Breaking News

ఘనంగా కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతి

 

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ గాంధీ కొండాలక్ష్మణ్‌ బాపూజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడివో భరత్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ కోసం అహర్నిశలు తన ఆలోచనను, పోరాటాన్ని వ్యక్తం చేసిన మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. బాపూ చూపిన మార్గదర్శనంలో యువత నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article