Breaking News

లలితసుందరి ఆలయానికి రూ. 5 లక్షల ఎమ్మెల్సీ నిధులు

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలో నిర్మించిన లలత మహాత్రిపుర సుందరి ఆలయానికి శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ తన నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేశారు. వీటిని బుధవారం మునిసిపల్‌ మాజీ ఛైర్మన్‌ కైలాస్‌ శ్రీనివాస్‌రావు, షబ్బీర్‌ అలీ సోదరుడు మహ్మద్‌ నయీమ్‌, జడ్పిటిసి నిమ్మ మోహన్‌రెడ్డిలు ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి నిధులు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వర్‌రావు, పంపరి శ్రీనివాస్‌, వేణుగోపాల్‌గౌడ్‌, మునిసిపల్‌ కౌన్సిలర్లు దామోదర్‌రెడ్డి, లక్ష్మన్‌, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article