Breaking News

ఘనంగా రాజరాజేశ్వర ఆలయ వార్షికోత్సవం

 

గాంధారి, జనవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండలంలోని బూర్గుల్‌ గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గత మూడురోజులుగా ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఆలయంలోని శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఇటీవలే ఆలయానికి మరమ్మతులు చేసి నూతనంగా నిర్మించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఆయన వెంటతెరాస నాయకులు ముకుంద్‌రావు, శివాజీరావు, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌, చందానాయక్‌, గ్రామ సర్పంచ్‌ రవి, ఎంపిటిసి సాయిలు, గ్రామస్తులు ఉన్నారు.

Check Also

కరోనా డ్రై రన్‌లో నిర్లక్ష్యం ..మెడికల్‌ ఆఫీసర్‌ పై బదిలీ వేటు

గాంధారి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా డ్రై రన్‌లో మెడికల్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ...

Comment on the article