Breaking News

Daily Archives: January 25, 2018

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం

  నందిపేట, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఓటు వజ్రాయుధం లాంటిదని నందిపేట తహసీల్దార్‌ ఉమాకాంత్‌ అన్నారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నందిపేటలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నందివిగ్రహ కూడలి వద్ద జరిగిన ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరు విదిగా ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు. విద్యార్థి దశనుంచే ఓటరుపై అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌, ...

Read More »

మాచారెడ్డి గ్రామ విఆర్వోపై సస్పెన్షన్‌ వేటు

  కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి గ్రామ రెవెన్యూ అధికారి పరమేశ్వర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం, ప్రజలను, అధికారులను తప్పుదోవ పట్టించడం, డబ్బులు వసూలు చేయడంపై అందిన ఫిర్యాదు మేరకు ఆర్డీఓ విచారణ చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ మేరకు విచారణ చేసి పరమేశ్వర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశామన్నారు. సస్పెన్షన్‌ కాలంలో అతను హెడ్‌క్వాటర్‌ దాటి వెళ్లకూడదని ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు.

Read More »

సిఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళ్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి సంబంధించిన చెక్కులను గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ లబ్దిదారులకు పంపిణీ చేశారు. మాచారెడ్డి మండలంలోని 9 మంది లబ్దిదారులకు 6.27 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్న మాచారెడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన యాదగిరిగౌడ్‌కు 3 లక్షల రూపాయల సహాయనిధి చెక్కు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన ...

Read More »

విలువైన ఓటుహక్కును అందరు వినియోగించుకోవాలి

  కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటుహక్కు అతి విలువైందని దాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా వినియోగించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. 8వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గురువారం ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. సరైన నాయకులను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోవడం ద్వారా సుస్తిర ఆర్థికాభివృద్ది జరుగుతుందన్నారు. వయోజనులను, కొత్త ఓటర్లను నిరంతరాయంగా ఎన్‌రోల్‌ చేసుకోవాలని సూచించారు. ...

Read More »

గణతంత్ర దినోత్సవానికి ముస్తాబవుతున్న కార్యాలయాలు

  బీర్కూర్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ఆయా ప్రభుత్వ కార్యాలయాలు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగురంగుల కాగితాలతో ముస్తాబవుతున్నాయి. పాఠశాలలో ఆటలపోటీలు ఘనంగా నిర్వహించారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో గ్రామ యువకులకు షెటిల్‌ పోటీలను తహసీల్దార్‌ సంజీవరావు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాయిలు, ఎంపిటిసి మల్లేశం, ప్రధానోపాధ్యాయులు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

కెసిఆర్‌ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి

  గాంధారి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుర్జాల్‌ గ్రామంలో వివిధ అభివృద్ది పనుల్లో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో నూతనంగా 15.5 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, ఎస్‌సి కమ్యూనిటి భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా గ్రామ ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న శివాజీ విగ్రహ ...

Read More »

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

  గాంధారి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో రెవెన్యూ అధికారులు ర్యాలీ నిర్వహించారు. మండలంలోని పోతంగల్‌ కలాన్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఎన్నికలలో ఏవిధంగా ఓటు వేయాలి, ఓటు వేసే సందర్భంలో ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. బ్యాలెట్‌ పద్దతిన ఓటు వేసే విధానాన్ని నేర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్‌, ఉపాధ్యాయులు ప్రతాప్‌, స్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి యువ ఓటరు భాగస్వామ్యం కావాలి

  కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి యువ ఓటరు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. 8వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలో గురువారం 2 కె రన్‌ నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్‌తోపాటు సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, ఎస్‌పి శ్వేతారెడ్డి, ఆర్డీవో శ్రీనులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ ఓటర్లను వందశాతం నమోదు చేయాలని అన్నారు. ఆత్మప్రబోదం, విచక్షణతో ఓటర్లు చైతన్యవంతులు కావాలని సూచించారు. ప్రతి ...

Read More »

పోలియో ఆదివారం విజయవంతం చేయాలి

  గాంధారి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 28న పోలియో ఆదివారాన్ని విజయవంతం చేయాలని గాంధారి మండల వైద్యాధికారి షాహీద్‌ అలీ పిలుపునిచ్చారు. గురువారం గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంగన్‌వాడి వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28న పోలియో ఆదివారం కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలన్నారు. పోలియో రహిత మండలంగా ముందు వరుసలో ఉండటానికి కృషి చేయాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి అందరు ...

Read More »

ఓటుకు నోటు పద్దతి మార్చాలి

  బీర్కూర్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటుకు నోటు అనే పద్ధతిని మార్చాలని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండల తహసీల్దార్‌లు కిష్టనాయక్‌, సంజీవ్‌రావులు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా మండల కేంద్రాల్లో పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కిష్టానాయక్‌ మాట్లాడుతూ ప్రజలు ఓటుకు నోటు అనే పద్ధతిని మార్చుకొన్నప్పుడే మంచి నాయకుని ఎన్నుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి విధిగా ఓటుహక్కు నమోదు చేసుకోవాలని అన్నారు. ...

Read More »

వడ్డెరలకు రెండు పడక గదుల ఇళ్ళకు రుణాలు కల్పించాలి

  నందిపేట, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వడ్డెరలకు రెండు పడక గదుల ఇళ్లకు బిసి కార్పొరేషన్‌ ద్వారా రుణాలు కల్పించాలని వడ్డెర జేఏసి రాష్ట్ర నాయకుడు దండి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. నందిపేట తహసీల్‌ కార్యాలయం వద్ద వడ్డెరలకు రెండు పడక గదుల ఇళ్ళకు రుణాలు కల్పించాలని కోరుతూ జేఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వడ్డెరలకు ఇళ్లులేక గుడిసెల్లో జీవిస్తున్నందున రెండు పడక గదుల ఇళ్లు, బిసి కార్పొరేషన్‌ ద్వారా రుణాలు ...

Read More »

విద్యార్తులకు క్రీడా దుస్తుల పంపిణీ

  నందిపేట, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్తులకు గురువారం నిజామాబాద్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఉల్లి శ్రీనివాస్‌గౌడ్‌ క్రీడా దుస్తులు అందజేశారు. దాతలు అశోక్‌గౌడ్‌, శ్రీనుగౌడ్‌, లింగం, భూమేశ్‌లు కలిపి రూ. 35 వేలు విలువగల క్రీడా దుస్తులను గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బహుకరించినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంఇవో లింగన్న, ఎంపిటిసి బాలగంగాధర్‌, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ దిగంబర్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్‌రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు ...

Read More »

చాగంటి కోటేశ్వర్‌రావును కలిసిన ఇందూరు వాసులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావును నిజామాబాద్‌నగరానికి చెందిన పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, ప్రతినిదులు గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలో కలిశారు. ఈ సందర్భంగా చాగంటిని ఇందూరు నగరానికి ఆహ్వానించగా ఆయన ఈ విషయంపై ఆసక్తి కనబరిచి జూలై నెలలో ఇందూరు నగరానికి వస్తానని, చారిత్రక నిలయమైన ఇందూరు అంటే తనకు ఎంతో ఇష్టమని, త్రివేణి సంగమం కందకుర్తి ఎంతో ఇష్టమని, తప్పకుండా ఇందూరును సందర్శిస్తానని ఆయన తెలిపారు. ...

Read More »

28న కమ్మ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 28 న హైదరాబాద్‌ రోడ్డులోగల బర్దిపూర్‌ సుగుణగార్డెన్స్‌లోకమ్మ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కమ్మ సంక్షేమ సంఘం కార్యదర్శి, తెరాస నాయకులు ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కమ్మ కులస్తుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, పేద కమ్మ విద్యార్థులకు అఖిలభారతీయ పరీక్షలకు, గ్రూపు పరీక్షలతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన ...

Read More »

ఓటు వజ్రాయుధం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశ పౌరులందరికి ఓటు వజ్రాయుదంలాంటిదని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఓటు హక్కు ఆవశ్యకత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటుహక్కు పొందాలని ఆయన సూచించారు. జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, ఓటుహక్కుపై ప్రజలందరికి అవగాహన కల్పించాలని ...

Read More »