Breaking News

భక్తుల సౌకర్యార్థం బోరుమోటారు ప్రారంభం

 

బీర్కూర్‌, జనవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ గ్రామ శివారులోని సర్వాపూర్‌ హనుమాన్‌ ఆలయం వద్ద స్థానిక ఎంపిటిసి కంది మల్లేశం మంగళవారం కొత్తగా బోరు వేయించారు. ఆలయం వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉండి తాగునీటి సదుపాయం లేకపోవడంతో ఆలయం వద్ద తన స్వంత ఖర్చులతో బోరు వేయిస్తున్నామన్నారు. రాబోయే వేసవి కాలంలో భక్తులకు, దారి వెంబడి వెళ్ళేవారికి, కూలీలకు, వన్య ప్రాణులకు దీనిద్వారా దాహార్తి తీర్చవచ్చని పేర్కొన్నారు.

Check Also

ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

బీర్కూర్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగబోతున్న దుబ్బాక ఉప ఎన్నికలు ...

Comment on the article