Breaking News

Daily Archives: January 5, 2018

విఆర్‌ఏ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగాం శివారులోని కాకివాగు వద్దనుంచి ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు విఆర్‌ఏ సాయిలును ట్రాక్టర్‌తో హత్యచేసిన ఇసుక మాఫియాను కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. అధికార పార్టీ అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని, కేసును అధికార పార్టీ నాయకులు పక్కతోవ పట్టించడానికి ప్రయ్నతిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు ఆరోపించారు. సాయిలు మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ...

Read More »

6న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాక

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ఆలూరు గ్రామంలో నిర్వహిస్తున్న రైతు సదస్సుకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హాజరుకానున్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌ నాయకులు రైతుల సమీకరణలో నిమగ్నమయ్యారు.

Read More »

ఎంపి కవితకు కృతజ్ఞతలు తెలిపిన సాయికుమార్‌

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో కుర్రు కులస్తుల కొరకు భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తున్నామని పేర్కొన్న నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు తెరాస నాయకులు, రాష్ట్ర కుర్రు కుల సంఘం అధ్యక్షుడు సాయికుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మానిక్‌ భండార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో కుర్రు రణభేరి సందర్భంగా ఎంపి కవితను కుర్రు భవనం గురించి నిదులు మంజూరు చేయాలని కోరగా ఎంపి నిధులతో సరిపెట్టకుండా మొత్తం ...

Read More »

6న మన ఊరు – మన ఎంపి కార్యక్రమం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాణిక్‌ బండార్‌ గ్రామంలో 6వ తేదీన మన ఊరు మన ఎంపి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్‌ ఎంపి కవిత హాజరవుతున్నట్టు ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read More »

మహా గణపతి ఆలయంలో సంకటచతుర్థి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని బొడ్డెమ్మ చెరువు సమీపంలోగల మహా గణపతి ఆలయంలో సంకట చతుర్థి పురస్కరించుకొని స్వామివారికి పంచామృతం, పాలాభిషేకం నిర్వహించినట్టు ఆలయ ఛైర్మన్‌ భూషణ్‌ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం సింధూర సమర్పణ, గరికపూజ, ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్టు చెప్పారు.

Read More »

వెల్‌నెస్‌ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేస్తాం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెల్‌నెస్‌ సెంటర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు శుక్రవారం నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం సిఇవో కల్వకుంట్ల పద్మను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో తక్షణమే వెల్‌నెస్‌ సెంటరు ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, అన్ని వసతులతో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కార్పొరేట్‌ వైద్య సేవలు, జర్నలిస్టు ...

Read More »

సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకోవాలి

  కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకొని ఆమె బాటలో నడవాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ పిలుపునిచ్చారు. వరలక్ష్మి గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం ఆద్వర్యంలో జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత సావిత్రిబాయి ఫూలే చరిత్ర తెలుసుకొని సామాజిక సేవతోపాటు జీవితంలో నలుగురికి ఉపయోగపడేలా పనిచేయాలన్నారు. అంతకుముందు ఆమె చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, జడ్పిటిసి నంద ...

Read More »

దళిత సంఘాలకు 60 లక్షల నిధులు మంజూరు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త శుక్రవారం నగరంలోని 12 దళిత సంఘాలకు సిడిపి నిదుల ద్వారా ఒక్కో సంఘానికి రూ. 5 లక్షల చొప్పున 60 లక్షల నిదులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు నిధులు మంజూరు చేసి వారి సామాజిక అభివృద్దికి తోడ్పడుతుందని, కమ్యూనిటి హాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రజల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయని ఈసందర్భంగా ...

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త నగరంలో శుక్రవారం 22వ, 23వ, 20వ, 19వ, 18వ, 16వ డివిజన్‌లలో ఇంటింటికి వెళ్ళి మొత్తం 24 కళ్యాణలక్ష్మి చెక్కులను, నూతన వధూవరులకు తన కానుకగా చీర, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం ద్వారా పేద ఆడబిడ్డ పెళ్లిని ఎలాంటి ఆర్తిక ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమం ...

Read More »

సాయిబాబా ఆలయానికి రెండు లక్షల విరాళం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో హమాల్‌వాడిలోని సంతోషిమాత, సాయిబాబా ఆలయానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త శుక్రవారం రెండు లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా గుప్త మాట్లాడుతూ నగరంలో మరిన్ని ఆలయాలు గుర్తించి తనవంతు సహాయంగా అభివృద్దికి సహకరిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ నర్సింహా, కూన దయానంద్‌ గుప్త, పటేవార్‌ శ్రీనివాస్‌, హరిబాబు గుప్త, గజవాడ ఆగమయ్య గుప్త, శ్రీనివాస్‌ గుప్త, వెంకటేశం గుప్త, విశ్వనాథం ...

Read More »

తెరాస నేతలకు ప్రభుత్వ విప్‌ పరామర్శ

  కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన తెరాస నేతలు శ్రీనివాస్‌ గౌడ్‌, రాజాగౌడ్‌ కుటుంబీకులను శుక్రవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పరామర్శించారు. రాజాగౌడ్‌ తండ్రి మరణించడంతో ఎమ్మెల్యే కలిసి పరామర్శించారు. ఆయన వెంట ఆంజనేయులు, బల్వంత్‌రావు ఉన్నారు.

Read More »

విఆర్‌ఏ కుటుంబానికి పదిలక్షలు చెల్లించాలి

  కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఆర్‌ఏ సాయిలు కుటుంబానికి ప్రభుత్వం పదిలక్షల ఆర్థిక సాయం అందించాలని సిఐటియు రాష్ట్ర నాయకుడు సిద్దిరాములు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇసుక డంపులను ప్రోత్సహిస్తు చిరు ఉద్యోగులను హతమారుస్తుందని ఆరోపించారు. మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అలాగే జిల్లాకు చెందిన విఆర్‌ఏలు నల్ల బ్యాడ్జీలతో కలెక్టర్‌ కార్యాలయానికి తరలివచ్చి మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. విఆర్‌ఏ మృతికి కారకులైనవారిని ...

Read More »

జిల్లాలో ఇసుక మాఫియా లేదు

  ట్రాక్టర్‌ ఢీకొనే మృతి చెందాడు – కలెక్టర్‌, ఎస్‌పి వెల్లడి కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండలం కారేగాం గ్రామ సమీపంలో గురువారం జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన సాయిలు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేతా స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇసుక మాఫియా లేదని, ట్రాక్టర్‌లో ఓ వ్యక్తి ఇసుక తరలిస్తుండగా సాయిలు ...

Read More »

తెరాసలో చేరిన బద్యానాయక్‌

  నిజాంసాగర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ టిడిపి నాయకుడు, ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్‌ శుక్రవారం తెరాసలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మునిసిపల్‌, ఐటి శాఖ మంత్రి తారక రామారావు సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. తెలంగాణ ప్రభుత్వంలో కెసిఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంతో తనవంతు భాగస్వామ్యం అందించేందుకు ...

Read More »

చెట్లు మానవుని మనుగడకు అవసరం

  కామరెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెట్లు మానవుని మనుగడకు ఎంతో అవసరమని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం జుక్కల్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వాటరింగ్‌ డే సందర్భంగా ఆయన మొక్కలక నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు, ప్రజలు, స్వచ్చంద సంస్థలు ఎవరికి వారే బాధ్యతతో నాటిన మొక్కలకు నీరు పోసి పెంచాలన్నారు. మొక్కలుజాతికి హితమని చెప్పారు. మనం నాటిన మొక్క పెరిగినపుడే ...

Read More »

మున్నూరుకాపులు రాజకీయంగా రాణించాలి

  కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్నూరుకాపులు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ది చెందాలని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు క్యాలెండర్‌ను ఆవిస్కరించి మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌లో భారీ మహాసబ నిర్వహించే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. తెరాస ప్రభుత్వం మున్నూరు కాపులను కూడా గుర్తించి ప్రత్యేక నిధితో పాటు ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నట్టు తమ ...

Read More »

జర్నలిస్టులకు వెల్‌నెస్‌ సెంటరును ఏర్పాటుచేయాలి

  కామరెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమాజ సేవ కోసం పాటుపడుతున్న జర్నలిస్టుల ఆరోగ్య సంక్షేమం కోసం కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో వెల్‌నెస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, ఆరోగ్యశ్రీ, హెల్త్‌ కేర్‌ ట్రస్టు సిఇవో కల్వకుంట్ల పద్మకు శుక్రవారం జర్నలిస్టు సంఘాల నాయకులు వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు గ్రామీణ స్థాయి వరకు దాదాపు 700 మంది జర్నలిస్టులు విదులు నిర్వహిస్తున్నారన్నారు. వృత్తి నిర్వహణలో ...

Read More »

ఆర్‌బిఎల్‌ వినియోగదారుల సేవా కేంద్రం ప్రారంభం

  కామరెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో ఆర్‌బిఎల్‌ వినియోగదారుల సేవా కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఎస్‌బిఐ అనుబంధంతో ఈ సేవా కేంద్రం పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఆధార్‌ అనుసంధానం కలిగిన ఏ బ్యాంక్‌ అయినా ఈ సేవా కేంద్రం ద్వారా సేవలు పొందవచ్చని అన్నారు. నిమిషాలలో డిపాజిట్‌, విత్‌ డ్రా చేసుకోవచ్చన్నారు. ఇది మినీ ఆధార్‌ ఎటిఎం లాగా కూడా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ వెంకట్‌, తాన్‌సింగ్‌, రమేశ్‌, ప్రేమ్‌, తూర్పు రాజులు, తదితరులు ...

Read More »

కామారెడ్డి డిపో కార్యాలయం ఎదుట ధర్నా

  కామరెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసి కార్మికులు ధర్నా నిర్వహించారు. రోడ్డు సేఫ్టీ బిల్లుపై సవరణలు, రూట్ల పర్మిట్ల వేలం రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. వేతన సవరణ జాప్యంపై యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసి కార్మికులు నారాయణ, రంజిత్‌రెడ్డి, హరినాథ్‌, చందర్‌, తిరుపతి, సంగారెడ్డి, గోపాల్‌, రాజా, లత, వినోద, భారతి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వైద్య ఆరోగ్యసేవలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

  కామరెడ్డి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్య ఆరోగ్య సేవలను ఏఎన్‌ఎంలు ఆన్‌లైన్‌ లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలోని ఏఎన్‌ఎంలకు బిఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలకు ట్యాబులు అందజేసినట్టు తెలిపారు. తమ ట్యాబుల ద్వారా ఏఎన్‌ఎండిఎల్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లలకు సకాలంలో ...

Read More »