Breaking News

ఆలయాల అభివృద్దికి కృషి చేస్తా

 

– ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డి

గాంధారి, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలయాల అభివృద్దికి కృషి చేస్తూనే తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. శనివారం గాంధారి మండలంలోని గుడిమేట్‌ మహాదేవుని గుట్టపై శివపార్వతుల కళ్యాణంతోపాటు నెరల్‌ తాండాలో ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుట్టపై నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గుట్టపై వరకు భక్తులు రావడానికి ఇబ్బందులు లేకుండా పూర్తిగా సిసి రోడ్డుకు నిధులు మంజూరు చేశారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మిషన్‌ భగీరథ ద్వారా గుట్టపై వరకు పైప్‌లైన్‌ ద్వారా నీటిని అందిస్తామన్నారు. అదేవిధంగా ఆశ్రమం నిర్వహణ కొరకు ఆశ్రమానికి గుట్టపై ఉన్న ప్రభుత్వ భూమి కేటాయించి పరిసర ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నెరల్‌ తాండా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భగవంతునికి సేవచేయడానికి అవకాశం కల్పించిన ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కరక్‌వాడి ఉద్యానవన శాఖ ద్వారా మంజూరైన స్ప్రింక్లర్‌లను, పైపులను 21 మంది లబ్దిదారులకు అందజేశారు. అదేవిధంగా గతంలో పంపిణీ చేసిన గొర్రెలను, గొర్రెపిల్లలను పరిశీలించారు. రైతులకు వ్యవసాయానికి అవసరమైన అన్ని పనిముట్లను సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు ముకుంద్‌రావు, శివాజీరావు, సర్వపూర్‌ సత్యం పటేల్‌, శ్రీకాంత్‌రెడ్డి, సీతాయిపల్లి శ్రీనివాస్‌, శంకర్‌, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article