Breaking News

కలెక్టరేట్‌ ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా

 

కామారెడ్డి, జనవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఐక్య బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ – ఏఐటియుసి ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంయుక్త కలెక్టర్‌ సత్తయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ కార్మికులకు గత 2016 మార్చి నుంచి కార్డుల జారీ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. పదిసంవత్సరాల రెనివల్‌ తీసుకోవడం లేదని జిల్లా కార్యాలయంలో సిబ్బంది నియామకం జరగక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్థానికులకు పనులు కల్పించాలని, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళలో ప్రాధాన్యత కల్పించాలని, రూ. 5ల భోజన క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని, వెల్పేర్‌ బోర్డు ద్వారా 3 వేల రూపాయల పింఛన్‌ అమలు చేయాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాజు, రమేశ్‌, స్వామి, గణేశ్‌, నారాయణ, మల్లేశం, రాజీరు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article