Breaking News

విద్యార్థులకు నవోదయ పుస్తకాల పంపిణీ

 

కామారెడ్డి, జనవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం మల్లుపేట ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు నవోదయ పుస్తకాలను శనివారం అందజేశారు. విమల, రాజమణిల జ్ఞాపకార్థం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, ఉపాధ్యాయులు రజనిలు నవోదయ పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేసినట్టు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మహేశ్‌రెడ్డి, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ సాయిలు, ప్రధానోపాధ్యాయుడు జమీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article