Breaking News

Daily Archives: January 12, 2018

ఐదుగురికి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శుక్రవారం ఐదుగురికి చెక్కులు పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ఐదుగురు బాధితులు వివిధ రోగాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన లక్ష 69 వేల రూపాయలను అందించారు.

Read More »

ఆర్‌ఎస్‌పి ఆధ్వర్యంలో ధర్నా

  కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తు శుక్రవారం ఆర్‌ఎస్‌పి ఆద్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో డివిజన్‌ నాయకుడు నర్సింలు మాట్లాడారు. అర్హులైన దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ తదితర స్కీములను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పలు డిమాండ్లతోకూడిన వినతి పత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.

Read More »

వెనకబడిన కులాల వివరాలు సేకరించాలి

  కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెనకబడిన కులాల సంక్షేమానికి ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తుందని వారి వివరాలు సేకరించి సన్నద్దంగా ఉండాలని బిసి వెల్పేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బుర్ర వెంకటేశం శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా బిసి వెల్పేర్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతోపాటు బిసి వెల్పేర్‌ అధికారులు కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ సెక్రెటరీ మాట్లాడుతూ రాబోయే పదిరోజుల్లో నాయిబ్రాహ్మణ, ఫిషర్‌ మెన్‌, ఎంబిసి, విశ్వబ్రాహ్మణ, సంచార కులాలకు ...

Read More »

ఘనంగా వివేకానంద జయంతి

  కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద 155వ జయంతి ఉత్సవాలు వివిధ పార్టీలు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం వద్దగల వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ మురళీధర్‌గౌడ్‌ మాట్లాడుతూ యువతతో పాటు ప్రజలు వివేకుని అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మోతె కృష్ణాగౌడ్‌, చింతల రమేశ్‌, జూలూరి సుధాకర్‌ తదితరులున్నారు. అలాగే దోమకొండ అనాథ ఆశమంలో ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల శాతం పెంచాలి

  కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల శాతం మరింతగా పెంచేందుకు చర్యలుతీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ, ఐసిడిఎస్‌ అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌ కిట్‌ ప్రోగ్రాం ఆన్‌లైన్‌ నమోదులో జుక్కల్‌, పిట్లం, పెద్ద కోడప్‌గల్‌, నిజాంసాగర్‌ తదితర ఆరోగ్య కేంద్రాలు వెనకబడి ఉండడం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ఆరోగ్య కేంద్రాల సిబ్బందిని మందలించారు. కెసిఆర్‌ కిట్‌ గురించి ...

Read More »

ఉపాధ్యాయ వృత్తికి నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరం

  కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయాలంటే నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరమని కామరెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రషీద్‌ అన్నారు. అహ్మద్‌ బిఇడి కళాశాలలో శుక్రవారం ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ శిక్షణ పొందని ఇన్‌సర్వీసు ఉపాద్యాయులకు ఎన్‌ఐఓఎస్‌ ద్వారా బిఇడి కోర్సు ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సామాజిక భద్రత ఉపాధ్యాయుని చేతుల్లో ఉందన్నారు. ఈ కోర్సును ఉపయోగించుకొని నైపుణ్యాలు పెంచుకొని ఉత్తమ ఉపాధ్యాయునిగా తయారుకావాలని ...

Read More »

ఓడిఎఫ్‌గా 14వ వార్డు

  కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 14వ వార్డు ప్రజలు బహిరంగ మలవిసర్జన లేని వార్డుగా మరుగుదొడ్లు నిర్మించుకోవడం అభినందనీయమని వార్డు కౌన్సిలర్‌ నిమ్మ దామోదర్‌రెడ్డి అన్నారు. పాత పట్టణంలో 14వ వార్డును ఓడిఎఫ్‌గా మునిసిపల్‌ అధికారులు ప్రకటించారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Read More »

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి

  నిజాంసాగర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని డిహెచ్‌ఇ సంజీవరెడ్డి తెలిపారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం ఏఎన్‌ఎంలకు బిఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కార్డులను అందజేశారు. మోబైల్‌ యాప్‌ ద్వారా ఆరోగ్య విషయాలను, రోజువారి డాటా ఎలా పొందుపర్చాలనే విషయాలపై అవగాహన కల్పించారు. వైద్య సేవలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. సమావేశంలో ...

Read More »

షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, దోమకొండ, బీబీపేట మండలాలకు చెందిన 96 మంది లబ్దిదారులకు షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ అందజేశారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మాట్లాడారు. పేదింటి మహిళలకు అండగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ, తెరాస నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

తాళం వేస్తే సమాచారం ఇవ్వాలి

  కామరెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఆయా వార్డుల్లో ఇంటికి తాళం వేసి వెళ్లేవారు పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సిఐ శ్రీధర్‌కుమార్‌ సూచించారు. సంక్రాంతి పండగ సందర్భంగా తమ గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉంచవద్దని సూచించారు. మెడలో బంగారు ఆభరణాలు ధరించి వెళ్లేటపుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Read More »

ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు

  బీర్కూర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు సతీష్‌ వివేకానందుని చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12న జాతీయ యువజనోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత స్వామిజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

పల్స్‌పోలియో విజయవంతం చేయండి

  బీర్కూర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 28 నుంచి 30 వరకు నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో మండలంలోని ఆయా శాఖ అధికారులచే శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్బంగా ప్రాథమిక వైద్యులు డాక్టర్‌ దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ 0 నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయాలని, బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో సుమారు 6 వేల మంది చిన్నారులకు పోలియో ...

Read More »

శనివారం రెండు పడక గదుల ఇళ్లకు భూమిపూజ

  బీర్కూర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్టు ఎంపిపి మల్లెల మీణ హన్మంతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు అందించే రెండు పడక గదుల ఇళ్లలో భాగంగా కిష్టాపూర్‌ గ్రామానికి 5 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి విచ్చేస్తున్న సందర్భంగా తెరాస కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ...

Read More »

15లోపు ఆన్‌లైన్‌ నమోదు పూర్తి

  నందిపేట, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో కొనసాగుతున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వివరాలను ఈనెల 15లోపు కంప్యూటరీకరణ చేస్తామని తహసీల్దార్‌ ఉమాకాంత్‌రావు తెలిపారు. ఇప్పటి వరకు మండలంలోని 32 గ్రామాలకుగాను 30 గ్రామాల్లో 94 శాతం సర్వే పూర్తిచేసి మండలంలో ఉన్న 60328 ఎకరాలకు వున్న 48015 సర్వే నెంబర్‌లలో 34695 సర్వే నెంబర్‌లు క్లియర్‌ చేశామన్నారు.

Read More »

సంకల్ప బలముంటే విజయం సలాం చేస్తుంది

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతకు స్పూర్తి ప్రదాత, ప్రపంచ మేధావులను ఆలోచింపజేసిన మహానుభావుడు స్వామివివేకానంద 155వ జయంతిని సిరికొండ మండలంలోని సత్యశోధక్‌ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ నర్సయ్య మాట్లాడుతూ యువతరం నరనరాన శక్తిని రంగరింపజేసి అద్బుత ప్రసంగాలు, మాటలతో యావత్‌ దేశానికే వన్నె తెచ్చిన స్వామి వివేకానంద జీవిత ఇతిహాసం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. సంకల్ప బలముంటే విజయం సలాం చేస్తుందని, అంకిత భావం, ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష సమూహమైతే ...

Read More »

యువకుడు అదృశ్యం

  నందిపేట, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని ఖుదావన్‌ పూర్‌ గ్రామానికి చెందిన రజియోద్దీన్‌ (26) భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది ఇంటినుంచి వెళ్ళిపోయాడని నందిపేట ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం…. ఖుదావన్‌పూర్‌ గ్రామానికి చెందిన రజీయోద్దీన్‌కు నీల గ్రామానికి చెందిన సమీనా బేగంతో 14 నెలల క్రితం వివాహం అయింది. ప్రారంభంలో అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం మతపెద్దల సమక్షంలో పంచాయతీలో రాజీ కుదుర్చుకున్నారు. అయినప్పటికి భార్య ...

Read More »

వివాహిత ఆత్మహత్య

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 4వ టౌన్‌ పరిధిలో సాయినగర్‌కు చెందిన వివాహిత రేణుక (36) ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. రేణుక గత ఆరుసంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాదపడుతుండగా శుక్రవారం తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుందని అన్నారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ వివరించారు.

Read More »

ఉద్యోగుల వెన్నంటే ఉంటాను

  – టిఎన్‌జివోస్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌ నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్క ఉద్యోగికి వెన్నంటే ఉంటానని టిఎన్‌జివోస్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌ అన్నారు. శుక్రవారం టిఎన్‌జివోస్‌ భవనంలో చార్జ్‌డ్‌ ఉద్యోగులతో సమావేశమై ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క ఉద్యోగికి తన సోదరులాగా భావించి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, ఏ ఉద్యోగికి ఇబ్బంది ఎదురైనా వారి సమస్యలు పరిష్కరించడంలో ముందంజలో ఉంటానని కిషన్‌ అన్నారు. ప్రతినిధులు మాట్లాడుతూ కిషన్‌ కృషి వల్ల తమకు రావాల్సిన ...

Read More »

24న రైల్వే జిఎం రాక

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ మధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌ 24న నిజామాబాద్‌ డివిజన్‌ను సందర్శించనున్నారని రైల్వే డిఆర్‌ఎం అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తిచేసి రైల్వే జిఎం ముందు ఎలాంటి అబాసుపాలు కాకూడదని అధికారులకు సూచించారు. స్టేషన్‌లో మౌలిక వసతుల విషయంలో శ్రద్ద వహించాలని, దీనిపై తరచుగా ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. అనంతరం రైల్వే శాఖ భవన నిర్మాణం, ఆసుపత్రి సిబ్బంది ...

Read More »

నీలకంఠేశ్వరాలయం హుండీ లెక్కింపు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు కంఠాభరణం నీలకంఠేశ్వర స్వామి ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో లక్ష 42 వేల 555 రూపాయలు సమకూరినట్టు ఆలయ ఛైర్మన్‌ కోవూరి జగన్‌ తెలిపారు. ఆదాయం నవంబర్‌ డిసెంబరు మాసాలకు సంబంధించిందని పేర్కొన్నారు. హుండీ లెక్కింపులో ఇవో మహేందర్‌గౌడ్‌, ఆలయ కమిటీ సభ్యులు రవి, శంకర్‌, శివ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Read More »