Breaking News

Daily Archives: January 14, 2018

పోలీసుల ఆధ్వర్యంలో గోడ ప్రతుల ఆవిష్కరణ

  బీర్కూర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో ఎస్‌ఐ అనిల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరుక శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసుల సూచనలు, జాగ్రత్తలు, చర్యలు, పర్యవసనాలకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ అనిల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రజలకు సమస్య వాతావరణం నెరవేర్చే దిశగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోడప్రతులు ఆవిష్కరిస్తున్నామని అన్నారు. గల్ప్‌ ఏజెంట్ల మోసాలు, సిసి కెమెరాల ఉపయోగాలు, మూఢ నమ్మకాలపై అవగాహన, ఆత్మహత్యల నివారణపై జాగ్రత్తలు, దొంగతనాలపై అవగాహన, ...

Read More »

డిగ్రీ కళాశాల స్థల వివాదం

  – అడ్డుకున్న విపక్ష నేతలు కామరెడ్డి, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం తమదేనంటూ నిజామాబాద్‌కు చెందిన కొందరు భూమిని చదును చేస్తుండగా విద్యార్థి సంఘాల నాయకులతో పాటు జేఏసి, విపక్షాల నాయకులు అడ్డుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు భూమికి సంబంధించిన కాగితాలతో పాటు కోర్టుకు తమకే అనుకూలంగా తీర్పునిచ్చిందంటూ ట్రాక్టర్‌తో కళాశాల మైదానాన్ని దున్నించారు. విషయం తెలుసుకున్న జేఏసి కన్వీనర్‌ జగన్నాథం, విద్యార్థి సంఘాల నాయకుల అక్కడికి చేరుకొని ట్రాక్టర్‌కు ...

Read More »

సినీ ప్రేక్షకులకు ఆధునిక సౌకర్యాలు

  కామరెడ్డి, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో సినీ ప్రేక్షకులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రియ 70 ఎంఎం నూతన హంగులతో ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఏసియన్‌ సంస్థ పునర్‌వైభవం తీసుకొచ్చింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సినిమా హాలును ప్రారంభించి మాట్లాడారు. నూతన టెక్నాలజీతోపాటు అన్ని వసతులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సినిమాహాలు యజమానులు అశోక్‌, రమేశ్‌లు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణ పెరిక సంఘం నూతన క్యాలెండర్‌ను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు పోతరాజు వెంకటేశ్‌, ఉపాధ్యక్షుడు శేఖర్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారి శివప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు

  నందిపేట, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహం వద్ద, పెట్రోల్‌ బంక్‌ చౌరస్తా వద్ద పోలీసులు శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణ నష్టం జరగడమే కాకుండా, రోడ్డున వెళ్లే ఇతరుల ప్రాణాలకు హాని కలిగే అవకాశముందన్నారు. కాబట్టి ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.

Read More »

ఘనంగా బోగి వేడుకలు

  కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా బోగి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులు ఉదయం నుంచి గాలిపటాలు ఎగురవేస్తు ఆనందంగా గడిపారు.

Read More »

గోవర్ధన్‌కు శుభాకాంక్షలు తెలిపిన తెరాస నాయకులు

  కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌కు సంక్రాంతి పండగ పురస్కరించుకొని తెరాస నేతలు ఆయన నివాసానికి వెళ్ళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మామిళ్ల రమేశ్‌, అంజద్‌, జూకంటి ప్రభాకర్‌రెడ్డి, లింగం, సంగి మోహన్‌, తదితరులున్నారు.

Read More »

17న కిషన్‌రెడ్డి రాక

  కామరెడ్డి, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 17వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రానికి బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి రానున్నట్టు జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 17న కలెక్టర్‌ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నా కార్యక్రమానికి హాజరవుతారన్నారు. ఇసుక మాఫియా చేతుల్లో విఆర్‌ఏలు హత్య గావించబడడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ మురళీధర్‌గౌడ్‌, నాయకులు కృష్ణాగౌడ్‌, నీలం రాజులు, చింతల రమేశ్‌, ...

Read More »

వైభవంగా గోదా, రంగనాథుల కళ్యాణం

  బీర్కూర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల ఆలయంలో నిర్వహిస్తున్న గోదాదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఆదివారం పాల్గొన్నారు. రాష్ట్రం పాడి, పంటలతో, ప్రజలు సిరి సంపదలతో తులతూగాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పోచారం శంభురెడ్డి, ద్రోణవల్లి అశోక్‌, అప్పారావు, ప్రభాకర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా సంక్రాంతి సంబరాలు

  బీర్కూర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో సంక్రాంతి పండుగను మండల వాసులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు. పండగ సందర్భంగా బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి పిండి వంటలు ఆరగించి ఆనందంగా జరుపుకున్నారు. చిన్న పిల్లలు నూతన వస్త్రాలు ధరించి గాలిపటాలు ఎగురవేశారు. వేకువ జామున బీర్కూర్‌ మండల కేంద్రంలోని 7వ వార్డులో కాలనీ వాసులు, గ్రామ సర్పంచ్‌ నర్సయ్య, వార్డు మెంబరు గాండ్ల ...

Read More »

సంక్షేమ పథకాలు అందరికి వర్తింపజేయాలి

  బీర్కూర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికి వర్తింపజేయాలని, స్వంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందించడం ఏమిటని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మల్యాద్రిరెడ్డి విమర్శించారు. నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ గ్రామనికి చెందిన మోహన్‌ అనే వ్యక్తి శనివారం విద్యుత్‌సాక్‌తో మృతి చెందిన సందర్భంగా ఆదివారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు తెరాస పార్టీ నాయకులకే అందుతున్నాయని, వ్యక్తిని చూసి సంక్షేమ పథకాలు అందించడం తెరాస పార్టీ నాయకులకే ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

  బీర్కూర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఆదివారం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరుక శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతి పండుగకు సముచిత ప్రాముఖ్యం ఉందని ముగ్గులతో, పిండి వంటలతో, పతంగులతో పండగ ఘనంగా నిర్వహిస్తారన్నారు. పాఠశాలలో మహిళలు వేసిన ముగ్గులు పరిశీలించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ అనిల్‌రెడ్డి, ఎంపిటిసి ...

Read More »

జాతీయ రహదారిపై గుంతలు

  – పట్టించుకోని అధికారులు నిజాంసాగర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామ శివారులోగల నల్లవాగు మత్తడి వంతెన వద్ద సంగారెడ్డి-నాందేడ్‌-అకోల జాతీయ రహదారి 161 ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి గుండా ప్రతిరోజు వందలాది వాహనాలు వెళుతుంటాయి. ఈ రహదారి గుంతలు పడినప్పటికి జాతీయ రహదారుల విభాగం అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు రహదారిపై ...

Read More »

నిజాంసాగర్‌ ప్రధాన కాలువ మీదుగా మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌

  నిజాంసాగర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ డిస్టిబ్యూటరీ – 1 వద్ద మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ఏర్పాటు కోసం ప్రధాన కాలువ పైప్‌లైన్‌ నుంచి ఇనుప బ్రిడ్జి సిద్దం చేశారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా బాన్సువాడ, బోధన్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు స్వచ్చమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా పైప్‌లైన్‌ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వేస్తున్న పైప్‌లైన్లు నిజాంసాగర్‌ ప్రధాన కాలువ డిస్టిబ్యూటరీ – 1 వద్ద ...

Read More »

సంక్రాంతికి ముందు భోగీ: ఎందుకు, ఎలా చేస్తారు?

                          నిజామాబాద్ న్యూస్ పాఠకులకు భోగ భాగ్యాల భోగి శుభాకంక్షలు భోగిపండుగ ఇంద్రుని గుణించి చేయబడే పండుగగా కనిపిస్తుంది. ఇంద్రుడు మేఘాధిపతి. మేఘాలు లోకానికి వర్షాలు ఇస్తాయి. పంటలు పండడానికి వర్షాలు అవసరం. కాగా సకల వర్షాల కోసం ఇంద్రుని పూజించే ఆచారం ఏర్పడింది. ఇట్టి పూజల వలన ద్వాపరయుగంలో ఇంద్రుడికి గర్వం హెచ్చిపోయింది. అందుచేత అతనికి గర్వభంగం చేయాలని కృష్ణుడికి తోచింది. ఇంతలో ఒకానొక భోగిపండుగ ...

Read More »