సకల కళల నిలయం ఖిల్లా రఘునాథ ఆలయం

 

నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రఘునాథ ఆలయం సకల కళలకు నిలయమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి గురునాథం అన్నారు.

గురువారం స్థానిక ఖిల్లా రఘునాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు ఆలయాలు ఎంతో దోహదపడతాయని, దేవాలయాలు పురాతన చరిత్రకు సాక్ష్యాలని, ఖిల్లా రామాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఏకశిల రామ విగ్రహం తాబేలుపై ఉండడం విశేషమని ఆయన అన్నారు. అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట గీత సత్సంగ ప్రతినిధి కృష్ణ కుమార్‌ గుప్త, టిటిడి జిల్లా ధర్మప్రచార మండలి కార్యదర్శి జనగామ చంద్రశేఖర శర్మ, ఏ.ఆర్‌.మూర్తి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *