Breaking News

Daily Archives: January 15, 2018

పతంగుల హల్‌చల్‌

  కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పతంగుల హల్‌చల్‌ నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా పతంగుల సందడి తగ్గినప్పటికి ఈయేడు తిరిగి పుంజుకుంది. ఏ బంగ్లాపై చూసినా యువకులు, పెద్దలు, పిల్లలు పతంగులు ఎగురవేస్తు కనిపించారు. డిజె శబ్దాలతో కేరింతలు కొడుతూ, నృత్యాలుచేస్తు గాలిపటాలు ఎగురవేస్తు ఆనందంగా, ఉత్సాహంగా గడిపారు.

Read More »

ఘనంగా సంక్రాంతి వేడుకలు

  కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో సోమవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వేకువ జామునే లేచి ఇళ్ళ ముందు అందమైన రంగవల్లులను వేశారు. ఏ ఇంటి ముందు చూసినా వివిధ రకాల రంగవల్లులు దర్శనమిచ్చాయి. పండగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిసేకాలు నిర్వహించారు.

Read More »

సంక్రాంతి పండగలో గంగిరెద్దుల సందడి

  కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి అనంగానే గుర్తుకొచ్చేది భోగి మంటలు, గంగిరెద్దులు, రేగిపండ్లు, పతంగులు… ఇవన్నీ సంక్రాంతి పండగలో ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. ఈయేడు సైతం గంగిరెద్దులవారు సంక్రాంతి పండగ సందర్భంగా వీధుల్లో సందడి చేశారు. గంగిరెద్దులను రంగురంగుల దుస్తులతో అలంకరించి వాటికి గజ్జలు కట్టి వీధుల్లో తిప్పారు. గంగిరెద్దులతో సెల్ఫీలు దిగుతూ, భిక్షాటన సమర్పిస్తు ఆనందంగా గడిపారు. గంగిరెద్దులవారు సన్నాయి వాయిస్తుంటే దానికి అనుగుణంగా ఎద్దులు గంటలతో శబ్దం చేస్తు నృత్యాలు చేశాయి. వివిధ ప్రదర్శనలతో ...

Read More »

పేకాటరాయుళ్ళ అరెస్టు

  నందిపేట, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని నికాల్‌పూర్‌ గ్రామ శివారులో సోమవారం పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు. పేకాటరాయుళ్ళ వద్దనుంచి రూ. 7100 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్‌ఐ అన్నారు.

Read More »

ఎంప్లాయిమెంట్‌ కార్డుకు మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోండి

  కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువత ఎంప్లాయిమెంట్‌ కార్డును ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని జిల్లా ఉపాధి కల్పనాధికారి షబానా ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందన్నారు. కొత్త ఎంప్లాయ్‌మెంట్‌ కార్డుతోపాటు రెనివల్‌, ఉన్నత విద్య సర్టిఫికెట్లు జతపరచడానికి షషష.వఎజూశ్రీశీవఎవఅ్‌.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సందర్శించి తద్వారా నేరుగా అభ్యర్థి విద్యార్హత, కుల, ఇతర పత్రాలు నమోదు చేసుకోవచ్చన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read More »

16న షబ్బీర్‌ అలీ రాక

  కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ మంగళవారం జిల్లా కేంద్రానికి విచ్చేయనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, నాయకులు కన్నయ్య, గంగాధర్‌లు తెలిపారు. డిగ్రీ కళాశాల స్థల వివాదం విషయంపై పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.

Read More »

పూర్వ విద్యార్థుల సమావేశం

  కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం రక్షణ కొరకు కళాశాలలో అభ్యసించిన పూర్వ విద్యార్థులు మంగళవారం ఉదయం 10 గంటలకు డిగ్రీ కళాశాల మైదానానికి తరలిరావాలని పూర్వ విద్యార్థులు మల్లేశ్‌, నరేశ్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం ప్రభుత్వ ఆధీనంలో ఉండగా కొందరు వ్యక్తులు తమదేనంటూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.

Read More »

ఘనంగా సంక్రాంతి వేడుకలు

  కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. వేకువ జామునుంచే మహిళలు ఇంటిముందు రంగవల్లులు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం యువకులు గాలిపటాలు ఎగురవేస్తు కేరింతలతో ఉత్సాహంగా పండగ జరుపుకున్నారు.

Read More »

సంక్రాంతి అంటే ఏంటి? ఎందుకు జరపుకోవాలి?

                    నిజామాబాద్ న్యూస్ పాఠకులకు సకల సంతోషాల సంక్రాంతి శుభాకంక్షలు సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు ...

Read More »