Breaking News

హైకోర్టు విభజనపై జాప్యమెందుకు? : ఎంపీ కవిత

న్యూఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ప్రశ్నించారు. లోక్‌సభ వాయిదా అనంతరం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. హైకోర్టు విభజన కోరుతూ పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్నామని తెలిపారు. గతంలో రాష్ర్టాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయాలన్న కవిత.. ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని కవిత అన్నారు. కేంద్రప్రభుత్వం చొరవ చూపి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏపీ స్థలం ఇవ్వలేదని, భవనాలు లేవని సాకులు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుపై నెపం నెట్టడం భావ్యం కాదన్నారు.

Check Also

పోలింగ్‌ పర్సెంట్‌ @1 పిఎం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి నిజామాబాద్‌ పార్లమెంటరీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *