Breaking News

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి లక్ష్మణ్‌ బాపూజీ

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు ఎనలేనివని పద్మశాలీలు అన్నారు. బాపూజీ 102వ జయంతి వేడుకలను కామారెడ్డిలో బుధవారం పట్టణ పద్మశాలీ సంఘం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలీ భవనం నుంచి ప్రధాన వీదుల గుండా ర్యాలీ నిర్వహించారు. బాపూజీ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు చేర్ల లక్ష్మణ్‌, మాజీ అధ్యక్షుడు చాట్ల రాజేశ్వర్‌లు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోరాటంలో కొండాలక్ష్మణ్‌ బాపూజీ చేసిన త్యాగం అనిర్వచనీయమన్నారు. ఆయన ఆశయ సాదనకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సబ్బని కృష్ణహరి, లక్ష్మణ్‌, బత్తిని నాగభూషణం, శివరాములు, జగన్నాథం, క్యాతం సిద్దిరాములు, మార్కండేయులు, లక్ష్మినర్సింలు, శంకర్‌, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article