Breaking News

Daily Archives: January 11, 2018

మండల, తాలూకా యూనిట్ల రద్దు అప్రజాస్వామికం

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రశాఖ చేసిన సవరణలో భాగంగా మండల, తాలూకా యూనిట్ల రద్దు అప్రజాస్వామికమని కామారెడ్డి రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. కామరెడ్డిలో గురువారం కామారెడ్డి తాలూకా యూనిట్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రకమిటీ మండల, తాలూకా యూనిట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో తామే స్వతంత్రంగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం సంఘం నిర్వహిస్తున్న కార్యకలాపాలపై ...

Read More »

సమ్మె గోడప్రతుల ఆవిష్కరణ

  కామరెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తు ఈనెల 15న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మెకు సంబందించిన గోడప్రతులను గురువారం కామారెడ్డిలో ఆవిస్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు మాట్లాడుతూ 45వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్సు సిఫార్సులను అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో పథకాలన్నిటికి సరిపడా నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం వాటాలను సకాలంలో చెల్లించాలని, రూ. 18 వేల కనీస వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతో సమ్మె ...

Read More »

నిర్మాణ రంగంలో ఎఫ్‌డిఐ అనుమతులు విరమించుకోవాలి

  కామరెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మాణ రంగంలో వందశాతం ఎఫ్‌డిఐలను అనుమతించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐసిటియు అనుబంధ ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, కార్యదర్శి రాజలింగంలు మాట్లాడారు. స్వదేశీ నినాదంతో అధికారం చేపట్టిన బిజెపి దేశంలో వనరులను బహుళ జాతి సంస్థలకు తాకట్టు పెడుతున్నారని, విదేశీ కంపెనీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఇది కార్మికుల పాలిట శాపంగా మారిందని ...

Read More »

అర్హులైన వారిని ఓటరుజాబితాలో చేర్చాలి

  కామరెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన వయోజనులను ఓటరు జాబితాలో చేర్చేందుకు విద్యాసంస్థలు, అంగన్‌వాడి కేంద్రాలు సంక్షేమ కార్యాలయాలు నిరంతరాయంగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య సూచించారు. జనవరి 25 ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు దినోత్సవంపై విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి పాఠశాల, కళాశాలల, డిగ్రీ స్థాయిలో 18న, నియోజకవర్గ స్థాయిలో 21, జిల్లా స్థాయిలో 24న, రాష్ట్ర స్థాయిలో వ్యాస, వక్తృత్వ పోటీలు ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవార్డి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2018 క్యాలెండర్‌, డైరీని గురువారం జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌ ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు తమ బాధ్యతలతో పాటు విద్య, సామాజిక సేవలో పాల్గొని తమ సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సేనాపతి, మనోహర్‌రావు, గంగాకిషన్‌, రవిందర్‌, నీల లింగం, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

  కామరెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వంద మందికిపైగా విద్యార్థులు ముగ్గులు వేయగా ప్రతిభ కనబరిచిన ముగ్గురికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ సుష్మ, ఎస్‌ఎఫ్‌ఐ, టిమాస్‌ ప్రతినిధులు అరుణ్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

అక్షర పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

  కామరెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అక్షర పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల అంతటా పల్లెటూరు వాతావరణాన్ని రూపొందించారు. చిన్నారులు గోదాదేవి, హరిదాసు వంటి సంప్రదాయ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. సంప్రదాయ పిండి వంటలు చేశారు. చిన్నారులకు ప్రధానోపాధ్యాయురాలు సంగీతరెడ్డి బోగిపండ్లు పోశారు. విద్యార్తినిలు ఆసక్తితో రంగోలి పోటీల్లో పాల్గొన్నారు. సంక్రాంతి విశిష్టతను పిల్లలకు చెప్పేందుకు వేడుకలు నిర్వహించినట్టు ప్రిన్సిపాల్‌ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్‌ అశోక్‌రెడ్డి, ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో చేయూత

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం అన్నారం గ్రామంలో షేక్‌ ఖలీం అనే వ్యక్తి ఇల్లు గురువారం ప్రమాదవశాత్తు దగ్దమైంది. దీంతో బాధితుడు ఖలీంకు లయన్స్‌ క్లబ్‌, బాంబే క్లాత్‌ ఆధ్వర్యంలో దుస్తులు, వంటసామగ్రి అందజేశారు. లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు, బాంబే క్లాత్‌ యజమాని రాజ్‌కుమార్‌, దామోదర్‌రెడ్డి, రమేశ్‌, తదితరులున్నారు.

Read More »

శుక్రవారం చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా శుక్రవారం ఉదయం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బాధితులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్టు ఆత్మ కమిటీ ఛైర్మన్‌ బల్వంత్‌రావు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ రోగాలతో చికిత్స పొందిన బాధితులకు సిఎం రిలీఫ్‌ ఫండ్‌నుంచి చెక్కులను పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

Read More »

ట్రాక్టర్‌ బోల్తా – తప్పిన ప్రమాదం

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చెరుకు ట్రాక్టర్‌ బోల్తాపడి పెను ప్రమాదం తప్పింది. లోకేశ్‌ అనే వ్యక్తి చెరుకు లోడ్‌తో వెళుతుండగా ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో అరగంటపాటు ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు చేరుకొని ట్రాఫిక్‌ను పునరుద్దరించారు.

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కు పంపిణీ

  నిజాంసాగర్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకోసం తెరాస ప్రభుత్వం సహకరిస్తుందని నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు గంగారెడ్డి అన్నారు. మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో జక్కాపూర్‌ గ్రామానికి చెందిన సావిత్రికి కళ్యాణలక్ష్మి చెక్కును గురువారం అందజేశారు. 75 వేల 116 రూపాయల చెక్కును గంగారెడ్డి, గిర్దావర్‌ సయ్యద్‌ హుస్సేన్‌లు పంపిణీ చేశారు. నిరుపేద ఆడపిల్లల వివాహం కోసం తెరాస ప్రభుత్వం షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి పథకాల కింద ఆర్థిక సాయం చేస్తుందన్నారు.

Read More »

ఈనెల 13న గోదా రంగనాథుల కళ్యాణం

  కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13వ తేదీన శ్రీ గోదారంగనాథస్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్టు చాత్తాద వైష్ణవ సంఘం ప్రతినిధులు నల్లవెల్లి అశోక్‌, గుమ్మడి రవిలు తెలిపారు. ఉదయం కళ్యాణోత్సవం, మధ్యాహ్నం అన్నదానం తదితర కార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయాలని కోరారు.

Read More »

పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

  బీర్కూర్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో శ్రీవెంకటసాయి విద్యానికేతన్‌ పాఠశాలలో గురువారం సంక్రాంతి పండగను పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు ఏర్పాటు చేసి విద్యార్థుల కోలాటాలతో పాడిన పాటలు మంత్ర ముగ్దులను చేశాయి. విద్యార్థులచే గంగిరెద్దుల ప్రదర్శన చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది. ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ప్రతి ఇంటికి నల్ల

  బీర్కూర్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రతి ఇంటికి త్వరలోనే నల్ల అందిస్తామని బీర్కూర్‌ సర్పంచ్‌ దులిగ నర్సయ్య అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని వైఎస్‌ఆర్‌ కాలనీలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎ.ఇ. రవితో కలిసి పైప్‌లైన్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా మరికొద్ది రోజుల్లో గ్రామంలో ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీటిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Read More »

గర్భిణీలు, బాలింతలకు వైద్య పరీక్షలు

  బీర్కూర్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోఇ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం గర్భిణీలు, బాలింతలకు ప్రాథమిక వైద్యుడు దిలీప్‌కుమార్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి, షుగర్‌ లాంటి రక్తపరీక్షలు చేపట్టారు. తప్పకుండా గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరుపుకోవాలని, ప్రభుత్వం నుంచి రూ. 12 వేలు ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »