Breaking News

ఘనంగా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమరయోధుడు , తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్‌ బాపూజీ 102 జయంతి వేడుకలను బుధవారం కామారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలీలు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. ఈ సందర్బంగా వృద్ధాశ్రమంలో యువకులు పండ్లు, బిస్కెట్లు పంపినీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జొర్రీగల లక్ష్మణ్‌, వంగప్రసాద్‌లు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో, తెలంగాణ రాష్ట్ర సాదనలో లక్ష్మణ్‌ బాపూజీ పాత్ర ఎనలేనిదన్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామాచేసి ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారని గుర్తుచేశారు. పద్మశాలీ కులానికే వన్నె తెచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, భానుప్రసాద్‌, సందీప్‌, జయకాంత్‌, రామకృష్ణ, తారకమురళి, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article