Breaking News

రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్‌కు సన్మానం

 

కామారెడ్డి, జనవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్‌ రాంచంద్రమూర్తి శనివారం కామారెడ్డి ట్రెజరి శాఖను పరిశీలించారు. ఆయన కామారెడ్డికి వచ్చిన నేపథ్యంలో కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా రాంచంద్రమూర్తి మాట్లాడుతూ పింఛన్‌ దారుల ఐడి కార్డులను సంబంధిత ట్రెజరీ ద్వారా వారి ఆన్‌లైన్‌ డిజిటల్‌ సంతకంతో పొందవచ్చని తెలిపారు. జీవన ధృవీకరణ పత్రాలను మీసేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ జీవిత దృవీకరణ పత్రాలు పొందవచ్చన్నారు. కుటుంబ పింఛన్‌ దారులు మరణించిన సందర్భంలో వారి ఎన్‌పిఏ, డిఆర్‌ను వారసత్వపు దృవీకరణ పత్రాన్ని సమర్పించి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు భద్రయ్య, ప్రతాప్‌రెడ్డి, వెంకటి, సాయాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article