Breaking News

శాకాంబరీగా దర్శనమిచ్చిన అమ్మవారు

 

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరత్‌నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవరోజు అమ్మవారు శాకంబరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని హనుమాన్‌ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవికి వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. పచ్చని కూరగాయలతో వైభవంగా అమ్మవారు భక్తులకు కనువిందుచేశారు. గురుస్వామి రత్కంటి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో మాలధారణ స్వాములచే పవిత్ర పూజలు నిర్వహించారు. అదేవిధంగా గురువారం మహిషాసురమర్ధిణి కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article