Breaking News

Daily Archives: January 20, 2018

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద విడుదలైన చెక్కులు శనివారం స్తానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ బాధిత కుటుంబాలకు అందజేశారు. నియోజకవర్గంలోని 13 మందికి రూ. 3 లక్షల సిఎం సహాయ నిది చెక్కులు విడుదలైనట్టు తెలిపారు. వాటిని బాధిత కుటుంబాలకు అందజేశామన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో సిఎం సహాయనిధి కింద రూ. 6 కోట్ల సహాయం అందించినట్టు పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు చంద్రశేఖర్‌, బల్వంత్‌రావు, గైని శ్రీనివాస్‌, లక్ష్మినారాయణ, జూకంటి ...

Read More »

మానువల్‌ పహాణి కార్యక్రమం త్వరగా పూర్తిచేయాలి

  కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల భూ ప్రక్షాళనకు సంబంధించి జరుగుతున్న మాన్యువల్‌ పహాణి కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. శనివారం మాచారెడ్డి మండల తహసీల్‌ కార్యాలయంలో జరుగుతున్న రెవెన్యూ రికార్డుల మానువల్‌ పహాణి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలని, క్రాస్‌ చెక్‌ చేసుకోవాలని, రికార్డులను పకడ్బందీగా తయారుచేయాలని సూచించారు. కార్యక్రమంలో మాచారెడ్డి తహసీల్దార్‌ శ్యామల, ...

Read More »

విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో స్కాలర్‌షిప్‌లు జమచేయాలి

  కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని విద్యార్థుల బ్యాంకు ఖాతాలు సేకరించి వాటిలో స్కాలర్‌షిప్‌లు జమచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వివిధ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్ళు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వసతి గృహ అధికారులకు సూచించారు. శనివారం తన చాంబరులో అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే క్లియర్‌ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు బ్యాంకు ఖాతాలు వినియోగించుకోకపోతే వాటిని రినివల్‌ లేదా పున: ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 30న ...

Read More »

టి మాస్‌ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభం

  కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టి మాస్‌ ఆధ్వర్యంలో దోమకొండ తహసీల్‌ కార్యాలయం ముందు శనివారం రిలే దీక్షలు ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తహసీల్‌ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టినట్టు టిమాస్‌ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటి సభ్యులు సిద్దిరాములు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ప్రజా సమస్యలపై తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించినప్పటికి సమస్య పరిష్కారం కాలేదన్నారు. పోచమ్మవీధిలో మంచినీటి సమస్యతోపాటు గ్రామంలో రోడ్డు సమస్యలు, ఇతరత్రా సమస్యలు నెలకొన్నాయన్నారు. ...

Read More »

ఘనంగా మార్కండేయ జయంతి

  బాన్సువాడ, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో శనివారం మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పద్మశాలి సంఘంతోపాటు ఇతర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. శనివారం ఉదయం నుంచే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి జంగం విజయ, నాయకులు గంగాధర్‌, సంఘ పెద్దలు పాల్గొన్నారు.

Read More »

వైభవంగా మార్కండేయ జయంతి

  కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలో శనివారం మార్కండేయ జయంతి వేడుకలను పద్మశాలీలు వైభవంగా నిర్వహించారు. మార్కండేయ జయంతిని పురస్కరించుకొని పద్మశాలీలు వేలాదిగా తరలివచ్చి కళశాలతో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు కళశాలను నెత్తినబెట్టుకొని బ్యాండు మేళాలతో యాత్రలో పాల్గొన్నారు. పట్టణ పద్మశాలి భవనం ముందు ప్రారంభమైన శోభాయాత్ర పాతబస్టాండ్‌, రైల్వే వంతెన మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌ మీదుగా స్నేహపురి కాలనీలోని మార్కండేయ మందిరం వరకు సాగింది. అనంతరం మహిళలు కళశాలతో తెచ్చిన నీటిని ...

Read More »

ఎమ్మెల్సీని కలిసిన సారంగాపూర్‌ ఫ్యాక్టరీ కార్మికులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సారంగాపూర్‌ చక్కర కర్మాగారం కార్మికులు శనివారం ఎమ్మెల్సీ ఆకుల లలితను కలిసి తమ వెతలను వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా ప్యాక్టరీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, గత మూడు సంవత్సరాలుగా తమకు ఎలాంటి వేతనం అందడం లేదని, ఎమ్మెల్సీ జోక్యం చేసుకొని తమకు వేతనాలు ఇప్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి వేతనాలు ఇప్పించడంలో ప్రభుత్వంతో ...

Read More »

సరస్వతి స్వాముల పాదయాత్ర

  బాన్సువాడ, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని జ్ఞాన విద్యాసరస్వతి దేవి ఆలయం నుంచి భక్తులు, దీక్షాస్వాములు శనివారం బాసర ఆలయానికి పాదయాత్రగా బయల్దేరారు. సరస్వతి దీక్ష చేపట్టిన స్వాములు భక్తి శ్రద్దలతో మండల దీక్ష పూర్తవుతున్న సందర్భంగా ప్రతియేటా ఆనవాయితీగా పాదయాత్రగా బయల్దేరారు. వసంతపంచమి పర్వం దగ్గర్లో ఉండడంతోదీక్షాస్వాములు బాసర ఆలయాన్ని సందర్శించుకుంటారు. సుమారు 60 కి.మీ.లు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. స్వాములతో పాటు ఆయా గ్రామాల మహిళలు, విద్యార్థులు, సాధారణ భక్తులు సైతం పాదయాత్రలో పాల్గొన్నారు. ...

Read More »

అఖిలపక్ష బంద్‌ విజయవంతం

  కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిగ్రీ కళాశాల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని దున్నడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తోపాటు అన్ని పార్టీల నాయకులు, విప్లవ సంఘాల నేతలు, కార్మిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాణిజ్య, వ్యాపార సంస్థల ప్రతినిధులు, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు స్వచ్చందంగానే బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని ...

Read More »

ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న పాలకులు

  – బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతుల రవి నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో మిషన్‌ భగీరథ, భూగర్భ మురికి కాలువల పనుల కొరకు రోడ్లను తవ్వి పునర్నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై రాష్ట్ర బిజెవైఎం కార్యవర్గ సభ్యులు దొంతుల రవి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల డైవర్షన్‌, వన్‌వేలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని శుక్రవారం నాందేవ్‌వాడ ఘటన, కంఠేశ్వర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఇందుకు ...

Read More »

బాలింత మృతి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రెంజల్‌ మండలం నీలా గ్రామానికి చెందిన కొమ్మల జ్యోతి అనే బాలింత మృతి చెందింది. రెండ్రోజుల క్రితం ప్రసవం కొరకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి రాగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. శనివారం బాలింత పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రయివేటు ఆసుపత్రికి రిఫర్‌ చేసే సమయంలో మృతి చెందింది. ఈ ఘటనపై బాధిత బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి సంఘీభావంగా సిపిఐ ...

Read More »

ప్రమాదాల నివారణకు చర్యలు

  బీర్కూర్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపడుతున్నామని బాన్సువాడ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌ అన్నారు. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో గత కొన్ని రోజుల క్రితం ప్రమాదాలు జరిగిన వివిధ సంఘటనలలో ముగ్గురు మరణించారు. వారి ప్రమాదాలకు గల కారణాలు తెలుసుకోవడానికి సిఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణ కమిటీ ఆయా మండలాల్లో ప్రమాదాలు జరిగిన స్థలాలు శనివారం పరిశీలించారు. బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులో ట్రాక్టర్‌ ఢీకొని ...

Read More »

పాఠశాలలో బెంచీల వితరణ

  బీర్కూర్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి, మైలారం పాఠశాలలో మైలారం గ్రామానికి చెందిన మేకల సాయిలు తన తండ్రి మేకల హన్మాండ్లు జ్ఞాపకార్థం శనివారం మైలారం పాఠశాలలో 25 బెంచీలు, ప్రొజెక్టర్‌, దుర్కి గ్రామ పాఠశాలలో 15 బెంచీలు అందజేశారు. ఈ సందర్భంగా పిఆర్‌టియు కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్‌ మాట్లాడుతూ పుట్టిన గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, పిఆర్‌టియు నసురుల్లాబాద్‌ ...

Read More »

వార్డ్‌ ఎన్నికలలో నామినేషన్‌

  బీర్కూర్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో 8వ వార్డు ఎన్నికల్లో భాగంగా శనివారం నసురుల్లాబాద్‌ గ్రామనికి చెందిన పాషా బేగం నామినేషన్‌ వేసినట్లు ఎంపిడివో భరత్‌కుమార్‌ తెలిపారు. దివంగత వార్డు మెంబర్‌ బాబూమియ భార్య పాషాబేగం నామినేషన్‌ వేశారని, తనకు తెరాస పార్టీ మద్దతు ఉందని గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు లక్ష్మినారాయణ గౌడ్‌ అన్నారు. ఎంపిటిసి కంది మల్లేశం, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More »