Breaking News

Daily Archives: January 24, 2018

క్యాలెండర్‌ ఆవిష్కరణ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం 2018 క్యాలెండర్‌ను బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లడి గంగాధర్‌ మాట్లాడుతూ 14 సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ఇంతవరకు అమలుకు నోచుకోలేదని, పథకాలు పెంచి కార్మికులకు న్యాయం చేయాలని, నిరవధిక సమ్మెలో పెట్టిన డిమాండ్‌లన్నింటిని కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. ఈ ...

Read More »

పేదలకు అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందించడమే లక్ష్యం

  కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి అత్యున్నత ప్రమాణాలతో పేదలకు వైద్యం అందించడమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి 100 పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. నూతన రక్తనిధి కేంద్ర భవనాన్ని ప్రారంబించారు. నూతన డయాలసిస్‌కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వైద్య ...

Read More »

స్వర్ణకార భవనానికి రూ. 5 లక్షల నిధులు మంజూరు

  కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం కమ్యూనిటి భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ రూ. 5 లక్షలు మంజూరుచేసినట్టు స్వర్ణకార సంఘం ప్రతినిధులు తెలిపారు. నిధులు విడుదల చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పట్టణ అద్యక్షుడు కైలాష్‌శ్రీనివాస్‌రావుతోపాటు స్వర్ణకార సంఘం ప్రతినిదులు వై.బ్రహ్మం, బ్రహ్మం, చక్రపాణి, విష్ణుమూర్తి, రాఘవులు, ముకుందం తదితరులు ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు.

Read More »

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న జంతుగణన

  కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జంతుగణన నిర్వహిస్తున్నట్టు కామారెడ్డి అటవీశాఖ డిఎఫ్‌వో రేఖభాను తెలిపారు. మూడురోజుల నుంచి జిల్లాలో జంతుగణన నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అక్కాపూర్‌, నాగిరెడ్డిపేట్‌, ధర్మారెడ్డి, ఆరుగొండ, సంతాయిపేట బీట్‌ పరిదిలో చిరుతపులి అడుగుజాడలను గుర్తించినట్టు చెప్పారు. మాచారెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట అటవీరేంజ్‌ పరిధిలో 65 బీట్‌ల పరిధిని పరిశీలించినట్టు తెలిపారు. జంతువుల ఆనవాళ్లు సేకరించి సంబందిత నివేదికలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. 22,23,24 మూడురోజుల పాటు ...

Read More »

ప్రమాదవశాత్తు రైలుకింద పడి వ్యక్తి మృతి

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వేస్టేషన్‌ మెయిన్‌ లైన్‌నుంచి ఉప్పలవాయి మధ్యలో బుధవారం ఓ వ్యక్తి పట్టాలు దాటుతూ రైలు కింద పడిమృతి చెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడిని కామారెడ్డి పట్టణం బతుకమ్మ కుంటకు చెందిన గడ్డమీది నర్సింగ్‌ (56) గా గుర్తించినట్టు తెలిపారు. ఇతను సహస్ర బార్‌లో లేబర్‌ పనిచేస్తున్నట్టు చెప్పారు. మృతునికి భార్య, కూతురు ఉన్నట్టు తెలిపారు. కాగా కేసు నమోదు చేశామన్నారు.

Read More »

నిరుపేదలకు కార్పొరేట్‌ తరహాలో వైద్యసేవలు

  కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఆయన రూ. 7 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రానికి శంకుస్థాపనతోపాటు కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్‌ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో 50 పడకల, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అదనంగా 50 పడకల గది, డయాలసిస్‌కు ...

Read More »

సింధీభవన్‌లో పెర్మల్‌ ఆక్యుప్రెషర్‌ వ్యాయామ థెరఫి ప్రారంభం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని సింధీ భవన్‌లో న్యూ లైప్‌ సెంటర్‌ ఆద్వర్యంలో పెర్మల్‌ ఆక్యుప్రెషర్‌ వ్యాయామ థెరఫి బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్బంగా నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ థెరపి ద్వారా చక్కరవ్యాధి, బిపి తదితర వ్యాధులను నియంత్రించవచ్చని, ఊపిరితిత్తుల మంట, కాలేయం, కడుపునొప్పి తదితర రోగాలను కూడా నియంత్రించవచ్చని, ప్రతిరోజు థెరఫి ద్వారా చికిత్సపొందితే మూడునెలల్లో మంచి ఫలితాలుంటాయని అన్నారు. థెరఫి వల్ల ఎలాంటి దుష్రప్రభావాలు ఉండవని ఆయన వివరించారు. ...

Read More »

డబ్లింగ్‌ లైన్‌ పనులకు చర్యలు తీసుకుంటాం

  – దక్షిణమధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు, నిజామాబాద్‌ నుంచి ఔరంగాబాద్‌ వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో డబ్లింగ్‌ లైన్‌ పనులకు చర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం జిల్లా పర్యటన నిమిత్తం నిజామాబాద్‌కు వచ్చిన ఆయన రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలందించేందుకు అన్ని ...

Read More »

రూ. 85 లక్షలతో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం

  కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ. 85 లక్షలతో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం ఆయన కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్నిరోజుల క్రితం జరిగిన గూడ్సు రైలు ప్రమాదం, అందులో ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు. ఇలాంటివి పునారవృతం కాకుండా ఉండేందుకు ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మించనున్నట్టు తెలిపారు. ఆరునెలల లోపు డబ్లింగ్‌లైన్‌ పనులు ...

Read More »

గాంధారి ఆసుపత్రిలో సమస్యలు పరిస్కరించాలి

  గాంధారి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి స్థానిక జడ్పిటిసి తానాజీరావు వినతి పత్రం అందజేశారు. బుధవారం కామారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ఆయన గాంధారి మీదుగా బాన్సువాడకు వెళ్తు గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ చౌరస్తా వద్ద మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్‌తో కలిసి కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా జడ్పిటిసి తానాజీరావు ...

Read More »

ఘనంగా రథ సప్తమి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందూరు కంఠాభరణం నీలకంఠేశ్వరాలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రథసప్తమి సందర్భంగా నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నీలకంఠేశ్వర ఆలయంలో నగర ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంభునిగుడి, చక్రేశ్వరాలయం, రామాలయం, సాయిబాబా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అదేవిధంగా సాయంతం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

4న ఎమ్మెల్యే పర్యటన

  గాంధారి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుర్జాల్‌ గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవిందర్‌ రెడ్డి గురువారం పర్యటిస్తున్నట్టు మండల తెరాస అధ్యక్షుడు ముకుంద్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ, అంగన్‌వాడి, కమ్యూనిటి హాల్‌ భవనాలను ప్రారంభిస్తారని అలాగే శ్మశానవాటికకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. గురువారం ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఈ కార్యక్రమానికి తెరాస కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ...

Read More »

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

  నందిపేట, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ తక్షణమే కల్పించాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సమీర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆర్మూర్‌ తహసీల్‌ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఒకరోజు నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రభుత్వం కల్లబొల్లి మాటల గారడితో కాలం వెల్లదీస్తుందని ...

Read More »

బబ్లూ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

  గాంధారి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన బబ్లూ కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. గత మూడురోజుల క్రితం గాంధారి మండలం సోమారం తండాకు చెందిన రాథోడ్‌ బబ్లూ నిజామాబాద్‌లో భవనంపై నుండి ప్రమాదవశాత్తు కిందకుపడి మృతి చెందాడు. మృతుడు బబ్లు పెట్‌సంగం పాఠశాల పిఇటి లక్ష్మణ్‌ రాథోడ్‌ సోదరుని కుమారుడు. కాగా మంగళవారం ఎమ్మెల్యే సోమారం తండాలోని మృతుని నివాసానికి వెళ్ళి కుటుంబసభ్యులను, లక్ష్మణ్‌ రాథోడ్‌ లను ...

Read More »