Breaking News

Daily Archives: January 19, 2018

జివో 83 రద్దుచేయాలి

  గాంధారి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెలవుల మంజూరు విషయంలో ఎస్‌జిటి ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలిగిస్తున్న జివో 83ని వెంటనే రద్దుచేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం గాంధారి మండల విద్యాశాఖాధికారి సేవ్లా నాయక్‌కు ఉపాధ్యాయులు వినతి పత్రం సమర్పించారు. ఈ జీవో ద్వారా ఎస్‌జిటి ఉపాధ్యాయుల సెలవులు మంజూరు కొరకు పాఠశాలల కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయుల ద్వారా కానీ, ఎంఇవో ద్వారా కానీ సెలవులు మంజూరు చేసుకోవాలి. దీంతో ఎస్‌జిటి ఉపాధ్యాయులకు చాలా ఇబ్బందులు ...

Read More »

అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇస్తుందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. శుక్రవారం ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో ఎస్‌సి సంఘ భవనానికి రూ. 4 లక్షలు సిడిపి నిధుల ద్వారా మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క కులానికి కమ్యూనిటి భవనం ఉండడం మంచి పరిణామమని, వీటివల్ల కులస్తుల మధ్య సఖ్యత పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. సిఎం ...

Read More »

సకల నేరస్తుల సమగ్ర సర్వే ఓ కుట్ర

  – సిపిఐ (ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సకల నేరస్తుల సమగ్ర సర్వే ఓ మహా కుట్ర అని సిపిఐ (ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు ఆరోపించారు. శుక్రవారం ఈ విషయంపై నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయకు వినతి పత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. సర్వే ప్రజా ఉద్యమకారులను వేధించడానికి, సమాజం కోసం నిరంతరం పోరాడే వారిని ఇబ్బంది పెట్టేవిధంగా ఉందని, దీనివల్ల ...

Read More »

మాదిగ విద్యార్థి మహాసభ గోడప్రతుల ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 30న హైదరాబాద్‌లో జరిగే మాదిగ విద్యార్థి మహాసభ గోడప్రతుల ఆవిష్కరణ శుక్రవారం నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ విద్యార్థి జేఏసి అధ్యక్షుడు శేఖర్‌ మాట్లాడారు. ఎస్‌సిలను ఏ,బి,సి,డిలుగా వర్గీకరించడంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని, రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఈనెల 30న ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థులు, మేదావులను ఏకతాటిపైకి తెచ్చేందుకు సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ...

Read More »

వైద్యులకు అదనపు బాధ్యతలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు శుక్రవారం నుంచి అదనపు బాద్యతలు అందిస్తున్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్‌ రాజారాంకు డిప్యూటి సూపరింటెండెంట్‌ పదవి కల్పిస్తు ఉత్తర్వులు జారీచేశారు. డాక్టర్‌ హరీశ్‌ చంద్రరెడ్డికి ఆర్‌ఎంఓగా, డాక్టర్‌ కుమారస్వామికి ఆర్‌ఎంఓ (క్యాజువాలిటి)గా, డాక్టర్‌ వెంకట్‌ లకావత్‌కు ఆర్‌ఎంఓ (రేడియాలజి)గా, డాక్టర్‌ కృష్ణానాయక్‌కు ఆర్‌ఎంఓ (సానిటేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌)గా, డాక్టర్‌ ఫరీదా బేగమ్‌కు ఆర్‌ఎంఓ (ల్యాబ్‌)గా బాధ్యతలు ...

Read More »

నగరేశ్వరాలయంలో సామూహిక కుంకుమార్చన

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని నగరేశ్వర మందిరంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. శుక్రవారం వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అర్చన చేశారు. వాసవీ క్లబ్‌ సీనియర్‌ సిటిజన్‌ నిజామాబాద్‌ మండలం వనిత క్లబ్‌ వారు నిర్వహించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ పెద్దసాయిబాబా, అర్చకులు విజయ్‌శర్మ, క్లబ్‌ ప్రధాన కార్యదర్శి బాశెట్టి ...

Read More »

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం కోటగిరి మండలం బస్వాపూర్‌ గ్రామంలో 2.52 కోట్లతో నిర్మించనున్న 50 రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలను గుర్తించి రెండు పడక గదుల ఇల్ళ నిర్మాణాలు చేపడుతుందని, అర్హులైన లబ్దిదారులు ఇల్లు మంజూరు కాలేదని బాధ పడకూడదని, అందరిని గుర్తించి వారికి ఇల్లు కేటాయిస్తామని మంత్రి అన్నారు. దేశంలో ...

Read More »

బాన్సువాడ అభివృద్దికి అఖిలపక్ష నేతల సలహాలు

  నిజాంసాగర్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన స్వగృహంలో అఖిలపక్షం నేతలతో సమావేశమయ్యారు. బాన్సువాడ పట్టణ అభివృద్ది కోసం తమవంతు సలహాలు, సూచనలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నేతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాసాని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి అభివృద్ది పనుల కోసం ఉపయోగించాలని సూచించారు. ఆధారాలు ఉన్నా ...

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆకుల లలిత

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ ఆకుల లలిత శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్‌ నగరంలో ఖలీల్‌వాడి ప్రాంతంలో కమ్యూనిటి భవన నిర్మాణానికి రూ. 5 లక్షల నిదులు మంజూరు చేశారు. అనంతరం జక్రాన్‌పల్లి మండలం పడ్కల్‌ గ్రామంలో ఎమ్మెల్సీ నిధులతో మంజూరైన రూ. 5 లక్షలతో కమ్యూనిటి భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మాధవనగర్‌ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ...

Read More »

నాణ్యత లోపం – పట్టించుకోని అధికారులు

  నిజాంసాగర్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌అండ్‌బి శాఖలో అభివృద్ది పనులు గుత్తేదారులకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రధాన రహదారులు, గ్రామీణ రహదారుల మరమ్మతులతో పాటు కల్వర్టుల నిర్మాణ పనుల్లో గుత్తేదారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలేయడంతో నిర్మాణాలు మూన్నాళ్ళ ముచ్చటగా మారుతున్నాయి. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతుల కోసం ప్రతి సంవత్సరం కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తున్నా పనులు మాత్రం బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతున్నాయి. బాన్సువాడ, ఎల్లారెడ్డి, మద్నూర్‌ ...

Read More »

తహసీల్‌ కార్యాలయంలో వాటరింగ్‌ డే

  గాంధారి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో శుక్రవారం వాటరింగ్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని మొక్కలకు తహసీల్దార్‌ లక్ష్మణ్‌ నీరందించారు. కార్యాలయ ఆవరణలో సుమారు వంద మొక్కలతో ఆహ్లాదకర వాతావరణంలో చక్కని వనాన్ని ఏర్పాటు చేయించారు. తహసీల్దార్‌ ప్రతిరోజు మొక్కల సంరక్షణ చేస్తారు. నాటిన మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందిస్తు పెంచుతున్నారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Read More »

నిజామాబాద్‌ పోలీసుల పనితీరు భేష్‌

  – రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కమీషనరేట్‌ల పర్యటనలో భాగంగా శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు శాంతిబద్రతలు కాపాడడంలో మంచి పనితీరు కనబరుస్తున్నారన్నారు. నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ సిబ్బంది చేస్తున్న పనులు, వారి సౌకర్యాలు, ఎంతమంది సిబ్బంది ఉన్నారో పూర్తి సమాచారం తెలుసుకోవడం ...

Read More »

పకడ్బందీగా నేరస్తుల సమగ్ర సర్వే

  గాంధారి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నేరస్తుల సమగ్ర సర్వే పకడ్బందీగా కొనసాగుతుందని కామారెడ్డి జిల్లా ఎస్‌పి శ్వేతా అన్నారు. శుక్రవారం గాంధారి మండలంలో కొనసాగుతున్న మాజీ నేరస్తుల సమగ్ర సర్వే కార్యక్రమాన్ని జిల్లా ఎస్‌పి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ నేరస్తులతో మాట్లాడారు. గతంలో చేసిన నేరాలు, ప్రస్తుతం వారి జీవనశైలి, కుటుంబ పరిస్థితులు, ఇప్పుడు ఏమి చేస్తున్నారు వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈసర్వే ద్వారా నేరాలను అదుపు చేసేందుకు వీలుంటుందన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు ...

Read More »

పాఠశాల అభివృద్దికి సహకరించండి

  నిజాంసాగర్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల అభివృద్దికి సహకరించాలని మండల విద్యాధికారి బలరాం నాయక్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంఇవో కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లోగల గ్రామస్థాయి నుంచి పాఠశాలలు, ఆవాస ప్రాంత పాఠశాలల వివరాలు సేకరించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల నైపుణ్యాలు, అదేవిధంగా బడిలోని పిల్లలు, బడిబయటి పిల్లల వివరాలు రూపొందించాలన్నారు. నివేదికను జిల్లా అధికారులకు పంపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ...

Read More »

తహసీల్దార్‌కు ఉపాధ్యాయుల వినతి

  బీర్కూర్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ తపస్‌ మండల శాఖ తరఫున సిపిఎస్‌ కు వ్యతిరేకంగా ఏపిఎస్‌ సాధనే లక్ష్యంగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులందరు నిరసనలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తహసీల్దార్‌ కిష్టానాయక్‌కు వినతి పత్రం సమర్పించడంతో పాటు తహసీల్‌ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. వెంటనే సిపిఎస్‌ను రద్దుచేసి ఓపిఎస్‌ను పునరుద్దరించాలని, జివో 83ని రద్దుచేసి ఉపాధ్యాయుల సెలవులకు పాత విధానాన్నే ...

Read More »