Breaking News

Daily Archives: January 1, 2018

చెట్టు పడి బాలుని మృతి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలందరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మని (14) అనే బాలుడు శివాలయాన్ని దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లగా అకస్మాత్తుగా కొబ్బరి చెట్టు బాలునిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఉప్లూర్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.

Read More »

సిపిని కలిసిన పోలీసు అధికారులు, నాయకులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నిజామాబాద్‌ నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పోలీసు కమీషనర్‌ కార్తికేయను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ 2017 సంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లా శాంతిభద్రతల విషయంలో మంచి ప్రగతి సాధించిందని, ప్రజలు కూడా పోలీసుశాఖకు సహకరించారని, ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలందరు శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోగల 14వ డివిజన్‌ కార్పొరేటర్‌ అంతరెడ్డి లత దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కోటగల్లి మార్కండేయ ఆలయంలో సోమవారం క్యాలెండర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సబ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త హాజరై మాట్లాడారు. ప్రజలందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం బిజెపి మరింత బలోపేతం అవుతుందని, ఇపుడు పట్టణ స్థాయికి పరిమితమైన క్యాడర్‌ గత సంవత్సరం నుంచి గ్రామీణ స్తాయిలో కూడా ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి అర్సపల్లిలో తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శంభుని ఆలయకమిటీ ఛైర్మన్‌ ముచ్కూరు నవీన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతో రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నారని, రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని, రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కార్యక్రమం చేపడుతున్న ముఖ్యమంత్రి సేవలు అభినందనీయమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అర్సపల్లి ...

Read More »

ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పలువురు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ డాక్టర్‌ భూపతిరెడ్డిని పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని, పాత జ్ఞాపకాల నుంచి మంచిని స్వీకరించి భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పృథ్వీరాజ్‌, భీమ్‌గల్‌ ఎంపిపి ప్రకాశ్‌ గౌడ్‌, నిజామాబాద్‌ జిల్లా తెరాస సీనియర్‌ నాయకులు ...

Read More »

నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న రూరల్‌ ఎమ్మెల్యే

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందాల దీపం వెలగాలని, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని, తెలంగాణ రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి కెసిఆర్‌ మార్గదర్శకత్వంలో 2018లో మరింత అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ఎంపికి బిగాల నూతన సంవత్సర శుభాకాంక్షలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కవితకు నూతనసంవత్సరాన్ని పురస్కరించుకొని సోమవారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త హైదరాబాద్‌లో పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ అభివృద్దికి ఎంపి కవిత ఎంతో తోడ్పడుతున్నారని, ఎంపి ప్రత్యేకంగా దృష్టి సారించి తనను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారని, ఆమె మార్గదర్శకత్వంలో పనిచేసి ఆమె సలహాలు, సూచనలు తీసుకుంటూ నియోజకవర్గ అభివృద్దికి నిరంతరం పాటుపడతానని ఎమ్మెల్యే ...

Read More »

నక్షత్ర మోబైల్‌పాయింట్‌ ప్రారంభం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో సోమవారం బస్టాండ్‌ సమీపంలో నక్షత్ర మోబైల్‌ పాయింట్‌ను నగర మేయర్‌ ఆకుల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా మోబైల్‌ పాయింట్‌ యజమాని భరత్‌గౌడ్‌ మాట్లాడుతూ తమ వద్ద అన్ని బ్రాండెడ్‌ కంపెనీల మోబైల్స్‌ సరసమైన ధరలకు లభిస్తాయని, అత్యాధునిక శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు తమ వద్ద ఉన్నారని అన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో భరత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సిఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోగల సిఎస్‌ఐ చర్చిలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేడుకలకు చర్చి ఫాదర్‌ ప్రేమ్‌కుమార్‌ హాజరై ఏసు ప్రభువు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, నూతన సంవత్సరంలో ప్రజలందరు సుఖ సంతోషాలతో మెలగాలని, చెడుపై మంచి విజయం సాధించి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ప్రభువును వేడుకున్నట్టు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేడుకల్లో చర్చి కార్యదర్శి అనంత్‌రావు, కోశాధికారి జయసాగర్‌, జాన్సన్‌, వై.శాంతయ్య, ...

Read More »

పూర్వ విద్యార్థుల సమ్మేళనం గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా నిజాంపేటలోగల మదర్సా దారుల్‌ ఉల్‌ ఉమ్‌ హలిమియా పాఠశాల స్థాపించబడి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా పూర్వ విద్యార్థులందరికి సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కలిగింది. ఈ నేపథ్యంలో కొందరు పూర్వ విద్యార్థులు కలిసి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. మదర్సాలో 25 సంవత్సరాలుగా చదువుకున్న విద్యార్థులందర్ని ఒకే వేదిక వద్ద కలిపి సంస్థ అభివృద్దికి కృషి చేయాలనే చక్కటి ఆలోచన చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ...

Read More »

ప్రముఖ వైద్యుని సతీమణి మృతి

  కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ఈశ్వర్‌దాస్‌ సతీమణి సరస్వతి అనారోగ్యంతో ఆదివారం అర్దరాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ సోమవారం వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే పట్టణంలోని ప్రయివేటు ఆసుపత్రిలు కొద్దిసేపు మూసి ఉంచి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంట ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, తెరాస నాయకులు ఉన్నారు.

Read More »

ఘనంగా నూతన సంవత్సర వేడులు

  – ప్రభుత్వ విప్‌ను కలిసిన పోలీసు అధికారులు కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సర వేడుకలు ఆదివారం అర్దరాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. యువకులు పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కేక్‌లు కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. సోమవారం జిల్లాలోని పలు ఆలయాలకు భక్తులు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ను తెరాస నాయకులతో పాటు డిఎస్‌పి, సిఐలు, ఎస్‌ఐలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ...

Read More »

డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో పట్టుబడ ఆంకర్ ప్రదీప్

31 రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో పట్టుబడ్డ ఆంకర్ ప్రదీప్. బ్రీత్ అనలైజర్ లొ 178 పాఇంట్స్ చూపించడంతొ పొలీసులు అదుపులోకి తీసుకున్నారు

Read More »