Breaking News

పంచాయతీ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలి

 

– డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌

నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను పరోక్ష పద్దతిలో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు, ఈ ప్రతిపాదన విరమించుకొని ప్రత్యక్ష పద్దతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నిజామాబాద్‌ ఆర్డీవోకు వినతి పత్రం అందజేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెరాస ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని, పరోక్ష పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తే డబ్బున్నవారే సర్పంచ్‌ పదవులు చేపడతారని, ఇది నియంతృత్వ ధోరణికి బీజం వేసినట్టు అవుతుందని, ఇప్పటికే గ్రామాల్లో గ్రామాభివృద్ది కమిటీల పేరుతో అమాయ ప్రజలను బలిపశువులను చేస్తున్నారని, రాజ్యాంగ బద్దంగా జరిగే సర్పంచ్‌ ఎన్నికలను కూడా పరోక్ష పద్దతి ద్వారా నిర్వహిస్తే విడిసిలకు, గ్రామపంచాయతీలకు తేడా ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ ఎల్లయ్య, కాంగ్రెస్‌ నాయకులు మహేశ్‌కుమార్‌గౌడ్‌, బంటు బలరాం, అరికెల నర్సారెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చలేగా అని నినదించారు

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాల‌యంలో ...

Comment on the article