Breaking News

భూప్రక్షాళన సర్వేలో అధికారుల పనితీరు భేష్‌

 

మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఏర్గట్ల తహసీల్దార్‌ ముల్తజుద్దీన్‌ ఆద్వర్యంలో గత 12 రోజులుగా కొనసాగుతుంది. బట్టాపూర్‌ గ్రామ పంచాయతీలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనను నిబందనల మేరకు అధికారులు ప్రతి దరఖాస్తు పరిశీలిస్తున్నారు. మూడురోజుల పాటు చీరల పంపిణీ ఉండడం వల్ల రికార్డుల ప్రక్షాళన మరో మూడురోజుల పాటు గడువు పెంచినట్టు తహసీల్దార్‌ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రబుత్వం చేపట్టిన రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మోర్తాడ్‌ మండలంలో నిబంధనలకు విరుద్దంగా అదికారులు కొనసాగిస్తున్నారు. గత 12 రోజుల క్రితం భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం కాగా మోర్తాడ్‌ మండలంలో తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, నయాబ్‌ తహసీల్దార్‌ జనార్ధన్‌ ఆద్వర్యంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు రెండు బృందాలుగా ఏర్పాటు చేశారు. ఒడ్యాట్‌, తిమ్మాపూర్‌ గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభం కాగా పదిరోజుల పాటు కొనసాగించారు. కొన్ని చోట్ల ఆలస్యం చేయడంతో, మరికొన్ని చోట్ల కుల సంఘాల భవనాల్లో సర్వే చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article