Breaking News

Daily Archives: January 9, 2018

పోలీసుల తనిఖీలు

  కామరాఎడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని నిజాంసాగరన చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న 32 మంది వాహనాదారులకు పోలీసులు 1800 జరిమాన విధించారు. తనిఖీలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

పింఛన్లను సంయుక్తంగా సకాలంలో పంపిణీ చేయాలి

  కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేస్తున్న పింఛన్లను అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా సకాలంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కామారెడ్డి జనహిత భవనంలో మంగళవారం మండలాబివృద్ది అధికారులు, పోస్టల్‌శాఖ బిపిఎం, ఎస్‌బిఎం, బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలుండగా, 473 రెవెన్యూ గ్రామాలున్నాయని, మిగిలిన 150 గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కోసం బాధ్యతాయుతమైన ఉద్యోగిని నియమించుకొని పింఛన్లు ...

Read More »

అధికారులకు సమ్మె నోటీసు అందజేసిన కార్మికులు

  కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 17న దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మెకు సంబంధించిన నోటీసులను మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతోపాటు ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి సిద్దిరాములు మాట్లాడుతూ కమ్యూనిటి హెల్త్‌ వర్కర్స్‌, ఆశాలతోపాటు వివిధ శాఖల్లోని కార్మికులు సమ్మెలో పాల్గొంటారన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, తదితర డిమాండ్లతో దేశ వ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మంజుల, అనిత, సునిత, లక్ష్మి, తదితరులు ...

Read More »

పింఛన్ల పంపిణీలో అలసత్వం తగదు

  కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలకు అందిస్తున్న పింఛన్ల పంపిణీలో సిబ్బంది అలసత్వం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జనహిత భవనంలో మంగళవారం మండల అభివృద్ది అధికారులు, పోస్టల్‌ శాఖ జిపిఎం, ఎస్‌బిఎం, బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పింఛన్ల పంపిణీలోతీవ్ర జాప్యం జరుగుతుందని, పించన్‌ దారులు ఇబ్బందులు పడుతున్నారని తమ దృస్టికి వచ్చిందన్నారు. పద్ధతి మార్చుకొని ఒక విధానం ప్రకారం పింఛన్లు పంపిణీ ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్‌

  కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో మంగళవారం టిఎన్జీవోస్‌ తోపాటు పలు దినపత్రికల క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టిఎన్‌జివోస్‌ ప్రతినిదులు బాల్‌రాజ్‌, మోతిసింగ్‌, విశ్వనాథ్‌, ఆయా పత్రికల విలేకరులు, తదిరులు పాల్గొన్నారు.

Read More »

రోడ్డు వెడల్పు పనులు పరిశీలించిన కమీషనర్‌, పోలీసు అధికారులు

  కామరెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని కొత్త బస్టాండ్‌ సమీపంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డు వెడల్పునకు సంబంధించిన పనుల విషయంపై మంగళవారం సాయంత్రం మునిసిపల్‌ కమీషనర్‌ రామాంజనేయరెడ్డి, డిఎస్‌పి ప్రసన్నరాణిలు కలిసి పరిశీలించారు. ప్రధాన చౌరస్తాలో వాహనాలు తిరగడానికి ఇబ్బందులు ఉండడంతో సిఎస్‌ఐ చర్చి సమీపంలోని చౌరస్తాలో రోడ్డు వెడల్పు అంశాలను టిపివో శైలజను అడిగి తెలుసుకున్నారు. గతంలో మర్క్‌ ఔట్‌ ఇచ్చిన వివరాలు కమీషనరనతో పాటు డిఎస్‌పికి వివరించారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు ...

Read More »

స్వచ్చభారత్‌ అవగాహన ర్యాలీ

  కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో స్వచ్చభారత్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మునిసిపల్‌ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని వివిధ పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులతో ర్యాలీని ప్రారంభించడానికి మునిసిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేత ర్యాలీ ప్రారంభించి విద్యార్థులతో కలిసి కొత్త బస్టాండ్‌ వరకు వెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్చభారత్‌ సాదనకై కృషి చేయాలన్నారు. ...

Read More »