Breaking News

31 డిసెంబరుకు 20 ప్రత్యేక పోలీసు బృందాలు

 

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 31 డిసెంబరు దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్‌ నగరంలో ప్రత్యేకంగా 20 బృందాలు ఏర్పాటు చేసినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమీషనరేట్‌ పరిధిలోని వైన్స్‌లు, బార్‌లు, కల్లు దుకాణాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన సమయం వరకే తెరిచి ఉంచాలని, అలా కాకుండా సమయం దాటి విక్రయిస్తే, దుకాణాలు తెరిచి ఉంచితే అటువంటి యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా వారి లైసెన్సులు రద్దు పరిచేవిదంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎక్కడైనా ఆర్కెస్ట్రా, సౌండ్‌ సిస్టమ్‌, అత్యధిక మోతాదులో గల సౌండ్‌ సిస్టమ్‌ నిషేదమని, ఇది గమనించి వేడుకలు జరుపుకోవాలని కమీషనర్‌ సూచించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు కలిసి ప్రయాణం చేయడం వంటి వారిపై మోటారు వెహికల్‌ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ప్రజలందరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కమీషనర్‌ సూచించారు.

Check Also

అటవీభూములపై పూర్తిస్థాయి సర్వే జరపాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెవెన్యూ డివిజన్‌ల వారిగా ప్రభుత్వ భూములపై పూర్తిస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *