Breaking News

బాలింత మృతి

 

నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రెంజల్‌ మండలం నీలా గ్రామానికి చెందిన కొమ్మల జ్యోతి అనే బాలింత మృతి చెందింది. రెండ్రోజుల క్రితం ప్రసవం కొరకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి రాగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. శనివారం బాలింత పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రయివేటు ఆసుపత్రికి రిఫర్‌ చేసే సమయంలో మృతి చెందింది. ఈ ఘటనపై బాధిత బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి సంఘీభావంగా సిపిఐ (ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు అక్కడికి చేరుకొని వైద్యుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేసుకోవాలని ప్రజలకు సూచిస్తుండగా మరోవైపు వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మాటలు కేవలం ప్రకటనలకు మాత్రమేనని, వాస్తవ రూపంలో అలా జరగడం లేదని ఆయన అన్నారు. కొద్దిసేపు ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు చేరుకొని బాధితులను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Check Also

భీమ్‌గల్‌ ఉత్తరాధి మఠం ఆధ్వర్యంలో ఆహార వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరమ పూజ్య శ్రీ సత్యాత్మ తీర్థ యొక్క దైవిక ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *