Breaking News

Daily Archives: January 17, 2018

రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

  కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లావ్యాప్తంగా పురోగతిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పంచాయతీ రాజ్‌ అధికారులకు సూచించారు. బుధవారం కామరెడ్డి జనహితలో ఆయన రెండు పడక గదుల ఇల్లపై సమీక్షించారు. బాన్సువాడలో 46 ఇళ్ళ నిర్మాణం పూర్తికాగా పక్షం రోజుల్లో మూడు ఇళ్ళ నిర్మాణాలు పూర్తిచేశారన్నారు. 867 ఇళ్ళు పురోగతిలో ఉండగా జుక్కల్‌ నియోజకవర్గంలో – 160, కామారెడ్డి – 942, ఎల్లారెడ్దిలో 20 ...

Read More »

కొత్త జీవోతో ఉపాధ్యాయులకు నష్టం

  నిజాంసాగర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు సిఎన్‌డిఎస్‌ నూతన జీవో జారీచేయడాన్ని పిఆర్‌టియు వ్యతిరేకిస్తుందని రాష్ట్ర పిఆర్‌టియు ఉపాధ్యక్షుడు నారాయణ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న జివో వల్ల అవినీతి జరిగే అవకాశముందని ఆరోపించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సిఎల్‌ను ప్రధానోపాధ్యాయులే మంజూరు చేయాలని, ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారి సిఎల్‌ మంజూరు చేసేలా అనుమతి ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి సిఎల్‌ మంజూరు చేసేలా జీవో రూపొందించడాన్ని ...

Read More »

జిపి భవన నిర్మాణ పనులు ప్రారంభం

  నిజాంసాగర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని బూర్గుల్‌ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ఉపాధి హామీ పథకం కింద రూ. 13 లక్షల నిధులు మంజూరు కావడంతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను పంచాయతీ రాజ్‌ ఎ.ఇ.మారుతి, ఎంపిటిసి లింగాల వసంత రాంచందర్‌, గ్రామ సర్పంచ్‌ అనిత సురేందర్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ...

Read More »

దోమకొండ కోటలో పచ్చదనానికి చర్యలు

  కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ కోటలో పచ్చదనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ బుధవారం పంచాయతీరాజ్‌, ఉద్యానవన శాఖాధికారులకు సూచించారు. దోమకొండ కోటను ఆయన బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో దోమకొండ కోట పరిసరాల్లో ఫెన్సింగ్‌తోపాటు పచ్చదనం పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. హరితహారంలో భాగంగా కోటను మొక్కలతో, గ్రీనరీతోఅద్భుతంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. సమావేశంలో పిఆర్‌ ఇఇ సిద్దిరాములు, ఉద్యానశాఖాధికారి శేఖర్‌, కామారెడ్డి ఆర్డీవో శ్రీను, ...

Read More »

స్వచ్చవార్డుల ప్రకటన

  కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఓడిఎఫ్‌ పూర్తిచేసుకున్న వార్డులను స్వచ్చ వార్డులుగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయి ఓడిఎఫ్‌ పూర్తిచేసుకున్న వార్డులుగా 5వ వార్డు, 11వ వార్డు కౌన్సిలర్లకు బుధవారం అధికారులు ఓడిఎఫ్‌ పత్రాలు అందజేశారు. మిగతా వార్డులను సైతం త్వరితగతిన ఓడిఎఫ్‌ వార్డులుగా ప్రకటించుకొని జిల్లా కేంద్రాన్ని స్వచ్చ జిల్లాగా ప్రకటించుకుందామని మునిసిపల్‌ కమీషనర్‌ రామాంజులరెడ్డి అన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు పద్మ రాంకుమార్‌గౌడ్‌, ముప్పారపు ఆనంద్‌, అధికారులు పాల్గొన్నారు.

Read More »

ఎన్నికలు రాగానే పంచాయతీలు గుర్తుకొచ్చాయా కెసిఆర్‌

– కిషన్‌రెడ్డి కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా సర్పంచ్‌లకు అధికారాలు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన కెసిఆర్‌ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త చట్టాలు తెస్తాం, నిధులు ఇస్తామని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, ఎన్నికలకు ముందే గ్రామ పంచాయతీలు కెసిఆర్‌కు గుర్తుకొచ్చాయా అంటూ బిజెపి అసెంబ్లీ ప్రతిపక్షనేత కిషన్‌రెడ్డి అన్నారు. మహాధర్నా సందర్భంగా కిషన్‌రెడ్డిని అరెస్టు చేసి కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్‌ ...

Read More »

రాష్ట్రంలోని అధికార మాఫియాను తరిమి కొట్టాలి

  కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కెసిఆర్‌ సర్కార్‌ అదికార మాఫియా, ఫిరాయింపు మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా నడిపిస్తోందని దీన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అసెంబ్లీ శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇసుకమాఫియాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని, చివరికి ఉద్యమాలు, ధర్నాలు సైతం చేసుకునే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్‌లోని దర్నా ...

Read More »

గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్‌ సమీక్ష

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే వినూత్నంగా జరుపుకునేందుకు అధికారులు సన్నద్దం చేయాలని అన్నారు. పోలీసు పరేడ్‌ మైదానాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, మంచినీటి వసతి ఏర్పాటుకు నగర కమీషనర్‌ను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తు వీధులు, కార్యాలయాలు, పనిచేసేచోట పరిసరాలు ...

Read More »

కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి

  కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశవ్యాప్తంగా వివిధ పథకాల్లో పనిచేస్తున్న కార్మికుల డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు పేర్కొన్నారు. స్కీం వర్కర్ల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం కామారెడ్డిలో మునిసిపల్‌కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సిఐటియు ఆద్వర్యంలో స్కీం వర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో శ్రీనుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పథకాల్లో పనిచేస్తున్న వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, ...

Read More »

జింకపిల్లను తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున మూడు జింక పిల్లలను తరలిస్తున్న నిర్మల్‌ జిల్లా భైంసాకు చెందిన శంకర్‌ చౌహాన్‌ను అరెస్టు చేసినట్టు నవీపేట ఎస్‌ఐ నరేశ్‌కుమార్‌ తెలిపారు. నవీపేట పోలీసు స్టేషన్‌ పరిధిలోగల యంచ, ఫక్రాబాద్‌ వద్ద రాత్రి పెట్రోలింగ్‌ చేస్తుండగా అనుమానాస్పదంగా గోనెసంచితో భైంసా వైపునకు వెళ్తున్న శంకర్‌చౌహాన్‌ను పట్టుకోగా అతనివద్ద మూడు జింకపిల్లలు లభించాయని ఆయన అన్నారు. జింక పిల్లలను ...

Read More »

పంట రుణాల వడ్డిని ప్రభుత్వమే భరించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈయేడు వర్షాలు అనుకున్నంత స్థాయిలో కురవక పోవడంతో రైతులపై ఆర్థికభారం పడకుండా ప్రభుత్వమే పంట రుణాలు వడ్డిని భరించాలని డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావుకు వినతి పత్రం అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2017 నవంబర్‌లో రైతు రుణాలు మాఫీచేసిన ప్రభుత్వం వడ్డి మాత్రం రైతులచే కట్టించడం దారుణమని ఆయన ఆరోపించారు. రుణమాఫీతోపాటు వడ్డికూడా మాఫీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న ...

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలంలో బుధవారం తహసీల్దార్‌ బాబా షరిఫోద్దీన్‌, తెరాస నాయకుల చేతుల మీదుగా అర్హులైన వారికి కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గాడి లింగం, తెరాస మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, పంపరి శివరాజ్‌, తిరుపతి, నర్సింహారెడ్డి, తదితరులు ఉన్నారు.

Read More »

23న రవీంద్రభారతిలో కర్పూరి ఠాగూర్‌ జయంతి ఉత్సవాలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 23న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జన నాయక్‌ కర్పూరి ఠాగూర్‌ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నాయిబ్రాహ్మణ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మహతి రమేశ్‌ తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 23న జరిగే జయంతి ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి నాయిబ్రాహ్మణులు తరలిరావాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ఎంబిసి ...

Read More »

స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ. 18 వేలు చెల్లించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ వ్యాప్తంగా వివిధ పథకాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడి, మధ్యాహ్న భోజనం, ఆశా, నామ్‌, సర్వశిక్షా అభియాన్‌, కస్తూర్బా గాంధీ, ఐకెపి, విఓఎ, తదితరాల్లో స్కీం వర్కర్లందరికి కనీస వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని సిఐటియు నాయకురాలు నూర్జహాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ధర్నా నిర్వహించి, జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా స్కీం వర్కర్లను ఏ ...

Read More »

నారాయణరెడ్డి సంస్మరణ సభ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎన్జీవోస్‌ మాజీ అధ్యక్షుడు దివంగత నారాయణరెడ్డి సంస్మరణ సభ బుధవారం టిఎన్జీవోస్‌ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కిషన్‌ మాట్లాడుతూ నారాయణరెడ్డి టిఎన్జీవోల కోసం ఎంతో కృషి చేశారని, 1978 నుంచి 1992 వరకు అద్యక్షునిగా కొనసాగి తనతోటి ఉద్యోగుల కష్టసుఖాల్లో పాలుపంచుకొని అందరి మన్ననలు పొందిన అధికారి అని, టిఎన్జీవోస్‌ బలోపేతానికి తనవంతు కృషి చేశారని అన్నారు. నారాయణరెడ్డి హయాంలోనే టిఎన్జీవోస్‌ జిల్లాస్థాయి క్రీడలు నిర్వహించారని, సంప్రదాయం ...

Read More »

డైరీ ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం స్థానిక సందీప్‌ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఇంజనీర్ల సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజనీర్లు ఆధునిక ప్రాజెక్టులకు, రోడ్లకు రూపకల్పన చేసి సమాజానికి తమవంతు కృషి చేశారని, చేస్తున్నారని, వారి సేవలు చిరస్మరణీయమని, దానికి వారి హయాంలో నిర్మించిన కట్టడాలే సాక్షమని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగ విరమణ పొందినవారు ...

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ డాక్టర్‌ భూపతిరెడ్డి బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మైలారం గ్రామంలో లక్ష్మి వెంకటేశ్వర స్వామి జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సిరికొండ మండలం హుస్సేన్‌నగర్‌ గ్రామస్తులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ధర్పల్లి మండలం చీమన్‌పల్లి గ్రామంలో గండి మైసమ్మ ఆలయానికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా సిరికొండ మండలం పందిమడుగు గ్రామంలో గ్రామస్తులు శ్రమదానంతో నిర్మించుకున్న చోడు ...

Read More »

వార్డు సభ్యుని ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ

  బీర్కూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని 8వ వార్డు మెంబరు ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్టు ఎంపిడివో భరత్‌కుమార్‌ తెలిపారు. గతంలో 8వ వార్డు సభ్యుడు, ఉపసర్పంచ్‌ బాబూమియా అనారోగ్యంతో ఆరునెలల క్రితం మృతి చెందడం వల్ల 8వ వార్డుకు ఎన్నిక నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల తిరస్కరణ, 23న ఆర్డీవో పరిశీలన, 24న ఉపసంహరణ, నామినేషన్ల తుది జాబితా ఖరారు చేయడం జరుగుతుందన్నారు. ...

Read More »

అల్లం ప్రభు జాతర, రథోత్సవం

  బీర్కూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామంలో కొనసాగుతున్న అల్లం ప్రభు జాతరలో భాగంగా బుధవారం సాయంత్రం రథోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. వేకువజామున ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అగ్ని గుండం ఏర్పాటు చేశారు. భక్తులు శివ నామ స్మరణతో గుండంలో నడిచారు. సాయంత్రం రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే గురువారం కుస్తీపోటీలు నిర్వహిస్తున్నామని, మల్లయోధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

తెలంగాణ తిరుమల ఆలయ హుండీ లెక్కింపు

  బీర్కూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల ఆలయంలో బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హుండీ లెక్కించారు. ఆలయ హుండీలో లక్ష 46 వేల 860 రూపాయల నగదు ఆదాయం సమకూరినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు వివరించారు.

Read More »