Breaking News

Daily Archives: September 28, 2017

ఘనంగా సద్దుల బతుకమ్మ

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ గురువారంతో చివరిరోజుకు చేరుకుంది. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. మహిళలు వివిధ ప్రాంతాలనుంచి తీసుకొచ్చిన పూలతో అందంగా బతుకమ్మను తయారుచేసి బతుకమ్మ ఆట, పాటలతో సంబరాలు నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రధాన కూడళ్ళ వద్ద బతుకమ్మలు ఆడి ఊరచెరువుల్లో నిమజ్జనం చేశారు. చక్కటి బతుకమ్మ పాటలు పాడుతూ చేయి చేయి కలుపుతూ చప్పట్లు వేశారు. ముత్తైదువలు ...

Read More »

తొర్తిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

  మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామ శివారులోగల ఊరచెరువు సమీపంలో దుర్గాదేవి ఆలయం ముందు రోడ్డుపక్కనే గుప్తనిదుల కోసం గత రెండునెలలుగా తవ్వకాలు ప్రారంభించారు. తవ్వకాలు జరుపుతున్న చోట నుంచి ప్రతిరోజు నిత్యం మోర్తాడ్‌ వెళ్ళే వాహనదారులు సైతం తవ్వకాలు చూసి ఇదేమిటని ప్రశ్నిస్తున్నారు. బావి తవ్వకం కోసమని ఒకసారి, నీటి తొట్టె తవ్వకం కోసమని మరోసారి జేసిబి నిర్వాహకుడు చెప్పడం వల్ల గ్రామస్తుల్లో అనుమానాలు తలెత్తాయి. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం, ...

Read More »

బైపాస్‌ రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

  నందిపేట, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట పాత పెట్రోల్‌ పంప్‌ చౌరస్తా నుంచి షాపూర్‌ రోడ్డును కలుపుతూ నూతనంగా నిర్మిస్తున్న బైపాస్‌ రోడ్డు పనులను గురువారం సాయంత్రం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరిశీలించి పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు నాణ్యతతో,త ్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను కోరారు. రోడ్డు నిర్మాణానికి ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా భూములిచ్చి బైపాస్‌రోడ్డుకు సహకరిస్తున్న రైతులకు ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దుర్గామాత మండపం వద్ద ...

Read More »

బల్దియా నిర్వాకం… గుడ్డి చీకట్లో బతుకమ్మల నిమజ్జనం…

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బల్దియా అధికారులు తమ పనితీరు మరోసారి చాటుకున్నారు. వారి నిర్వాకంతో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు గుడ్డి చీకట్లో జరుపుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. బతుకమ్మలు అయిపోయాయో అనుకున్నారో ఏమో వీక్లిమార్కెట్లో లైటింగ్‌, వేదిక, అన్నింటిని తొలగించారు. చివరికి తొట్లలో నీటిని సైతం నింపలేదు. సద్దుల బతుకమ్మ ఆడేందుకు వచ్చిన మహిళలు అక్కడ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఒక అధికారి సైతం అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలిపోని పరిస్థితిలో ...

Read More »

ఘనంగా సద్దుల బతుకమ్మ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి ప్రధాన కూడళ్లలో, చెరువు సమీపంలో ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆటలాడారు. ప్రజలందరు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని బతుకమ్మను వేడుకున్నారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి వీడ్కోలు పలికారు.

Read More »

కర్మఫలం ఆశించని ధీరుడు భగత్‌సింగ్‌

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎటువంటి కర్మఫలం ఆశించకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన ధర్మవీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ అని కామారెడ్డి భజరంగ్‌దళ్‌ ప్రతినిధులు కొనియాడారు. భగత్‌సింగ్‌ 110వ జయంతిని పురస్కరించుకొని గురువారం దేవునిపల్లి గ్రామంలో భగత్‌సింగ్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం అతి చిన్న మయసులోనే బ్రిటీష్‌వారిని గడగడలాడించి ఉరికంభమెక్కి ప్రాణత్యాగం చేసిన చిరస్మరణీయుడు భగత్‌సింగ్‌ అన్నారు. అంతగొప్ప త్యాగశీలుని యువత గుర్తుచేసుకోకపోవడం బాధాకరమన్నారు. యువత సినీ ...

Read More »

పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

  – ఎసిపి శివకుమార్‌ నందిపేట, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జరగబోయే దుర్గామాత నిమజ్జనం రోజు శాంతియుతంగా జరుపుకోవాలని ఎసిపి శివకుమార్‌ కోరారు. నందిపేట గ్రామ ప్రజలతో, దుర్గామాత నిర్వాహకులు, మజీద్‌ కమిటీ వారితో ఆర్మూర్‌ రూరల్‌ సిఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన శాంతికమిటీ సమావేశంలో ఏసిపి పాల్గొని మాట్లాడారు. గ్రామంలో శాంతిపూర్వక వాతావరణం ఏర్పరచి తెలంగాణ మొత్తానికి ఆదర్శ గ్రామంగా నిలపాలన్నారు. హిందూ, ముస్లింలు సోదర భావంతో పండగలు జరుపుకోవాలని, ఒకరినొకరు సహకరించుకోవాలని మత ...

Read More »

దాండియా విజేతలకు బహుమతుల ప్రదానం

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం టేక్రియాల్‌ గ్రామంలోని హిందూ యువసేన దుర్గామండలి ఆద్వర్యంలో నిర్వహించిన దాండియా పోటీల్లో అలరించిన చిన్నారులకు గురువారం బహుమతి ప్రదానం చేశారు. జడ్పిటిసి నిమ్మమోహన్‌రెడ్డి వెండి నాణేలను దాండియాలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు అందజేశారు. అనంతరం దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో యువసేన అధ్యక్షుడు రవిపాటిల్‌, ఉపాధ్యక్షుడు రాజేశ్‌, ప్రతినిధులు రమేశ్‌, శ్రీనివాస్‌, సుధాకర్‌, నవీన్‌, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Read More »