Breaking News

లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాల కోసం కృషి చేయాలి

 

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను ఈ తరంలో అందరూ గుర్తుచేసుకోవాలని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ అన్నారు. బాపూజీ 102వ జయంతి వేడుకలను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలలువేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కామరెడ్డిలో లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని గత ఏడాది ప్రతిష్టించినట్టు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి లక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా బాపూజీ జయంతిని నిర్వహించడం తెలంగాణకు గౌరవమని, మన అదృష్టమని పేర్కొన్నారు. నిజాం ప్రభుత్వానికి ఆయన ఎదురొడ్డి నిలిచారని, మొదటి తరం తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ లక్ష్మణ్‌ బాపూజీ జీవితమే మనకు సందేశమని పేర్కొన్నారు. ఆయన వ్యక్తికాదు, గొప్ప శక్తి అని, అందరితో కలిసి అందరికి స్ఫూర్తిగా ఆయన నిలిచారని చెప్పారు. బాపూజీ సర్కిల్‌ ఏర్పాటుకు ప్రబుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, బిసి సంక్షేమాధికారి దేవిదాస్‌, డిసిసిబి ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, జేసి సత్తయ్య, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌, కార్యదర్శి కృష్ణమూర్తి, విగ్రహ దాతలు బత్తిని నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article