Breaking News

Daily Archives: January 13, 2018

నందిపేటకు బదిలీపై వచ్చిన ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌

  నందిపేట, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల ప్రజలు, యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడానికి జంకుతున్నారు. 2017 అక్టోబరు 5న ఆర్మూర్‌ నుంచి నందిపేటకు బదిలీపై వచ్చిన ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ నందిపేట పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే తనదైన శైలిలో విధులు నిర్వహిస్తు ప్రజలతో శభాష్‌ అనిపించుకుంటున్నారు. గత మూడునెలల్లో డిసెంబరు 31 వరకు పోలీసు యాక్టు కింద అక్టోబరులో 75, నవంబర్‌లో 125, డిసెంబరులో 94 మొత్తం 294 కేసులు నమోదుచేసి ...

Read More »

ముద్ర రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి

కామరెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్న, మద్య తరగతి వ్యాపారులకు ముద్ర రుణాలు బ్యాంకుల టార్గెట్‌ ప్రకారం అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటి, మునిసిపల్‌ శాఖ మంత్రి కెటిఆర్‌ శనివారం వీడియో కాన్పరెన్సు ద్వారా అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రతినెల ముద్ర లోన్‌ మేళాలను బ్యాంకులు బ్రాంచిల వారిగా నిర్వహించాలని సూచించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులకు శిశు కేటగిరి కింద ...

Read More »

విద్యుత్‌ఘాతంతో ఒకరు మృతి

  బీర్కూర్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ గ్రామానికి చెందిన బానోత్‌ మోహన్‌ (36) విద్యుత్‌ ఘాతంతో మృతి చెందినట్టు ఎస్‌ఐ అనిల్‌రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారంమృతుడు మోహన్‌కు సంగం గ్రామశివారులో తన సొంత పొలంలో బోరు మోటారు పనిచేయకపోవడంతో శనివారం పొలానికి వెళ్ళి ఫ్యూజులు తీస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడని తెలిపారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ...

Read More »

కార్మికులకు దుస్తుల పంపిణీ

  కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలోని కార్మికులకు శనివారం దుస్తులు పంపిణీ చేశారు. దేవాలయంలో 55 రోజులపాటు జరిగిన అయ్యప్ప భిక్ష కార్యక్రమంలో పనిచేసిన వారికి అయ్యప్ప ఆలయం, అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. 55 రోజులపాటు కార్మికులు సేవలందించారని, వారికి తమవంతుగా దుస్తులు అందజేసినట్టు తెలిపారు. ప్రతినిదులు చీల ప్రభాకర్‌, ముప్పారపు ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

జనవరి 16 నుంచి ప్రజాసమస్యల పరిష్కారానికి ఆందోళనలు

  కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తు జనవరి 16 నుంచి 19 వరకు ప్రజా సమస్యలపై టిమాస్‌ ఫోరం ఆద్వర్యంలో మండలాల్లో ఆందోళనలు, నిరసన దీక్షలు చేపట్టనున్నట్టు టిమాస్‌ ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్‌.సిద్దిరాములు తెలిపారు. భిక్కనూరు మండల కేంద్రంలో శనివారం టిమాస్‌ ఫోరం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో రాష్ట్రంలో టిమాస్‌ ఫోరం ఏర్పాటైందన్నారు. ప్రభుత్వం ప్రజల కిచ్చిన హామీలు అమలు ...

Read More »

ఇసుక అక్రమ రవాణాకు చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారయణతోపాటు ఎస్‌పి శ్వేతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూ స్యాండ్‌ టాక్సీ పాలసీని ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా నేరుగాప్రజలే ఇసుక బుక్‌ చేసుకునే విధంగా జిల్లాలో చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా పారదర్శకత ...

Read More »

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

  కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామరెడ్డి జిల్లాలో భోగి పండగ పురస్కరించుకొని శైవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి పంచామృతంతో అభిషేకాలు నిర్వహించారు. దేవునిపల్లిలోని శివాలయంలో ఎంపిపి లద్దూరి మంగమ్మ యాదవ్‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Read More »

ఘనంగా బోగి పండుగ సంబరాలు

  కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో శనివారం బోగి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భోగి పండుగ సందర్భంగా చిన్నారులకు తలపై నుంచి రేగి పండ్లు పోశారు. రేగి పండ్లంటే సూర్యుని రూపం, రంగు కలిసి ఉంటాయని, ఈ పళ్లను నాణేలతో కలిపి చిన్నారులపై పోయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం పిల్లలపై కలుగుతుందనే భావన ఉంది. పండగ నేపథ్యంలో పిండి వంటలను చేసుకున్నారు. సాయంత్రం వేళ పాత వస్తువులను భోగి మంటల్లో వేశారు. తద్వారా కీడు ...

Read More »

ప్రతాప్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలి

  కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఉస్మాన్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్‌తోపాటు రాష్ట్రంలో తెరాస అవినీతి, అక్రమాలు ప్రశ్నించినందుకే ప్రభుత్వం కక్షకట్టి అరెస్టు చేసి జైలుకు పంపిందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెరాసకు ప్రజలు బుద్ది చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు నజీరుద్దీన్‌, గంగాధర్‌, నర్సింలు, జావిద్‌ పాల్గొన్నారు.

Read More »

అభివృద్ది పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

  కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శనివారం పరిశీలించారు. భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో పది లక్షల రూపాయలతో చేపడుతున్న శ్మశాన వాటిక అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతతో కూడిన పనులు చేసి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు రాంచంద్రం, గోపాల్‌, స్వామి తదితరులున్నారు.

Read More »

పోలీసుల తనిఖీలు

  కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో శనివారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఎస్‌ఐ మాజర్‌, ఏఎస్‌ఐ రాములు ఆధ్వర్యంలో వాహనాల తనికీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించారు.

Read More »

మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో కబడ్డి పోటీలు

  కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శనివారం సరస్వతి శిశుమందిర్‌ ఆవరణలో కబడ్డి పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆకుల శ్రీనివాస్‌ మాట్లాడారు. యువకులు చదువుతోపాటు ఆటల్లో రాణించి సమాజంలో గుర్తింపు పొందాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు సాయిలు, గంగాధర్‌, శ్రీనివాస్‌, వేణు, రాజు, తదితరులున్నారు.

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అన్నదానం

కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం నిర్వహించారు. లయన్స్‌ వ్యవస్థాపకుడు జోన్స్‌ పుట్టినరోజు సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో రోగులకు, ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు రమేశ్‌, నిమ్మ దామోదర్‌రెడ్డి, శ్యాంగోపాల్‌, అశోక్‌రెడ్డి, సంతోష్‌, గంగాధర్‌ తదితరులున్నారు.

Read More »