Breaking News

Daily Archives: January 27, 2018

పంచాయతీ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలి

  కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నాయకులు శనివారం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన విరమించుకొని స్థానిక సంస్థలకు కాలానుగుణంగానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఆ ఎన్నికలు ప్రత్యక్ష పద్దతిలోనే నిర్వహించాలని కోరారు. తాండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, షెడ్యూల్‌ ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని డిమాండ్‌ ...

Read More »

కొనసాగుతున్న శాఖాహార జంతువుల గణన

  కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలో జాతీయ జంతు గణనలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో జంతువుల గణన కొనసాగుతుంది. మాంసాహార జంతువుల గణన అనంతరం శాఖాహార జంతువుల గణన చేపడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం జిల్లాలోని ఆయా అటవీప్రాంతాల్లో అటవీశాఖ సిబ్బందితోపాటు బేస్‌ క్యాంప్‌ సిబ్బంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిఎస్‌సి ఫారెస్ట్రీ విద్యార్థులు, పలు స్వచ్చంద సంస్థలు జంతు గణనలో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు జంతు గణన ...

Read More »

గంగిరెద్దుల వారికి సన్మానం

  కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గంగిరెద్దులను ఆడిస్తూ జీవనోపాధి సాగిస్తున్న సంచారజాతి వ్యక్తిని శనివారం బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పుట్ట మల్లికార్జున్‌ మాట్లాడుతూ గంగిరెద్దులు ఆడిస్తూ, ఊరూరా తిరుగుతూ ప్రజలు ఇచ్చే పారితోషికంతో జీవనం సాగిస్తున్నవారికి ప్రభుత్వం కళాకారులుగా గుర్తించి వారికి ప్రతినెల రూ. 5 వేల జీవనభృతి అందించాలని, మూడెకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని, రుణ సదుపాయం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు ...

Read More »

పోలియో ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌

  కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం పోలియో ర్యాలీని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో ఆయనతోపాటు డిఎం అండ్‌ హెచ్‌వో చంద్రశేఖర్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌, అంగన్‌వాడి అధికారిణి రాధమ్మ, అడ్మినిస్ట్రేషన్‌ అధికారి రాజు, మాస్‌ మీడియా అధికారి శ్రీనివాస్‌ రావులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేడ్కర్‌ కూడలి, నిజాంసాగర్‌ కూడలి, మునిసిపల్‌ కార్యాలయం, బస్టాండ్‌ మీదుగా సిఎస్‌ఐ ...

Read More »

మాజీ సైనికోద్యోగుల కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సైని ఉద్యోగుల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు సంఘం ప్రతినిదులు తెలిపారు. శనివారం నిర్వహించిన మొట్టమొదటి సర్వసభ్య సమావేశంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. అధ్యక్షునిగా రాజరెడ్డి, ఉపాధ్యక్షునిగా సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బాలకిషన్‌, కార్యదర్శిగా గంగాధర్‌, కోశాధికారిగా మహిపాల్‌రెడ్డి, ముఖ్య సలహదారులుగా భూపాల్‌రెడ్డి, తాపిరెడ్డి, రాజేశ్వర్‌రావులను ఎన్నుకున్నట్టు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని మాజీ సైనికుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Read More »

ఆలయాల అభివృద్దికి కృషి చేస్తా

  – ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి గాంధారి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలయాల అభివృద్దికి కృషి చేస్తూనే తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. శనివారం గాంధారి మండలంలోని గుడిమేట్‌ మహాదేవుని గుట్టపై శివపార్వతుల కళ్యాణంతోపాటు నెరల్‌ తాండాలో ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుట్టపై నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ...

Read More »

అఖిలభారతీయ భగవద్గీత ప్రచారమండలి అధ్యక్షునిగా నరేందర్‌రావు షిండే

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిలభారతీయ భగవద్గీత ప్రచార మండలి అధ్యక్షునిగా నరేందర్‌రావు షిండే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం స్థానిక గీతాభవన్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ప్రధాన కార్యదర్శిగా మేడిచర్ల ప్రభాకర్‌, నిర్మల్‌ నుంచి ఆరుగురిని, బోధన్‌ నుంచి నలుగురు, నిజామాబాద్‌ 11 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది ఎం.ఎస్‌.ఆచార్య వ్యవహరించారు. అనంతరం పలు దార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో గీతా భవన్‌ అధ్యక్షుడు ...

Read More »

బంటు హన్మంత్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ లలిత

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బంటు హన్మంత్‌రెడ్డిని ఎమ్మెల్సీ ఆకుల లలిత శనివారం పరామర్శించారు. హన్మంత్‌రెడ్డి తల్లి గత వారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.

Read More »

ఫిబ్రవరి 18,19 తేదీల్లో అంగన్‌వాడి రాష్ట్ర మహా సభలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 18,19 తేదీల్లో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అంగన్‌వాడి రాష్ట్ర మహసభలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ అంగన్‌వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు తెలిపారు. శనివారం సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడిల సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, వారి హక్కుల పరిరక్షణ, ఇతర అంశాలపై సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఐసిడిఎస్‌ను సంస్థాగతం చేయాలని, అంగన్‌వాడిలను ప్రభుత్వ ఉద్యోగులుగా ...

Read More »

పంచాయతీ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలి

  – డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను పరోక్ష పద్దతిలో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు, ఈ ప్రతిపాదన విరమించుకొని ప్రత్యక్ష పద్దతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నిజామాబాద్‌ ఆర్డీవోకు వినతి పత్రం అందజేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెరాస ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు ఇవ్వకుండా నిర్వీర్యం ...

Read More »

పనుల అలసత్వంపై బిజెపి ఆగ్రహం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో జరుగుతున్న మిషన్‌ భగీరథ, యుజిడి పనులపై బిజెపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. శనివారం నగరంలోని నాందేవ్‌వాడ శివాజీ చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పనులు నత్తనడకన కొనసాగిస్తుందని, దీనివల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కమీషన్ల కాసులకు కక్కుర్తిపడి నాయకులు, అధికారులు కుమ్ముక్కై ప్రజల ప్రాణాలతో ...

Read More »

హోటల్‌ వంశీ శాఖాహార ఫుడ్‌మేళ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకేంద్రంలోని ప్రముఖ మూడు నక్షత్రాల హోటల్‌ వంశీ ఇంటర్నేషనల్‌లో పుడ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు మేనేజర్‌ బాపూజీ తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శాఖాహార ఫుడ్‌ మేళా ప్రారంభించామని, ఇందులో సంప్రదాయ వంటకాలు, గ్రామీణ వంటకాలు అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు. మేళ ఆదివారంతో ముగుస్తుందని, కేవలం 249 రూపాయలకే అన్ని రుచులుగల శాఖాహార విందును ఆరగించవచ్చని తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

Read More »

5 సం||లోపు చిన్నారులందరికి పోలియో చుక్కలు వేయించాలి

  – జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికి తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌ నుంచి వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 28వ తేదీ ఆదివారం రోజున పోలియో కేంద్రాల్లో, 29, 30 తేదీల్లో ఇంటింటా తిరుగుతూ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. ...

Read More »