Breaking News

ప్రతి పాడి రైతు ఆరుమొక్కలు నాటాలి

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి పాడి రైతు విధిగా ఆరుమొక్కలు నాటాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. దోమకొండ మండలం ముత్యంపల్లి గ్రామంలో బుధవారం డైరీలకు పాలుపోసే రైతులకు ఒక్కొక్కరికి ఆరు మొక్కల చొప్పున అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనలతో కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. చెట్లు నాటితే మనిషి స్థితిగతులు మారుతాయని, ఒకప్పటి ముసుర్లు ఈ తరానికి తెలియవని, దాన్ని తిరిగి సాధించుకోవాలని కాంక్రీట్‌ జంగిల్‌ కాకుండా చుట్టు మొక్కలు పెంచుకోవాలని చెప్పారు. తద్వారా భూకంపాలు, తుఫానులు, పర్యావరణ కాలుష్యం నుంచి తప్పించుకోవాలని చెప్పారు. 31 జిల్లాల్లోని రైతులందరికి ఆరుమొక్కల చొప్పున పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. జిల్లాల్లో ఉన్న 242 డైరీల్లో 8600 మంది పాడి రైతులు తమ పాడిని అమ్ముకుంటున్నట్టు చెప్పారు. నిత్యం 30 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ మనోహర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ రామాగౌడ్‌, ఎంపిటిసి రాములు, డైరీ సీనియర్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ మల్లయ్య, అధ్యక్షుడు భూంరెడ్డి, మేనేజర్‌ ప్రదీప్‌, విఆర్వో మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article