Breaking News

Daily Archives: January 26, 2018

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముమ్మర తనిఖీలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిజామాబాద్‌ రూరల్‌ సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రూరల్‌ పోలీసులు నగర శివారు ప్రాంతాల్లో వాహనాలు ముమ్మర తనిఖీలు చేపట్టారు. శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సిఐ పేర్కొన్నారు. తనిఖీల్లో రూరల్‌ ఎస్‌ఐ శ్రీధర్‌గౌడ్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Read More »

జిల్లాలో 86.55 శాతం ఓడిఎఫ్‌ పూర్తి

  కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 86.55 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నామని స్వచ్ఛభారత్‌ ప్రేరక్‌ రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు మూడు మండలాలు, 218 గ్రామ పంచాయతీలను బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించుకున్నట్టు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మరో నాలుగు మండలాలను ఓడిఎఫ్‌ మండలాలుగా ప్రకటించుకోనున్నట్టు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 10 రాష్ట్రాలు, 300 జిల్లాలు, 2 లక్షల గ్రామాలు స్వచ్చభారత్‌ మిషన్‌ ద్వారా బహిరంగ ...

Read More »

విదేశీ విద్యానిది పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని బిసి, ఇబిసి విద్యార్థులు మహాత్మ జ్యోతిబాఫూలే బిసి విదేశీ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బిసి సంక్షేమాధికారి దేవిదాస్‌ తెలిపారు. 2017-18 సంవత్సరానికి గాను విదేశాలకు చదువుకోసం వెళ్లదలచిన విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31 వరకు తేదీ పొడిగించినట్టు తెలిపారు. వివరాలకు ష్ట్ర్‌్‌జూ://షషష.్‌వశ్రీaఅస్త్రaఅaవజూaరర.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read More »