Breaking News

Daily Archives: January 22, 2018

8 ఎకరాల్లో రాశివనం ఏర్పాటు

  కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొత్తం 8 ఎకరాల స్థలంలో రాశివనం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన సంయుక్త కలెక్టర్‌ సత్తయ్యతో కలిసి రాశివనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాశివనంలో పూల మొక్కలు, పండ్ల మొక్కలతో పాటు ఇతర మొక్కలను నాటినట్టు తెలిపారు. లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పండ్ల తోటల విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాశివనం ...

Read More »

ఘనంగా అక్షరాభ్యాసం వేడుకలు

  కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అక్షర ఉన్నత పాఠశాలలో సోమవారం వసంతి పంచమి పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాస వేడుకలు నిర్వహించారు. సరస్వతి పుట్టినరోజు పర్వదినాన అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలకు సరస్వతి కటాక్షం కలుగుతుందని ప్రిన్సిపాల్‌ సంగీతరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఛైర్మన్‌ అశోక్‌రెడ్డి, కరస్పాండెంట్‌ లోకేశ్‌రెడ్డి, ఇన్‌చార్జి రామ్మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి

  కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవ వేడులు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. సోమవారం జనహిత భవనంలో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిపబ్లిక్‌ డే సందర్భంగా అన్ని శాఖలు తమ శకటాలు ప్రదర్శించాలన్నారు. జాతీయ జెండాను సరైన పద్దతిలో ఎగురవేయకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల 24న మంత్రి పోచారం 50 పడకల ఆసుపత్రితోపాటు డయాలసిస్‌ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ...

Read More »

కామారెడ్డి పట్టణ ముదిరాజ్‌ సంఘం కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ముదిరాజ్‌ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పట్టణ సంఘం అధ్యక్షునిగా మల్లేశ్‌, ఉపాధ్యక్షునిగా చింతల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా పిట్ల స్వామి, సహాయ కార్యదర్శిగా బట్టు శ్రీనివాస్‌, కోశాధికారిగా రాజు, కార్యవర్గ సభ్యులుగా నర్సింలు, అంజయ్య, ఆశయ్య, సంతోష్‌, రమేశ్‌, రాజశేఖర్‌, రాజేందర్‌ తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం నేతలు పోచయ్య, బాలయ్య, నర్సింలు, మంద బాల్‌రాజ్‌, పున్న రాజేశ్వర్‌, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి

  కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు మంచి ఆలోచనలు, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామరెడ్డి సిఎస్‌ఐ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 1988-89 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు విద్యార్థుల పరీక్షలు పూర్తయ్యేవరకు 45 రోజుల పాటు అల్పాహారం అందించడం పట్ల అభినందించారు. విద్యార్థులు ఒత్తిళ్లకు లోనుకాకుండా పరీక్షలకు సన్నద్దం కావాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ...

Read More »

ప్రభుత్వ హామీలు అమలయ్యేలా చూడాలి

  కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలని టిమాస్‌ జిల్లా కమిటీ ప్రతినిధులు సోమవారం కలెక్టర్‌ సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిమాస్‌ ఆధ్వర్యంలో జిల్లాలో పదిరోజుల పాటు సర్వే నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమకు సమస్యలు విన్నవించినట్టు తెలిపారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ, రెండు పడక గదుల ఇళ్ళు, కెజి నుంచి పిజి ఉచిత విద్య, ...

Read More »

మే నెలలో ఎకరానికి రూ.4 వేలు పెట్టుబడి అందిస్తాం

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీర్కూర్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకరానికి 4 వేల రూపాయల పెట్టుబడి అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నసురుల్లాబాద్‌ మండలం మిర్జాపూర్‌ గ్రామంలో నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును సోమవారం మంత్రి పోచారం, జహీరాబాద్‌ ఎంపి బిబిపాటిల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మే 1వ తేదీ నుంచి 10 ...

Read More »

పల్స్‌పోలియోపై అవగాహన

  బీర్కూర్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని మండల అభివృద్ది కార్యాలయంలో సోమవారం అంగన్‌వాడి కార్యకర్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు పల్స్‌పోలియో కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వైద్యుడు దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి 5 సంవత్సరాల చిన్నారి వరకు పోలియో చుక్కలు తప్పకుండా వేయాలని అన్నారు. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాలు కలిసి 6 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యం పెట్టుకున్నామని ఆయా మండలాల్లో ప్రజలను ...

Read More »

పాఠశాల ప్రహరీగోడ ప్రారంభం

  బీర్కూర్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రహరీగోడ, గేటును సోమవారం మండల అధ్యక్షులు మల్లెల మీణ హన్మంతు ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల ప్రహరీగోడ శిథిలావస్థకు చేరడంతో గ్రామానికి చెందిన ఎంపిటిసి మల్లేశం తన స్వంత ఖర్చులతో ఆధునీకరించడం అభినందనీయమన్నారు. ప్రహరీ శిథిలావస్థలో ఉన్నపుడు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని, మద్యం సీసాలు పాఠశాల ఆవరణలో దర్శనమిచ్చేవని, ఉపాధ్యాయులు సంప్రదించగానే స్పందించి గోడ నిర్మాణం చేపట్టామని, తాను చదివిన ...

Read More »