Breaking News

ఉచిత ఆరోగ్య శిబిరం

 

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవసేవే మాధవ సేవ అని భావించి కొందరు యువత గ్రూప్‌ ఆఫ్‌ హెల్పింగ్‌ ఫ్రెండ్స్‌గా ఏర్పడి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసినట్టు సంస్థ అధ్యక్షుడు విఠల్‌ రాథోడ్‌ అన్నారు. బుధవారం శశాంక్‌ ఫౌండేషన్‌ వారి సహకారంతో గ్రూప్‌ ఆఫ్‌ హెల్పింగ్‌ ఫ్రెండ్స్‌ ఆద్వర్యంలో ఉచితంగా ఆరోగ్య శిబిరం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ గోపి శిబిరాన్ని ప్రారంభించగా శశాంక్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ మోతిలాల్‌ రోగులకు వైద్య సహాయం అందజేశారు. వీరితోపాటు డాక్టర్‌ ప్రతాప్‌ నాయక్‌, డాక్టర్‌ శ్రీహిత సుమారు 700 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పిటిసి కిషన్‌ నాయక్‌ వైద్యులను జ్ఞాపికలతో సత్కరించారు. సభ్యులు నరేశ్‌ రాథోడ్‌, గబ్బర్‌, ధన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article