Breaking News

బీడీ ప్యాకర్ల సమస్యలు పరిష్కరించాలి

 

కామారెడ్డి, జనవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ ప్యాకర్లు, కార్మికుల సమస్యలు పరిస్కరించాలని డిమాండ్‌ చేస్తు సిఐటియు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ బీడీ యజమానులు గతంలో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలన్నింటిని అధికారులు కల్పించడంలో వైఫల్యం చెందారన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో శ్రీనుకు అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు ప్రతినిధులు, బీడీ ప్యాకర్లు, రాజలింగం, నర్సింలు, శ్రీధర్‌, శివ, లక్ష్మణ్‌ తదితరులున్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article