూ రికార్డుల శుద్దీకరణ

  నందిపేట, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం బజార్‌ కొత్తూరు గ్రామంలో బుధవారం టీం లీడర్‌ గిర్దావర్‌ వినోద ఆధ్వర్యంలో రెవెన్యూ రికార్డుల శుద్దీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. తెలంగాణ ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ రికార్డుల శుద్దీకరణ కార్యక్రమం బజారుకొత్తూరు గ్రామంలో మంగళవారం నుంచి ప్రారంభమై రెండోరోజు కొనసాగింది. అక్టోబరు 2 వరకు బృందాలు గ్రామంలో అందుబాటులో ఉంటాయని ఆర్‌ఐ స్పష్టం చేశారు. రెండ్రోజుల్లో సుమారు 400 సర్వే నెంబర్లను పరిశీలించామని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన సదవకాశాన్ని ...

Read More »

శాకాంబరీగా దర్శనమిచ్చిన అమ్మవారు

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరత్‌నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవరోజు అమ్మవారు శాకంబరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని హనుమాన్‌ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవికి వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. పచ్చని కూరగాయలతో వైభవంగా అమ్మవారు భక్తులకు కనువిందుచేశారు. గురుస్వామి రత్కంటి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో మాలధారణ స్వాములచే పవిత్ర పూజలు నిర్వహించారు. అదేవిధంగా గురువారం మహిషాసురమర్ధిణి కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

Read More »

క్రీడా మైదానం ఏర్పాటు చేయండి

  నందిపేట, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రం పేరుకే మేజర్‌ గ్రామ పంచాయతీ అయినప్పటికి సౌకర్యాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. గ్రామంలో పదుల సంఖ్యలో పాఠశాలలు, 3 జూనియర్‌ కాలేజీలు, ప్రయివేటు డిగ్రీ కళాశాల ఉన్నాయి. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో యువకులు కళాశాలల నుంచి బయటకొస్తున్నారు. యువకులకు ఆడుకోవడానికి సరైన క్రీడా మైదానం లేకపోవడంతో హోటళ్ళ వద్ద, రోడ్ల వెంబడి తిరిగి కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో క్రీడల్లో నైపుణ్యం ఉన్న యువత ప్రోత్సాహం లేక ...

Read More »

బతుకమ్మకు కీర్తితెచ్చిన ఘనత తెరాసదే

  మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకునిచ్చే బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా కీర్తితెచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, జడ్పిటిసి ఎనుగందుల అనిత అన్నారు. బుధవారం మోర్తాడ్‌లో ప్రభుత్వం అదికారికంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలను ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడి కార్యకర్తలు శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో, ఐకెపి ఆద్వర్యంలో వెంకటేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మల వద్ద ఆడి, పాడి అందరిని అలరింపజేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ...

Read More »