Breaking News

Monthly Archives: October 2017

కెసిఆర్‌ పాలనలో విద్యార్థులకు అడియాశలే మిగిలాయి

  బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వరాష్ట్రం సిద్దించుకున్న కెసిఆర్‌ పాలనలో నిరుద్యోగులు, విద్యార్థి లోకానికి అడియాశలే మిగిలాయని బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిద్ధిపేట్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డిలో బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు జూలూరి సుధాకర్‌తో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నిదులు, నీరు, నియామకాల కోసం యువత, విద్యార్థి లోకం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా, కెసిఆర్‌ వారికి చేసిందేమి లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

  కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు మంగళవారం మధ్యాహ్న భోజన కార్మికులు కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తుండగా ఎట్టకేలకు కెసిఆర్‌ వేతనాలు పెంచడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆయనకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ప్రతినిదులు కిష్టాగౌడ్‌, వెంకటేశం, నర్సింలు, ప్రమీల, రఫియా, రాంచంద్రం, అనసూయ, సోమలింగం ...

Read More »

భూ రికార్డుల ప్రక్షాళనలో రాష్ట్రంలో జిల్లాకు రెండోస్థానం

  కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలోకామారెడ్డి జిల్లా 96వ శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆర్‌డివో కార్యాలయంలో జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపిడివోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, హరితహారం, ఓడిఎఫ్‌, గొర్రెల పంపిణీ, కెసిఆర్‌ కిట్‌, డంపింగ్‌ యార్డులు, ధాన్యం కొనుగోలు తదితర కార్యక్రమాలపై మండలాల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రక్షాళన కార్యక్రమంలో అధికారుల పనితీరుపై ...

Read More »

కామారెడ్డిలో రన్‌ ఫర్‌ యునిటి

  కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ యునిటి కార్యక్రమం నిర్వహించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 142వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. జన్మభూమి రోడ్డులోని పటేల్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం రన్‌ఫర్‌ యునిటి కార్యక్రమం చేపట్టారు. దేశ ఐక్యత కోసం కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆదర్శవంతమైన రాజకీయ యోధుడు అని కొనియాడారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం ...

Read More »

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో భాగస్వాములు కావాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేషనల్‌ యువ కో ఆపరేటివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఐదు జిల్లాల్లోని అండర్‌-14, అండర్‌-17 క్రీడాకారుల పరుగుపందెం పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో ఒకరితో తనను పోల్చుకోకుండా తమకోసం తాము పాల్గొనాలని అన్నారు. గెలుపు ఓటములు సహజమని, దానిపై దృష్టి పెట్టకుండా ఆటల్లో పాల్గొనాలని చెప్పారు. మంచి ...

Read More »

పిల్లల ఎదుగుదలతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకం

  కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లల ఎదుగుదలలో ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రుల పాత్ర కీలకమని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్స్‌ పోలీసు క్యాడెట్‌ అనే కార్యక్రమాన్ని విద్య, పోలీసు శాఖల సమన్వయంతో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి జిల్లా నుంచి విద్యార్థి పోలీసు క్యాడెట్స్‌కు 44 మంది బాలబాలికలు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం ...

Read More »

ప్రపంచ పోలీసు క్రీడలకు కమీషనరేట్‌ పోలీసుల ఎంపిక

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 1 నుంచి 11వ తేదీ వరకు అబుదాబి (దుబాయ్‌)లో నిర్వహించే ప్రపంచ పోలీసు క్రీడల్లో నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినట్టు నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. నవాతె శ్రీనివాస్‌, ఎం.డి.అప్సర్‌ స్విమ్మింగ్‌ బ్యాక్‌ స్ట్రోక్‌, బట్టర్‌ ఫ్లై 50, 100 మీటర్లు రిలే విభాగంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. సుమారు 45 దేశాల క్రీడాకారులు పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. సోమవారం ...

Read More »

డయల్‌ యువర్‌ సిపికి 10 ఫిర్యాదులు

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమంలో ఆయా డివిజన్‌ల పరిధిలో 10 ఫిర్యాదులు అందినట్టు పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పిర్యాదులు స్వీకరించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ల పరిధిలోని ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై ఫిర్యాదులు రాగా సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు సంబంధిత సమస్యలపై పరిష్కరించాలని సూచించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా బాధితులతో ...

Read More »

గ్రామాన్ని విడదీయొద్దు

  బీర్కూర్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిపాలనా సౌలభ్యంకొరకు మండలాల పునర్‌విభజనలో మిర్జాపూర్‌ (వీరాపూర్‌ గ్రామం) గ్రామ పంచాయతీ విడిపోయి వీరాపూర్‌ బీర్కూర్‌ మండలంలో, మిర్జాపూర్‌ నసురుల్లాబాద్‌ మండలంలో చేరింది. దీంతో పక్కనే పక్కనే ఉన్న రెండు గ్రామాలు రెండు మండలాల్లోకి విడిపోవడంతో రెవెన్యూ, తదితర సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ఈ రెండు గ్రామాలను కలపాలని రెండు గ్రామాలకు చెందిన పెద్దలు, ప్రజలు సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలవడానికి హైదరాబాద్‌కు వెళ్లారు. గ్రామాలను ఒకటి ...

Read More »

రిక్రూట్‌ కానిస్టేబుల్‌లకు యూనిట్‌టెస్టు

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు ఆద్వర్యంలో నడుస్తున్న సిటిసి, జాన్కంటపేట్‌లో బేసిక్‌ శిక్షణ పొందుతున్న రిక్రూట్‌ కానిస్టేబుల్‌లకు రెండవ యునిట్‌టెస్టు పేపర్‌ -4 నిర్వహించినట్టు సెంటర్‌ సూపరింటెండెంట్‌ డిఎస్‌పి, పిటిసి, లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా రెండ్రోజుల పాటు పరీక్షలు ఉన్నాయని అన్నారు.

Read More »

స్వచ్చభారత్‌లో అందరు భాగస్వామ్యం కావాలి

  బీర్కూర్‌; అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చభారత్‌ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని బాన్సువాడ నియోజక వర్గ తెరాస ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్‌సి కాలనీలో సోమవారం బీర్కూర్‌ సొసైటీ మాజీ ఛైర్మన్‌ గాంధి ఆర్థిక సహాయంతో ఇచ్చిన చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ శుభ్రతతో ఉంటే ఆరోగ్యం చేకూరుతుందని, మనతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మలిపెద్ది ...

Read More »

ఐకమత్యంతో హక్కులు సాదించుకుందాం

  కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులు ఐకమత్యంతో హక్కులు సాదించుకోవాలని కామారెడ్డి జిల్లా మేదరి సంఘం అధ్యక్షుడు కిషన్‌ అన్నారు. కామారెడ్డిలో ఆదివారం మేదరి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయనతోపాటు నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్‌, ప్రధాన కార్యదర్శి బాల్‌రాజులు మాట్లాడుతూ త్వరలో జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలు వేయాలని, మేదరి జనాబాను సేకరించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మేదరులు సద్వినియోగం చేసుకునేలా వారికి వివరించాలని చెప్పారు. ...

Read More »

యోగా శిక్షణ శిబిరం ప్రారంభం

  కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పార్శిరాములు కళ్యాణమండపంలో యోగా శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభమైంది. శ్రీఅనంత్‌ సేవా సత్సంగ్‌, పతంజలి యోగా మండలి ఆధ్వర్యంలో ఆధ్యాత్మికత – సంపూర్ణ ఆరోగ్యం పేరుతో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పార్శి రాములు కళ్యాణ మండపంలో శిబిరం జరిగింది. సోమవారం విద్యానగర్‌ కాలనీలోని శ్రీ షిర్డీ సాయి నిలయంలో తరగతులు ప్రారంభించనున్నారు. ఉదయం 5 గంటలకు, 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు మూడు బ్యాచుల ...

Read More »

కల్లు అమ్మకానికి మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కల్లు విక్రయించుకునేందుకు ప్రబుత్వం మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి పట్టణంలో ఆదివారం నిర్వహించిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. కల్లు వృత్తిని నమ్ముకొని రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, వృత్తి రక్షణకు 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గీత కార్మికుల సంక్షేమం కోసం ...

Read More »

కళకళలాడుతున్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొన్ని రోజుల క్రితం మంజీర ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు రావడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు కళకళలాడుతుంది. ప్రాజెక్టు నిండుకుండలా ఆనందిస్తుంది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు భారీగా కురియకపోవడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. సింగూరు నీటి విడుదలతో ప్రాజెక్టు నీటి మట్టం పెరగడంతో రైతులు ఆనందిస్తున్నారు.   పర్యాటకుల సందడి నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల సందడి ...

Read More »

తాగునీటికి తప్పని తిప్పలు

  నిజాంసాగర్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మగ్దుమ్‌పూర్‌ గ్రామంలో తాగునీటిని అందించే బోరుబావులు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో గ్రామంలో నాలుగు రోజుల నుంచి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఎస్‌సి కాలనీ వాసులు గోదాము వద్దగల బోరుబావి నుంచి నీరు తెచ్చుకుంటారని, అక్కడ బోరుకూడా చెడిపోయిందని, మరమ్మతు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. బోరుబావులు చెడిపోయి నాలుగురోజులవుతుందని, ట్యాంకులు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టి నీరందేలా చూడాలని ప్రజలు అంటున్నారు. ...

Read More »

డ్రైనేజీ పనులు ప్రారంభం

  కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగాపూర్‌ గ్రామ శివారులోని కల్కినగర్‌ కాలనీలో ఆదివారం మురికి కాలువ నిర్మాణ పనులను సర్పంచ్‌ నీరడి బాల్‌రాజు ప్రారంభించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ నర్సారెడ్డి, డైరెక్టర్‌ బాగయ్య, దేవునిపల్లి సర్పంచ్‌ వెంకట్రావు, వార్డు సబ్యుడు వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గుర్తు తెలియని వ్యక్తి మృతి

  కామారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్టీసి బస్టాండ్‌ ప్రాంగణంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం లభించినట్టు పట్టణ ఎస్‌ఐ రవి తెలిపారు. ఆర్టీసి ప్రధాన గేటు వద్ద వ్యక్తి మృతదేహం లభించినట్టు తెలిపారు. వ్యక్తి యాచకుడుగా జీవనం సాగిస్తున్నాడని, ఎవరైనా అతన్ని గుర్తిస్తే పట్టణ పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

Read More »

అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలి

  – శ్రీరాంసాగర్‌ ముంపు గ్రామాల బాధితుల కమిటీ నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరాంసాగర్‌ ముంపు గ్రామాలకు చెందిన సమస్యలను ఎన్ని ప్రభుత్వాలు మారినా అపరిష్కృతంగా ఉన్నాయని శ్రీరాంసాగర్‌ ముంపు గ్రామాల బాధితుల సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ముంపు గ్రామాల ప్రజలకు రాలేదని, నిజామాబాద్‌ జిల్లాలో బాల్కొండ, నందిపేట్‌, ముప్కాల్‌, ...

Read More »

వంజరి కులస్తులను ఎస్‌టిలో చేర్చాలి

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంజరి కులస్తులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఉద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కరిపె రాజు డిమాండ్‌ చేశారు. ఆదివారం పోరు దీక్షను ప్రారంభించి ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో వంజరి కులం ఎస్‌టి జాబితాలో ఉందని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బిసి-డిలో ఉందని, దీంతో తాము రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు కోల్పోతున్నామని, వంజరి కులం ఆర్తికంగా ఎంతో వెనకబడి ఉందని, ఉన్నత ...

Read More »