Breaking News

Daily Archives: January 18, 2018

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి

  కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు నెలకొల్పడానికి సబ్సిడీలను ప్రభుత్వ బ్యాంకుల ద్వారా అందించేందుకు పరిశ్రమలు, బ్యాంకులు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. గురువారం తన చాంబరులో డిస్ట్రిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 70 యూనిట్లు దరఖాస్తు చేసుకోగా వాటికి వివిధ శాఖల నుంచి వెంటనే అనుమతి లబిస్తుందన్నారు. డిస్ట్రిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ ద్వారా ...

Read More »

జుక్కల్‌లో కేంద్ర బృందం పర్యటన

  కామరెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూర్‌బన్‌ పథకం కింద ఎంపికైన జుక్కల్‌ నియోజకవర్గంలో పనుల పురోగతిపై గురువారం కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఐఏఎస్‌ జాయింట్‌ సెక్రెటరీ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఎ.కె.తివారి, చీఫ్‌ ప్రోగ్రాం మేనేజర్‌ వినీతా హరిహరణ్‌, చీఫ్‌ విజిలెన్స అధికారి ఆశతో కూడిన బృందం జుక్కల్‌ నియోజకవర్గంలోని మహ్మదాబాద్‌, హేమరాజ్‌ కల్లాలి, జుక్కల్‌లో రూర్‌బన్‌ పథకం కింద పూర్తయిన కిచెన్‌ షెడ్ల నిర్మాణం, పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణం, బస్‌ షెల్టర్ల నిర్మాణం, శ్మశానవాటికల ...

Read More »

ప్రొటెన్షియల్‌ లింక్‌డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాబార్డు ప్రొటెన్షియల్‌ లింక్‌డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ 2018-19 సంవత్సరానికి సంబంధించిన పుస్తకాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నా బార్డు అసిస్టెంట్‌ జిఎం వాసుదేవరావులు ఆవిష్కరించారు. మొత్తం వార్షిక ప్రణాళిక ప్రకారం 3054.83 కోట్లు అంచనా వేసినట్టు తెలిపారు. ఇందులో వ్యవసాయం, అనుబంధ కార్యక్రమాలకు 2443.96 కోట్లు కేటాయించారన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 250.60 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రుణాలకు 360.24 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. లీడ్‌బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ ...

Read More »

రాష్ట్ర మహాసభలకు తరలిన ఏబివిపి కార్యకర్తలు

  కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్గొండలో జరగనున్న ఏబివిపి రాష్ట్ర మహాసభలకు కామారెడ్డి జిల్లా నుంచి 50 మంది కార్యకర్తలు గురువారం తరలివెళ్లారు. ఏబివిపి 36వ రాష్ట్ర మహాసభలను ఈనెల 19,20,21 తేదీల్లో నల్గొండలో నిర్వహించనున్నట్టు తెలిపారు. సభల్లో నూతన అధ్యక్ష, కార్యవర్గ నియామకం, రాష్ట్ర విద్యారంగంపై చర్చలు, తీర్మానాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవస్తా ప్రముక్‌ గిరి, పూర్వ కార్యకర్తలు నరేశ్‌, సురేందర్‌, నారాయణ, బాల్‌రాజ్‌, సుధీర్‌, సంధ్య, జానకి, శైలజ, వందన తదితరులున్నారు.

Read More »

సకల నేరస్తుల సమగ్ర సర్వే

  కామరెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సకల నేరస్తుల సమగ్ర సర్వేలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లాలో జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి ఆద్వర్యంలో సర్వే నిర్వహించారు. రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా నేరస్తుల వివరాలు సేకరించి దానికి సాంకేతిక పరిజ్ఞానం జోడించి నేరాలు అదుపులోకి తెచ్చేందుకు సర్వే నిర్వహిస్తున్నట్టు ఎస్‌పి పేర్కొన్నారు. ఇది హైదరాబాద్‌లో మంచి ఫలితాన్ని ఇచ్చిందని, ఈ ఫలితాన్ని అన్నిజిల్లాల్లో ...

Read More »

ఘనంగా ఎన్‌టిఆర్‌ వర్ధంతి

  కామరెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివంగత ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వర్దంతిని కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట గల ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.డి. ఉస్మాన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చీలప్రభాకర్‌, పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్‌లు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతికి, తెలుగువారి ఆత్మగౌరవానికి వన్నె తీసుకొచ్చిన ఘనత ఎన్‌టిఆర్‌కు దక్కిందన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రపంచ తెలుగు ...

Read More »

బిజెవైఎం ఆధ్వర్యంలో దీక్ష

  నందిపేట, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో గురువారం నందిపేటలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా జిల్లా యువమోర్చా అధ్యక్షుడు న్యాలంరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలకం వేణు, కార్యదర్శి శంకర్‌గౌడ్‌ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి విద్యార్థులను, యువతను మోసం చేసిందని విమర్శించారు. రాబోయే కాలంలో విద్యార్థి యువతనే ...

Read More »

నడ్కుడలో మల్లన్నస్వామి బ్రహ్మూెత్సవాలు

  నందిపేట, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని జిజి నడ్కుడ గ్రామంలో బుధవారం మల్లన్నస్వామి బ్రహ్మూెత్సవాలు వైభవంగా ప్రారంభించారు. బుధవారం గ్రామస్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదురోజులపాటు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం రథోత్సవం ఉంటుందని, శనివారం బోనాలు, ఆదివారం అగ్ని గుండంతో ఉత్సవాలు ముగుస్తాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదం చేయాలని గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రమీల, కట్ట మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ముస్లింల విద్యాభివృద్దే ఎంఐఎం లక్ష్యం

  నందిపేట, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఐఎం (మజ్లీస్‌ పార్టీ) అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఓవైసి ముస్లింల అభివృద్దిపై ప్రత్యేక చొరవ తీసుకొని, ముస్లింలలోని నిరక్షరాస్యతను తొలగించడానికి విద్యాపరంగా వెనకబడిఉన్న ముస్లిం మైనార్టీ విద్యార్థులు చదువుకొని ముందుకు సాగాలని పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్‌ నగర డిప్యూటి మేయర్‌ ఫయిముద్దీన్‌ తెలిపారు. గురువారం నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులకు ఆయన ...

Read More »

పాతనేరస్తుల కదలికపై పోలీసుల సమగ్ర సర్వే

  నందిపేట, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా పాత నేరస్తుల కదలికలు తెలుసుకోవాల్సిందిగా డిజిపి మహేందర్‌రెడ్డి పోలీసు కమీషనర్‌లకు సూచించారు. దీంతో నందిపేట పోలీసులు నేరస్తుల సమగ్ర సర్వే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా గురువారం పోలీసు స్టేషన్‌ పరిధిలోని పాత నేరస్తులపై విచారణ చేపట్టడానికి ఆర్మూర్‌ రూరల్‌ సిఐ లక్ష్మినర్సింహస్వామి, ఎన్‌ఐబి డిఎస్‌పి రవిందర్‌, ఎస్‌ఐ సంతోస్‌ ఆధ్వర్యంలో 8 బృందాలుగా ఏర్పడి 128 మంది నేరస్తుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో నేరాలు ...

Read More »

జిజి కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోగల ప్రభుత్వ గిరిరాజ్‌ కళాశాల విద్యార్థులకు జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కరెంట్‌ ట్రెండ్స్‌ ఇన్‌ అప్లయిడ్‌ బయోలాజీ అనే అంశంపై అవగాహన కార్యక్రమం గురువారం రెండోరోజు కొనసాగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా రిసోర్సు పర్సన్‌ డాక్టర్‌ శివాజీ, డైరెక్టర్‌ ఎల్‌.వి.ప్రసాద్‌, డాక్టర్‌ గీత, డీన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ డాక్టర్‌ శివాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శివాజీ మాట్లాడుతూ కన్నీటి గ్రంథులలో కల్చరో, కంటిలో పెరిగే ...

Read More »

నేరస్తుల సమగ్ర సర్వే ప్రారంభించిన సిపి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ల పరిధిలో గురువారం నుంచి సకల నేరస్తుల సమగ్ర సర్వే కార్యక్రమాన్ని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రారంభించారు. ఉదయం 3వ టౌన్‌ పరిధిలో సర్వే ప్రారంభించారు. అనంతరం సిపి మాట్లాడుతూ డిజిపి మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు సకల నేరస్తుల సమగ్ర సర్వే చేస్తున్నట్టు తెలిపారు. గత పదిసంవత్సరాల నుంచి నేరాలు చేస్తున్నవారి రికార్డులు నమోదు చేస్తున్నామని, వారి పూర్తిస్థాయి వివరాలు ...

Read More »

సమాచార ఉపసంచాలకునిపై మంత్రికి ఫిర్యాదు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ సమచార ఉపసంచాలకుడు ముత్తుజా అలీపై తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ప్రతినిధులు గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల సాయిలు మాట్లాడుతూ జిల్లా సమాచార శాఖ ఉపసంచాలకుడు విలేకరులకు జారీచేసిన అక్రిడేషన్లలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనేకమంది సీనియర్‌ జర్నలిస్టులకు, వివిధ పత్రికలకు, టి.వి.చానెళ్ళకు అక్రిడేషన్‌ కమిటీలో మంజూరు చేసినప్పటికి ...

Read More »

తెరాసలో చేరిన పలువురు నాయకులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో గురువారం వర్ని మండల కేంద్రంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు తెరాసలో చేరుతున్నారన్నారు. బంగారు తెలంగాణే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రికి తామందరం అండగా ఉండి బంగారు తెలంగాణ సాకారం చేసుకుందామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజి.గౌడ్‌, ...

Read More »

మొక్కలు నాటిన స్వచ్చంద సేవాసంస్థ ప్రతినిధులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని గౌతంనగర్‌లో స్వామి సేవాప్రవాహం సంస్థ ప్రతినిధులు గురువారం తెల్లవారుజామున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్‌ నవాతె శ్రీనివాస్‌ మాట్లాడుతూ తమ సంస్త ద్వారా పేద విద్యార్తులకు పుస్తకాలు పంపిణీ చేశామని, దాంతోపాటు సామాజిక సేవగా మొక్కలు నాటడం, స్వచ్చభారత్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే ఉగాది పురస్కరించుకొని నగరంలో పలు వెనకబడిన కాలనీలు గుర్తించి పేదలకు తమకు తోచినవిధంగా ఆర్తిక సాయం ...

Read More »

గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తు గురువారం కలెక్టరేట్‌ వద్ద ఐఎఫ్‌టియు వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.దాసు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజా ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తే వారికి తక్కువ వేతనాలు ఇచ్చి సమస్యలతో ఊపిరాడకుండా చేయడం దుర్మార్గమని అన్నారు. గతంలో పాలకులు సఫాయి కార్మిక ...

Read More »

నాడు ఆతిధ్యం – నేడు శిథిలం

  నిజాంసాగర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ పరిధిలోని మహ్మద్‌నగర్‌లోని విశ్రాంతి గృహం ఆలనా పాలన కరువై శిథిలావస్థకు చేరింది. 1931లో సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్మించిన ఈ భవనం ఇక్కడికి వచ్చిన అతిథులకు ఉపయోగకరంగా ఉండేది. కొన్ని సంవత్సరాల నుంచి భవనాన్ని పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. దీంతోపాటు అచ్చంపేట శివారులో సాగర్‌కు సంబంధించిన 20 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేసి ఉపయోగించుకోవడానికి అవకాశమున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆందోళన ...

Read More »

రహదారి పనులు పరిశీలించిన మంత్రి

  నిజాంసాగర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి – బాన్సువాడ రహదారి నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం పరిశీలించారు. మెండి సడక్‌ వద్ద జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించి కల్వర్టుల నిర్మాణంలో అలసత్వంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే విద్యుత్‌ లైన్లు మార్చి పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించండి

  నిజాంసాగర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ఎక్కడ విద్య ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ది చెందుతుందని కాంగ్రెస్‌ నాయకులు ఒడ్డేపల్లి సుభాష్‌రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని అడవిలింగాల వద్ద డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నిర్మాణ పనులు చేపట్టకపోవడం ఆందోళనకరమన్నారు. ఎల్లారెడ్డి డివిజన్‌లో ప్రభుత్వ డిగ్రీకళాశాల ఉన్నా ఉదయం పూట ఇంటర్‌ తరగతులు, మధ్యాహ్నం వేళ డిగ్రీ తరగతులు నడుపుతున్నారని ఇది విద్యార్థులకు సౌకర్యంగా లేదని అన్నారు. కాబట్టి ...

Read More »

ఘనంగా కుస్తీ పోటీలు

  బీర్కూర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అల్లం ప్రభు జాతర పురస్కరించుకొని నసురుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామంలో గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుస్తీపోటీలకు మల్లయోధులు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చారు. చివరి కుస్తీ రూ. 2 వేలకు గెలిచిన మల్లయోధునికి ఆలయ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి నగదు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరుక శ్రీనివాస్‌, జడ్పిటిసి కిషన్‌ నాయక్‌, సర్పంచ్‌ బత్తుల ...

Read More »