Breaking News

Daily Archives: January 3, 2018

పౌరవిమానయాన శాఖ మంత్రిని కలిసిన ఎంపి కవిత

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కవిత బుధవారం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజును కలిసి నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లిలో ఏర్పాటు చేయదలచిన విమానాశ్రయం గురించి మాట్లాడారు. విమానాశ్రయం ఏర్పాటులో కొంత ఆలస్యం జరుగుతుందని, కేంద్ర పౌరవిమానయానశాఖ అధికారులు కొన్ని సాంకేతిక అధికారులు చూపించి విమానాశ్రయ ఏర్పాటుకు తాత్సారం చేస్తున్నారని అన్నారు. జక్రాన్‌పల్లిలోగల స్థలానికి అన్ని రకాల వసతులు ఉన్నాయని, దీనిపై స్పందించి మంత్రి చొరవ తీసుకోవాలని, విమానాశ్రయ ఏర్పాటుకు ...

Read More »

జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడిఎఫ్‌గా ప్రకటించుకోవాలి

  కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడిఎఫ్‌గా ప్రకటించుకునేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కామారెడ్డిజిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కలెక్టరేట్‌ భవనంలో బుధవారం స్వచ్చబారత్‌ మిషన్‌, జాతీయ ఓటర్ల దినోత్సవం ఏర్పాట్లు, గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్చభారత్‌ మిషన్‌ ద్వారా మిగిలిపోయిన గ్రామాల్లో పనులు త్వరితగతిన పూర్తిచేసి జిల్లా మొత్తాన్ని ఓడిఎఫ్‌గా ప్రకటించుకునేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ...

Read More »

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సావిత్రిబాయి ఫూలే 187వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతాపార్టీ బిసి మోర్చా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సుభాష్‌నగర్‌లోని సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిసి మోర్చా అధ్యక్షుడు శంకర్‌ మాట్లాడుతూ సావిత్రిబాయి భర్తతో 1948 జనవరి 1న పూణెలో మొట్టమొదటి సారిగా బాలికల పాఠశాల ప్రారంభించిందని, కుల వ్యవస్థను పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల మహిళల హక్కుల కోసం పోరాటం చేయడం, ...

Read More »

విద్యార్థిని ఆత్మహత్య యత్నం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న శ్వేతా అనే విద్యార్తిని బుధవారం పాఠశాల రెండో అంతస్తు భవనం నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. ఎడపల్లి మండలం బాపునగర్‌కు చెందిన పుష్ప, పడగయ్యల కూతురు రావడి శ్వేత గత ఏడాది 6వ తరగతి పూర్తిచేసుకొని 7వ తరగతి కస్తూర్బా పాఠశాలలో చేరింది. తనకు సెలవు ఇవ్వాలని వార్డెన్‌ మమతను కోరగా, చదువులో వెనకబడి ఉన్నందున సెలవు వద్దని, సంక్రాంతికి ...

Read More »

ఫ్యామిలీ కేర్‌ ఫార్మసీ ప్రారంభం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని వినాయక్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలి కేర్‌ ఫార్మసీని వేదమంత్రోచ్చారణల నడుమ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానులు సాయిసందీప్‌, అజరుద్దీన్‌లు మాట్లాడుతూ తమ మందుల దుకాణంలో లాభాపేక్ష లేకుండా సేవాదృక్పథంతో తక్కువ ధరలకే మందులు లభిస్తాయని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

Read More »

బార్‌ అసోసియేషన్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ బుధవారం జిల్లా జడ్జి కె.సుజన చేతులమీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి తమవద్దకు వచ్చే కక్షిదారులకు న్యాయం చేయాలని సూచించారు. న్యాయవాదులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు మాణిక్‌రావు, రాజ్‌కుమార్‌ సుబేదార్‌, ఆశ నారాయణ, సంతోష్‌, దేవిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

7న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7వ తేదీ ఆదివారం జిల్లా కేంద్రంలోని విజయలక్ష్మి గార్డెన్స్‌లో పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేసినట్టు వేదిక సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. 7న నిర్వహించే పరిచయ వేదికను పద్మశాలి కులస్తులందరు సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణలో పలు జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి వధూవరులు వస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి అఖిలభారతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు సుంకూరువార్‌ శ్రీధర్‌, ...

Read More »

ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సావిత్రిబాయి ఫూలే 187వ జయంతిని నగరంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ సంజీవ్‌రెడ్డి సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే మహిళల చదువు కోసం చేసిన కృషిని కొనియాడారు. సావిత్రిబాయిఫూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే జీవితంలోని పలు అంశాలను గుర్తుచేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ...

Read More »

ప్రగతి పనులు పరిశీలించిన కలెక్టర్‌

  కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలో జరుగుతున్న ప్రగతి పనులను బుధవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. మండలంలోని లింగాయిపల్లి గ్రామంలో 251 లక్షలతో నిర్మితమవుతున్న 40 డబుల్‌ బెడ్‌ రూం పథకం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం కామారెడ్డి పట్టణ శివారులోని హౌజింగ్‌ బోర్డు కాలనీలోగల వైకుంఠ ధామంలో 35 లక్షలతో చేపడుతున్న షెడ్డు, స్నానాల గదులు, రెండు బోర్లు, కాంపౌండ్‌ పనులను పరిశీలించారు. అనంతరం ఇందిరానగర్‌ స్మృతి వనంలో 15 లక్షలతో చేపట్టబోయే ...

Read More »

రెడ్డి ల్యాబోరేటరీస్‌లో ఉద్యోగావకాశాలు

  కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ రెడ్డి ట్యాబోరేటరీ లిమిటెడ్‌ పలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు డిఆర్‌డివో ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు సెల్ప్‌ మేనేజ్‌మెంట్‌ ట్రెయినిగా హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, కరీంనగర్‌ డిఆర్‌డిఎ వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. వంద ఖాళీలున్నట్టు చెప్పారు. ఇంటర్మీడియట్‌ ఎంపిసి, బైపిసిల్లో 60 శాతం మార్కులతో పాస్‌ అయి ఉండాలని, 2017లో ఉత్తీర్ణులైనవారు మాత్రమే దీనికి అర్హులన్నారు. 18 నుంచి 20 సంవత్సరాల వయసు గలవారై ఉండాలని చెప్పారు. సంవత్సరానికి రూ. లక్ష 45 ...

Read More »

52వ సారి రక్తదానం చేసిన బాలు

  కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తరచూ రక్తదానం చేస్తు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న బాలు బుధవారం 52వ సారి రక్తదానం చేశారు. కామారెడ్డి పట్టణంలోని జాగృతి ఆసుపత్రిలో నవీన్‌ అనే బాలుడికి రక్తం అవసరం కాగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు 52వ సారి విటి ఠాకూర్‌ బ్లడ్‌ బాంక్‌లో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తున్నట్టు తెలిపారు. 2017లో వాట్సాప్‌ ద్వారా రక్తదాతల ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ జూడిషియల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ డిస్ట్రిక్‌ యూనిట్‌ వారి క్యాలెండర్‌ను జిల్లా జడ్జి కె.సుజన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో న్యాయవ్యవస్థ ఎంతో పటిష్టమైందని, ఇపుడున్న పరిస్థితిల్లో బాధితులకు న్యాయం జరిగేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు, లోక్‌ అదాలత్‌లు వంటివి నిర్వహిస్తు కక్షి దారులకు న్యాయం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు బి.రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ రబ్బాని, కోశాధికారి ఉమా ...

Read More »

పంట కాలువలు నిర్మించి ఇబ్బందులు తీర్చాలి

  నిజాంసాగర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామానికి సాగునీరు అందించే పంట కాలువలను నిర్మించాలని గ్రామస్తులు కోరారు. మండలంలోని నర్వా గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్‌ అనసూయ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను సభ దృస్టికి తెచ్చారు. గ్రామానికి సాగునీరు అందించేందుకు నర్వా పాత చెరువుతోపాటు సింగీతం జలాశయంలోకి అందుబాటులో ఉన్న పంట కాలువలు సక్రమంగా లేకపోవడం వల్ల ఆయకట్టు వరకు నీరు అందడం లేదన్నారు. గ్రామంలో పలు కాలనీల్లో మరుగు ...

Read More »

ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకోవాలి

  నిజాంసాగర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగిరెడ్డి పేట మండలంలోని ఆత్మకూరు, జప్తి జాన్కంపల్లి, వదల్‌పర్తి గ్రామాల్లో బుధవారం అధికారులు సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. జప్తి జాన్కంపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ దేశబోయిన సాయిలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. 100 శాతం పూర్తి చేసుకొని మండలంలో ఆదర్శంగా నిలవాలన్నారు. గ్రామంలోని అభివృద్ది కార్యక్రమాలపై చర్చించి నూతన కార్యక్రమాలు, సమస్యలపై గ్రామస్తులు అధికారులకు వివరించారు. అనంతరం అభివృద్ది ...

Read More »

సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా విద్యార్థుల స్వయం పాలన దినోత్సవం

  నిజాంసాగర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద జడ్పిహెచ్‌ఎస్‌లో బుధవారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులు పాఠాలు బోదించారు. ముందుగా సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు పిఇటి నరేశ్‌రెడ్డి తెలిపారు. ప్రధానోపాద్యాయులు ఉషారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

జిల్లాలో 22 మండలాల్లో, 473 గ్రామాల్లో భూ ప్రక్షాళన

  కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని 22 మండలాలకు సంబంధించి 473 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన భిక్కనూరు, రాజంపేట మండలాల్లో జరుగుతున్న మానువల్‌ పహాణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. రెవెన్యూ సిబ్బంది 7 రిజిష్టర్లు, 11 అనెక్జర్‌లు, చెక్‌లిస్టుల పనులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, ఆన్‌లైన్‌ డాటా ఎంట్రీ సైతం పూర్తవుతుందని పేర్కొన్నారు. సిఓటి కింద ఉన్న 12 వేల ...

Read More »

మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తిచేయండి

  నిజాంసాగర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాల కోసం కృషి చేయాలని ఎంపిడిఓ రాములు నాయక్‌, ఇజిఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఆదేశించారు. నిజాంసాగర్‌ మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో బుధవారం ఫీల్డ్‌ అసిస్టెంట్లతో మాట్లాడారు. ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పకుండా నిర్మించుకునేలా చూడాలని ఈ విషయమై ఇంటి యజమానులకు అవగాహన కల్పించాలని అన్నారు. లబ్దిదారులకు మరుగుదొడ్డి నిర్మించుకున్న వెంటనే దశల వారిగా రూ. 12 వేలు అందజేయడం జరుగుతుందన్నారు. బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా ...

Read More »

ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి

  కామరెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సావిత్రిబాయి 187వ జయంతి వేడుకలను బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రజా సంఘాలు, వివిధ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్యాలయం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి సావిత్రిబాయి ఫూలే సేవలను పలువురు కొనియాడారు. అంతకుముందు సావిత్రిబాయి విగ్రహానికి ఉపాధ్యాయ సంఘాలు, అంబేడ్కర్‌ సంఘాలు, టిమాస్‌ ఆధ్వర్యంలో పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రతినిధులు జగన్నాథం, వి.ఎల్‌.నర్సింహారెడ్డి, సిద్దిరాములు, అనిల్‌, వెంకటి, బాల్‌రాజ్‌, నర్సింలు, నవీన్‌, దశరథ్‌, ...

Read More »

సావిత్రిబాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలి

  కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సావిత్రిబాయి ఫూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్‌ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఐఎస్‌ఎఫ్‌ కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే 187వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిఫూలే అని, ఆమెను ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహాలు కాదు సావిత్రిబాయి ఫూలేలు కావాలని పేర్కొన్నారు. కులవివక్ష, అంటరానితనం, అందరికి విద్యే లక్ష్యంగా ...

Read More »

ఒకరికి రెండ్రోజుల జైలుశిక్ష

  కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఒకరికి కామారెడ్డి కోర్టు బుధవారం రెండ్రోజులపాటు జైలుశిక్ష విధించినట్టు ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. కామారెడ్డికి చెందిన అజీమ్‌ మంగళవారం మద్యం సేవించి వాహనం నడపడంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడినట్టు సిఐ తెలిపారు. వాహనాలు నడిపేవారు మద్యం సేవించవద్దని సూచించారు.

Read More »